ఋతుపవనాలొచ్చేశాయి వర్షాలు కూడా కురిసేస్తున్నాయి కదా ఆ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ పల్లెసీమ చిత్రంలోని ఒక అందమైన పల్లెపదాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : పల్లెసీమ (1976)
గానం : పి.సుశీల
సాహిత్యం : జాలాది
సంగీతం : కె.వి.మహదేవన్
సూరట్టుకు జారతాదీ సితుక్కు సితుక్కు వానచుక్కా..
సూరట్టుకు జారతాదీ సితుక్కు సితుక్కు వానసుక్క..
గుండెల్నే కుదిపేత్తాదీ గతుక్కు గతుక్కు ఏందేలక్కా..

కిటికీలో ఏదో మెరిసి ఇటుకంటా రమ్మంటాదీ..
తొంగి సూడబోతే జల్లు ఒళ్ళంతా తడిమేత్తాదీ..

తడిసిపోయానారేతిరీ ఆడి జిమ్మడిపోనూ..
కుదిపి సుట్టేశాడమ్మా గాలి సచ్చినోడూ.. గాలివాన గాడూ..
సూరట్టుకు జారతాదీ సితుక్కు సితుక్కు వానసుక్క..
గుండెల్నే కుదిపేత్తాదీ గతుక్కు గతుక్కు ఏందేలక్కా..
సూరట్టుకు జారతాదీ సితుక్కు సితుక్కు వానసుక్క..
పొగసూరిన ఆకాశంలో పోకిరోడూ మెరిశాడూ..
ఊరవతల సేలల్లో నను ఉరిమి ఉరిమి చూశాడూ..
పొగసూరిన ఆకాశంలో పోకిరోడూ మెరిశాడూ..
ఊరవతల సేలల్లో నను ఉరిమి ఉరిమి చూశాడూ..
సందెకాడ ఊరంతా సద్దుమణిగి నిదరోతుంటే..
సల్లంగా ఎపుడొచ్చాడో ఇల్లు ఒళ్ళు తడిపేశాడూ..
తడిసిపోయానారేతిరీ ఆడి జిమ్మడిపోనూ..
కుదిపి సుట్టేశాడమ్మా గాలి సచ్చినోడూ.. గాలివాన గాడూ..
సూరట్టుకు జారతాదీ సితుక్కు సితుక్కు వానసుక్క..
గుండెల్నే కుదిపేత్తాదీ గతుక్కు గతుక్కు ఏందేలక్కా..
సూరట్టుకు జారతాదీ సితుక్కు సితుక్కు వానసుక్క..
సూరుకింద ఖాళీ సూసి సొరవ చేసి నను చుట్టేసీ..
పదును పదును సలికోరల్తో ఉరిమి ఉరిమి ఉడికించీ..

రెపరెపలాడించేశాడూ దీపం దిగమింగేశాడూ..
నడి ఝామున లేపేశాడూ నట్టింటో కురిసెల్లాడూ..
తడిసిపోయానారేతిరీ ఆడి జిమ్మడిపోనూ..
కుదిపి సుట్టేశాడమ్మా గాలి సచ్చినోడూ.. గాలివాన గాడూ..
సూరట్టుకు జారతాదీ సితుక్కు సితుక్కు వానసుక్క..
గుండెల్నే కుదిపేత్తాదీ గతుక్కు గతుక్కు ఏందేలక్కా..
సూరట్టుకు జారతాదీ సితుక్కు సితుక్కు వానసుక్క..
3 comments:
సూరట్టుకు జారె సుమీ
వారగ చూచి కనుగొట్టె వాడే పోయా
నే రేతిర్ని తడిసి! సలి
కోరల్తో ఉరిమి ఉరిమి కుదిపేసేడే !
జిలేబి
వానలానే తమాషాగా ఉందీ పాట..
హహహ నిజమేనండీ.. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారూ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.