రమణ గోగుల లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రమణ గోగుల లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

సోమవారం, ఆగస్టు 10, 2020

కళకళలు కిలకిలలు...

తమ్ముడు సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 

చిత్రం : తమ్ముడు (1999)
సంగీతం : రమణగోగుల
సాహిత్యం : చంద్రబోస్
గానం : బాలు

కళకళలు కిలకిలలు
కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు
ఎదురుగా నిలిచెను మా కన్నులకి
రాముడికి జానకికి పెళ్లి కుదిరినది
ఈ సందడికి విందులకి
ఇల్లు మురిసినది
గల గల కళకళలు కిలకిలలు

కళకళలు కిలకిలలు
కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు
ఎదురుగా నిలిచెను మా కన్నులకి
రాముడికి జానకికి పెళ్లి కుదిరినది
ఈ సందడికి విందులకి
ఇల్లు మురిసినది

నమ్మలేని లోకం నుంచి
మహాలక్ష్మిలాగా
అమ్మలేని మా ఇంట్లోకి
వదినమ్మ రాకా
ఎన్నడైన తన వెనకాలే
ఉంటాను కనకా
అన్నగారు తననేమన్నా
ఊరుకోను ఇంకా
నా చిన్ని అల్లర్లన్నీ భరించాలి
అంతా ఓర్పుగా

కళకళలు కిలకిలలు
కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు
ఎదురుగా నిలిచెను మా కన్నులకి

మెట్టినింటి దీపం నీతో 
వెలగాలి మళ్లీ
కూతురంటి రూపం నీదే 
నా చిట్టితల్లి
ఆశలన్నీ అక్షింతలుగా 
జరగాలి పెళ్లి
అందమైన జంటను చూసి
మురవాలి తాళి
విడిది నేను ఇస్తానంటూ
తపించాలి నింగిన జాబిలి

కళకళలు కిలకిలలు
కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు
ఎదురుగా నిలిచెను మా కన్నులకి

 
 

ఆదివారం, జులై 05, 2020

ఈ రేయి తీయనిది...

చిట్టి చెల్లెలు చిత్రంలోని ఒక అందమైన పాటను జానీ చిత్రం కోసం రీమిక్స్ చేశారు. పల్లవిని అలాగే ఉపయోగించుకున్నా చరణాలను మార్చి రాసిన ఈ పాట మీరూ వినండి. ఒరిజినల్ కి థీటుగా సాగిన ఈ రీమిక్స్ నాకు నచ్చిన పాటలలో ఒకటి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : జానీ (2003)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
రీమిక్స్ : రమణ గోగుల 
సాహిత్యం : సినారె, సిరివెన్నెల
గానం : హరిహరన్, నందిత

ఈ రేయి తీయనిది
ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది
ఇంతకు మించి ఏమున్నది

ఏవేవొ కోరికలు ఎదలో
ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు
అల్లన దాగి వింటున్నవి


ఓ వరములా దొరికె నీ పరిచయం 
నా మనసులో కురిసెనే అమృతం 
నా నిలువునా అలలయే పరవశం 
నీ చెలిమికే చేయని అంకితం 
కోరుకునే తీరముగా ఆగెను ఈ నిమిషం 

ఏవేవొ కోరికలు ఎదలో
ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు
అల్లన దాగి వింటున్నవి

నీ ఊపిరే వెచ్చగా తగలని 
నా నుదుటిపై తిలకమై వెలగని 
నా చూపులే చల్లగా తాకని 
నీ పెదవిపై నవ్వుగా నిలవని 
ఆశలకే అయువుగా మారెను నీ స్నేహం

ఈ రేయి తీయనిది
ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది
ఇంతకు మించి ఏమున్నది
 
ఇంతకు మించి ఏమున్నది
ఇంతకు మించి ఏమున్నది

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

చిట్టి చెల్లెలు చిత్రంలోని ఒరిజినల్ వర్షన్ సంగీత సాహిత్యాలివి. ఎస్ రాజేశ్వరరావు గారి స్వరకల్పన ఎంత ఆహ్లాదంగా ఉంటుందో మాటలలో చెప్పలేం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : చిట్టి చెల్లెల్లు (1970)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల

ఈ రేయి తీయనిది
ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది
ఇంతకు మించి ఏమున్నది

ఏవేవొ కోరికలు ఎదలో
ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు
అల్లన దాగి వింటున్నవి


పన్నీటి తలపులు నిండగా
ఇన్నాళ్ళ కలలే పండగా
పన్నీటి తలపులు నిండగా
ఇన్నాళ్ళ కలలే పండగా
చిన్నారి చెలియ అపరంజి కలువ
చేరాలి కౌగిట జిలిబిలి నగవుల

ఏవేవొ కోరికలు ఎదలో
ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు
అల్లన దాగి వింటున్నవి
ఆఆఅ..ఆఅహహ..ఆహా..

