గురువారం, జూన్ 25, 2020

ఔరా అమ్మక చెల్లా...

ఆపద్భాంధవుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 
 

చిత్రం : ఆపద్భాంధవుడు (1992)
సంగీతం : కీరవాణి 
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర
 
ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లా
అంత వింత గాథల్లో ఆనందలాలా

బాపురే బ్రహ్మకు చెల్లా.. వైనమంత వల్లించవల్లా
రేపల్లె వాడల్లో ఆనంద లీలా

ఐనవాడే అందరికీ..  ఐనా అందడు ఎవ్వరికి
ఐనవాడే అందరికీ..  ఐనా అందడు ఎవ్వరికి

బాలుడా?..  గోపాలుడా?.. 
లోకాల పాలుడా?
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా!
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా!

ఔరా అమ్మకచెల్లా! ఆలకించి నమ్మడమెల్లా
అంత వింత గాథల్లో ఆనందలాలా 

ఊ..ఊ..నల్లరాతి కండలతో.. హోయ్.. కరుకైనవాడే
ఊ..ఊ.. వెన్నముద్ద గుండెలతో.. హోయ్.. కరుణించు తోడే
నల్లరాతి కండలతో కరుకైనవాడే ఆ నందలాల
వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే ఆనందలీల

ఆయుధాలు పట్టను అంటూ.. 
బావ బండి తోలిపెట్టే ఆ నందలాల
జాణ జానపదాలతో జ్ఞాన గీతి 
పలుకునటే ఆనందలీల

బాలుడా?...  గోపాలుడా?... 
లోకాల పాలుడా?..
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా!

ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లా
అంత వింతగాథల్లో ఆనందలాలా..
బాపురే బ్రహ్మకు చెల్లా.. వైనమంత వల్లించవల్లా
రేపల్లె వాడల్లో ఆనంద లీలా ...

ఆలమంద కాపరిలా కనిపించలేదా ఆ నందలాల
ఆలమందు కాలుడిలా అనుపించు కాదా ఆనందలీల
వేలితో కొండను ఎత్తే.. కొండంత వేలుపటే ఆ నందలాల
తులసీ దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల

బాలుడా?... గోపాలుడా?... 
లోకాల పాలుడా?...
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా

ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లా
అంత వింతగాథల్లో ఆనందలాలా
బాపురే బ్రహ్మకు చెల్లా వైనమంత వల్లించవల్లా
రేపల్లె వాడల్లో ఆనంద లీలా

ఆనందలాలా... ఆనంద లీలా
ఆనందలాలా... ఆనంద లీలా
ఆనందలాలా... ఆనంద లీలా 

 
 

4 comments:

బ్యూటిఫుల్ లిరిక్స్ యెండ్ సాంగ్..

అవునండీ.. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

అద్భుత మయిన లిరిక్స్. అమ్మక్కచెల్ల, చాంగు భళ పదాలు అన్నమయ్య ప్రయోగించారు.
ఆలమంద కాపరి, ఆలమందు కాలుడు విశిష్ట పద ప్రయోగం.

అవునండీ.. థ్యాంక్స్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.