ఆదివారం, జూన్ 28, 2020

ఇన్ని రాశుల యునికి...

శ్రుతిలయలు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ అన్నమాచార్య కీర్తనకు అందమైన వివరణ ఇక్కడ చూడవచ్చు. 
 

చిత్రం : శృతిలయలు (1987)
సంగీతం : కే.వి.మహదేవన్ 
సాహిత్యం : అన్నమాచార్య
గానం : బాలు, వాణిజయరాం 

ఇన్ని రాశుల యునికీ ఇంతి చెలువపు రాశి 
ఇన్ని రాశుల యునికీ ఇంతి చెలువపు రాశి 
కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి ఇంతి చెలువపు రాశి

ఇన్ని రాశుల యునికీ ఇంతి చెలువపు రాశి 
ఇన్ని రాశుల యునికీ ఇంతి చెలువపు రాశి 
కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి ఇంతి చెలువపు రాశి

కలికి బొమవిండ్లు గల కాంతకును ధనురాశి
మెలయు మీనాక్షికినీ మీనరాశి
కలికి బొమవిండ్లు గల కాంతకును ధనురాశి
మెలయు మీనాక్షికినీ మీనరాశి
కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి
వెలుగు హరి మధ్యకును సింహరాశి

ఇన్ని రాశుల యునికీ ఇంతి చెలువపు రాశి 
కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి 
ఇంతి చెలువపు రాశి

చిన్ని మకరాంకపు పయ్యెద చేడెకు మకరరాశి
కన్నె ప్రాయపు సతికీ కన్నె రాశి
చిన్ని మకరాంకపు పయ్యెద చేడెకు మకరరాశి
కన్నె ప్రాయపు సతికీ కన్నె రాశి
వన్నెమై పైడి తులదూగు వనితకున్ తులరాశి
వన్నెమై పైడి తులదూగు వనితకున్ తులరాశి
తిన్నని వాడిగోళ్ళ సతికి వృశ్చిక రాశి 

ఇన్ని రాశుల యునికి ఇంతి చెలువపు రాశి

ఆముకొను మొరపుల మెరయు నతివకు వృషభ రాశి 
గామిడి గుట్టు మాటల సతికి కర్కటక రాశి
ఆముకొను మొరపుల మెరయు నతివకు వృషభ రాశి 
గామిడి గుట్టు మాటల సతికి కర్కటక రాశి
కోమలపు చిగురు మోవి కోమలికి మేషరాశి
ప్రేమ వేంకటపతి కలిసే ప్రియ మిథున రాశి
ప్రేమ వేంకటపతి కలిసే ప్రియ మిథున రాశి

ఇన్ని రాశుల యునికీ ఇంతి చెలువపు రాశి 
కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి 
ఇంతి చెలువపు రాశి 
 

2 comments:

అన్ని పాటలూ బావుంటాయి ఈ సినిమాలో..

అవునండీ అన్ని పాటలూ చాలా బావుంటాయీ సినిమాలో.. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.