కటకటాల రుద్రయ్య చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : కటకటాల రుద్రయ్య (1978)
సంగీతం : జె.వి. రాఘవులు
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల
వీణ నాది..తీగ నీది
తీగ చాటు రాగ ముంది..
పువ్వు నాది..పూత నీది..
ఆకుచాటు అందముంది..
వీణ నాది..తీగ నీది..
తీగ చాటు రాగ ముంది..
తీగ చాటు రాగ ముంది...
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ హుహు
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్మ్ హుహు
తొలిపొద్దు ముద్దాడగానే
ఎరుపెక్కె తూరుపు దిక్కూ
తొలిచూపు రాపాడగానే
వలపొక్కటే వయసు దిక్కూ
వరదల్లే వాటేసి మనసల్లే మాటేసి
వయసల్లే కాటేస్తే చిక్కు
తీపిముద్దిచ్చి తీర్చాలి మొక్కు
వీణ నాది తీగ నీది
తీగ చాటు రాగ ముంది
తీగ చాటు రాగ ముంది
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ హుహు
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్మ్ హుహు
మబ్బుల్లో మెరుపల్లే కాదూ
వలపు వాన కురిసీ వెలిసి పోదూ
మనసంటే మాటలు కాదూ
అది మాట ఇస్తే మరచి పోదూ
బ్రతుకల్లే జతగూడి
వలపల్లె ఒనగూడి
వొడిలోనే గుడి కట్టే దిక్కు
నా గుడి దీపమై నాకు దక్కూ
వీణ నాది తీగ నీది
తీగ చాటు రాగ ముంది
పువ్వు నాది పూత నీది
ఆకుచాటు అందముంది
వీణ నాది.. తీగ నీది..
తీగ చాటు రాగ ముంది
తీగ చాటు రాగ ముంది
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ హుహు
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్మ్ హుహు
10 comments:
This is one of the best duets by P Susheelamma Garu and SPB Garu. Great music and lyrics.
అవునండీ.. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సాంగ్స్.. థ్యాంక్స్..
మంచి పాట వేణూ
వివిధ భారతి లో తెగ వేసే వాళ్ళు
సుశీల గొంతు బాగా ఫాం లో ఉన్న రోజుల్లో పాట
అవునండీ రేడియోలో బాగా విన్నపాట ఇది.. థ్యాంక్స్ సుజాత గారు.
భలే పాట వేణు...మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు ఈ సాంగ్ పెట్టుకుని వింటూ వెళ్ళా ఈ రోజు .ఎంత బాగుందో...
ఓహ్ సో నైస్ నేస్తం గారు.. థ్యాంక్సండీ :-)
హాంటింగ్ సాంగ్..
అవునండీ.. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..
thank you for posting the lyrics
థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ సర్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.