మంగళవారం, జూన్ 02, 2020

కాశ్మీరు లోయలో...

పసివాడి ప్రాణం చిత్రంలోని ఒక సూపర్ హిట్ సాంగ్ ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సినిమా రిలీజైన రోజుల్లో చిత్రలహరిలో ప్రతి సారి ఈ పాట వేసేవాడు.


చిత్రం : పసివాడి ప్రాణం (1987)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి  

కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో
ఓ సందమామ ఓ సందమామ
కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో
ఓ సందమామ ఓ సందమామ


పొగరాని కుంపట్లు రగిలించినాదే
పొగరెక్కి చలిగాణ్ణి తగిలేసినాడే
చెమ్మాచెక్క చేత చిక్క
మంచమల్లె మారిపోయె
మంచు కొండలు

మంచిరోజు మార్చమంది
మల్లె దండలు

కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో
ఓ సందమామ ఓ సందమామ
కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో
ఓ సందమామ ఓ సందమామ


తేనీటి వాగుల్లో తెడ్డేసుకో
పూలారబోసేటి ఒడ్డందుకో
శృంగార వీధుల్లో చిందేసుకో
మందార బుగ్గల్ని చిదిమేసుకో

సూరీడుతో ఈడు చలికాచుకో
పొద్దారిపోయాక పొద చేరుకో
గుండెలోనే పాగా గుట్టుగా వేశాక
గుత్తమైన సోకు నీదే కదా

అరె తస్సా చెక్క ఆకు వక్క
ఇచ్చుకోక ముందే ముట్టె తాంబూలము
పెళ్ళి కాక ముందే జరిగె పేరంటము

కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో
ఓ సందమామ ఓ సందమామ
కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో
ఓ సందమామ ఓ సందమామ


సింధూర రాగాలు చిత్రించుకో
అందాల గంధాల హాయందుకో

పన్నీటి తానాలు ఆడేసుకో
పరువాలు నా కంట ఆరేసుకో
కాశ్మీర చిలకమ్మ కసి చూసుకో
చిలక పచ్చ రైక బిగి చూసుకో

గూటి పడవల్లోన చాటుగా కలిశాక
నీటికైనా వేడి పుట్టాలిలే
పూత మొగ్గ లేత బుగ్గ
సొట్టబడ్డ చోట పెట్టు నీ ముద్దులు
హేయ్ సొంతమైన చోట లేవు ఏ హద్దులు


అరె కాశ్మీరు లోయలో కన్యాకుమారిరో
ఓ సందమామ ఓ సందమామ
కన్నె ఈడు మంచులో కరిగే సూరీడురో
ఓ సందమామ ఓ సందమామ

పొగరాని కుంపట్లు రగిలించినాదే
పొగరెక్కి చలిగాణ్ణి తగిలేసినాడే
చెమ్మాచెక్క హా చేత చిక్క అహ
మంచమల్లె మారిపోయె
మంచు కొండలు

మంచిరోజు మార్చమంది
మల్లె దండలు
 

4 comments:

థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారూ..

thank you for posting the lyric Srikanth garu

థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ సర్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.