పరువాలు పల్లవి పాడగా
నయనాలు సయ్యాటలాడగా
పరువాలు పల్లవి పాడగా
నయనాలు సయ్యాటలాడగా
నిను చేరుకోగ నునుమేని తీగ
పులకించి పోయెను తొలకరి వలపుల

ఈ రేయి తీయనిది
ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది
ఇంతకు మించి ఏమున్నది
 

ఎన్నెన్ని జన్మల బంధమో
ఏ పూల నోముల పుణ్యమో
ఎన్నెన్ని జన్మల బంధమో
ఏ పూల నోముల పుణ్యమో
నిను నన్ను కలిపె నీ నీడ నిలిపె
అనురాగ సీమల అంచులు దొరికే

ఈ రేయి తీయనిది
ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది
ఇంతకు మించి ఏమున్నది  
  

ఆదివారం, మార్చి 17, 2019

మేడిన్ ఆంధ్ర స్టూడెంట్...

తమ్ముడు చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : తమ్ముడు (1999)
సంగీతం : రమణ గోగుల
సాహిత్యం : చంద్రబోస్
గానం : రమణ గోగుల

తేరారర తారారే రారర తారారేరా
తేరారర తారారే రారర తారారేరా

తేరారర తారారే రారర తారారేరా
తేరారర తారారే రారర తారారేరా

దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
హోయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపూ కొంత
ఎవరూ అనుకోనంత వింతగ ఉంటే చల్తా

హే దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
అరె మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంత వింతగ ఉంటే చల్తా

హే లవ్లీ గర్ల్సే మా టార్గెట్
రిస్కెంతున్నా we don't care
Speed and fast అను సూత్రంతోనే
సెన్సేషనే సృష్టిస్తాం
మా స్టూడెంట్ లైఫే గ్రేటంటూ
మా సాటెవరూ మరి లేరంటూ
తను తలచిన పనిని తప్పక చేసే
ఆంద్రా స్టూడెంట్ కింగంటారో

హే... దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
అరె మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంత వింతగ ఉంటే చల్తా

హే దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
అరె మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంత వింతగ ఉంటే చల్తా

Rough and tough ఏ మా నైజం
రఫ్ఫాడైడం mannerism
Fashion world guys మేమని
మురిసే మీతో ఛాలెంజ్ చేస్తాం
హైటు వెయిటూ వేస్టంటూ
మా హార్టులో గట్సే బెస్టంటూ
ఈ కాలం హీరో ఆజాను బాహుడు
అవనక్కర్లేదనిపిస్తారో...

Hey... Come and get
Hey... Come and get
Hey...

దిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
హేయ్ మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంత వింతగ ఉంటే చల్తా

హే దిగిదిగితకతక దిగిదిగి తకతక దిగిదిగి తకతకతా
మేడిన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా
నలిగిన డ్రెస్సు కొంత చెదిరిన క్రాపు కొంత
ఎవరూ అనుకోనంత వింతగ ఉంటే చల్తా

డిస్కోథెక్ లో rap and pop
Every sweep లో లాలిపాప్
Shock and spark అనే సీక్రెట్ తో
మీ చిలకల మనసులు దోచేస్తాం
మా daring dashing చూపించి
Dearest darling అనిపించి
తన దిల్లుకు నచ్చిన లవరొకురుంటే
రాకెట్ స్పీడ్ తో పోతుంటారో
Hey...


ఆదివారం, ఆగస్టు 26, 2018

అన్నయ్యా అన్నావంటే...

