సోమవారం, జూన్ 22, 2020

శ్రీ సూర్యనారాయణా...

మంగమ్మ గారి మనవడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : మంగమ్మగారి మనవడు (1984)
సంగీతం : కె.వి. మహదేవన్ 
సాహిత్యం : సినారె
గానం : భానుమతి, వాణీ జయరాం

శ్రీ సూర్యనారాయణా 
మేలుకో.. మేలుకో..
మా చిలకమ్మ బులపాటము 
చూసిపో.. చుసిపో..
శ్రీ సూర్యనారాయణా 
మేలుకో.. మేలుకో..
మా చిలకమ్మ బులపాటము 
చూసిపో.. చుసిపో..
తెల్లావారకముందే 
ఇల్లంతా పరుగుల్లు.. ఆ..
చీకట్లో ముగ్గుల్లు.. చెక్కిట్లో సిగ్గుల్లు
ఏమి వయ్యారమో... ఓ.. ఓ.. ఓ..
ఎంత విడ్డూరమో.. 
హహ.. ఎంత విడ్డూరమో..

శ్రీ సూర్యనారాయణా 
మేలుకో.. మేలుకో..
మా అమ్మమ్మ ఆరాటము 
చూసిపో.. చూసిపో..
చిట్టిమనవడి రాక 
చెవిలోన పడగానే..
ముసిముసి చీకట్లో.. 
ముసలమ్మ రాగాలు
ఏమి జాగారమో.. ఓ..
ఎంత సంబరమో.. 
ఎంత సంబరమో..

సరిగంచు పైట సవరించుకున్నా 
మరీ మరీ.. జారుతుంది..
ఓసోసి మనవరాల.. ఏం జరిగింది..
ఓసోసి మనవరాల.. ఏం జరిగింది
తాతయ్యను నువ్వు తలచిన తొలినాడు 
నీకేమి జరిగిందో అమ్మమ్మ 
తాతయ్యను నువ్వు తలచిన తొలినాడు
నీకేమి జరిగిందో అమ్మమ్మ
నాకంతే జరిగిందీ అమ్మమ్మ
అమ్మదొంగా... రంగ రంగ..
అమ్మదొంగా... రంగ రంగ..

శ్రీ సూర్యనారాయణా 
మేలుకో.. మేలుకో 
మా అమ్మమ్మ ఆరాటము 
చూసిపో.. చూసిపో

కోడిని కొడితే సూర్యుణ్ణి 
లేపితే తెల్లరిపోతుందా
ఓ పిల్ల పెళ్ళిగడియ.. వస్తుందా
ఓ పిల్ల పెళ్ళిగడియ.. వస్తుందా 

దిగివచ్చి బావను క్షణమైన ఆపితే 
దేవుణ్ణి నిలదీయనా
ఓయమ్మో కాలాన్ని తిప్పేయనా

నా పిచ్చితల్లి.. ఓ బుజ్జిమల్లి.. 
నీ మనసే బంగారం
నూరేళ్ళు నిలవాలి.. ఈ మురిపం
నూరేళ్ళు నిలవాలి.. ఈ మురిపం

అమ్మమ్మ మాట ముత్యాల మూట
ఆ విలువ నేనెరుగనా.. 
ఏనాడు అది నాకు తొలిదీవెన..

శ్రీ సూర్యనారాయణా 
మేలుకో.. మేలుకో..
మా చిలకమ్మ బులపాటము 
చూసిపో.. చుసిపో..
శ్రీ సూర్యనారాయణా 
మేలుకో.. మేలుకో..
మా అమ్మమ్మ ఆరాటము.. 
చూసిపో.. చూసిపో.. 
 

2 comments:

భానుమతి అమ్మ గొంతులో యే పాటైనా అమృతం లానే ఉంటుంది..

అవునండీ భానుమతమ్మ స్వరం ఖంగుమంటూనే వినసొంపుగా ఉంటుంది.. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.