శుక్రవారం, జూన్ 26, 2020

కలకాలం ఇదే పాడనీ...

కెప్టెన్ కృష్ణ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : కెప్టెన్ కృష్ణ (1979)
సంగీతం : బాలు
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఏహే..హే..హె..ఆ..ఆ..హా..ఆ...ఆ..
కలకాలం ఇదే పాడనీ..ఈ..ఈ..
నీలో నన్నే చూడనీ...ఈ..ఈ..

కలకాలం ఇదే పాడనీ..ఈ..ఈ..
నీలో నన్నే చూడనీ...

నీ... వలపుల లోగిలిలో విహరించనీ...
నీ... వెచ్చని కౌగిలిలో నిదురించనీ...
నీ... వలపుల లోగిలిలో విహరించనీ...
నీ... వెచ్చని కౌగిలిలో నిదురించనీ..

నీ నయనాలలో నను నివశించనీ...
నీ నయనాలలో నను నివశించనీ...
మన ప్రేమనౌక ఇలా సాగనీ..ఈ..

కలకాలం ఇదే పాడనీ..ఈ..ఈ..
నీలో నన్నే చూడనీ...

జన్మ జన్మల నీ హృదయరాణినై 
ఈ అనుబంధం పెనవేయనీ...ఈ..ఈ..
జన్మ జన్మల నీ హృదయరాణినై 
ఈ అనుబంధం పెనవేయనీ..

ఈ ప్రేమ గీతికా ఒక తీపి గురుతుగా 
నా కన్నులలో వెన్నెలలే కురిపించనీ...
నీడల్లె నీ వెంట నేనుండగా...
బ్రతుకంత నీతోనే పయనించగా...

కలకాలం ఇదే పాడనీ..ఈ..ఈ..
నీలో నన్నే చూడనీ...

ఈ జంటకు తొలిపంట ఈ రూపము...
నా కంటికి వెలుగైన చిరుదీపము...
ఈ జంటకు తొలిపంట ఈ రూపము...
నా కంటికి వెలుగైన చిరుదీపము..
ఈ చిరునవ్వులే వేయి సిరిదివ్వెలై...
ఈ చిరునవ్వులే వేయి సిరిదివ్వెలై...
వెలగాలి కోటి చందమామలై...

కలకాలం ఇదే పాడనీ..ఈ..ఈ..
నీలో నన్నే చూడనీ...ఈ..ఈ..
కలకాలం ఇదే పాడనీ..ఈ..ఈ..
నీలో... నన్నే చూడనీ... 
 

4 comments:

ఈ పాట ఎప్పుడు విన్నా చాలా సేపు గుర్తొస్తుంటుంది..

అవునండీ.. ట్యూన్ అలాంటిది.. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

Beautiful song composed by SPB Garu. Susheelamma and Balu Garu golden voices. బుద్దిమంతుడు సినిమాలోని గుట్టమీద గువ్వ కూసింది పాటను తలపిస్తుంది.

ఇంట్రస్టింగ్ కంపారిజన్ అండీ.. థ్యాంక్స్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.