మిత్రులందరకూ రాఖీ శుభాకాంక్షలు అందజేస్తూ ఈ సంధర్బంగా అన్నవరం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అన్నవరం (2006)
సంగీతం : రమణ గోగుల
సాహిత్యం : చంద్రబోస్
గానం : మనో, గంగ

అన్నయ్యా అన్నావంటే ఎదురవనా
అలుపై ఉన్నావంటే నిదరవనా
కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా
కలతై ఉన్నావంటే కథనవనా
అమ్మలో ఉండే సగం అక్షరం నేనే
నాన్నలో రెండో సగం లక్షణం నేనే

అమ్మ తోడు.. నాన్న తోడు..
అన్నీ నీకు అన్నే చూడు 
 
చెల్లిపోని బంధం నేనమ్మా
చిట్టి చెల్లెమ్మా వెళ్లిపోని చుట్టం నేనమ్మా
అన్నలోని ప్రాణం నువ్వమ్మా
చిట్టి చెల్లెమ్మా ప్రాణమైన చెల్లిస్తానమ్మా

చూపులోన దీపావళి.. నవ్వులోన రంగోళి
పండుగలు నీతో రావాలి..
నా గుండెలోన వేడుక కావాలి
రూపులోన బంగారు తల్లి మాట మరుమల్లి
రాముడింట ప్రేమను పంచాలి
ఆ సీత లాగా పేరుకు రావాలి
నీలాంటి.. అన్నగానీ ఉండే ఉంటే.. తోడూనీడా
ఆనాటి సీతకన్ని కష్టాలన్నీ కలిగుండేవా

వాహ్ చెల్లిపోని బంధం నేనమ్మా
చిట్టి చెల్లెమ్మా వెళ్లిపోని చుట్టం నేనమ్మా
అన్నలోని ప్రాణం నువ్వమ్మా
చిట్టి చెల్లెమ్మా ప్రాణమైన చెల్లిస్తానమ్మా

కాలి కింది నేలను నేనే నీలి నింగి నేనే
కన్నులోని నీరే నేనమ్మా..
ఆ నన్ను నువ్వు జారనీకమ్మా
ఇంటి చుట్టు గాలిని నేనే తోరణాన్ని నేనే
తులసిచెట్టు కోటను నేనమ్మా
నీ.. కాపలాగా మారనీవమ్మా
ముక్కోటి దేవతలా అందరి వరం అన్నవరం
ఇట్టాంటి అన్న తోడు అందరికుంటే భూమే స్వర్గం

చెల్లిపోని బంధం నేనమ్మా
చిట్టి చెల్లెమ్మా వెళ్లిపోని చుట్టం నేనమ్మా
అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మా
ప్రాణమైన చెల్లిస్తానమ్మా..

అన్నయ్యా అన్నావంటే ఎదురవనా
అలుపై ఉన్నావంటే నిదరవనా
కలలే కన్నావంటే నిజమై ముందుకు రానా
కలతై ఉన్నావంటే కథనవనా
అమ్మలో ఉండే సగం అక్షరం నేనే
నాన్నలో రెండో సగం లక్షణం నేనే
అమ్మ తోడు నాన్న తోడు
అన్నీ నీకు అన్నే చూడు

చెల్లిపోని బంధం నేనమ్మా
చిట్టి చెల్లెమ్మా వెళ్లిపోని చుట్టం నేనమ్మా
అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మా
ప్రాణమైన చెల్లిస్తానమ్మా..
 
 

శనివారం, నవంబర్ 25, 2017

Look at my face...

తమ్ముడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : తమ్ముడు (1999)
సంగీతం : రమణగోగుల
సాహిత్యం : రమణగోగుల
గానం : రమణగోగుల

Look at my face in the mirror
And I wonder what I see
Im just a traveling soldier
And Ill be all I can be
'But right now!!!
I just wanna be free
I wanna be all I can be.

Dont you say Im a failure
You dont know who I can be
If they wanna know who I am
They just have to wait and see


But right now!!!
I just wanna be free
I wanna be all I can be

Look at my face in the mirror
And I wonder what I see
Im just a traveling soldier
And Ill be all I can be

'But right now!!!
I just wanna be free
'But right now!!!
I just wanna be free
I wanna be all I can be. .hei hei
I wanna be all I can be!!! Hhuo!

Im just a traveling soldier
And Ill be all I can be!
But right now, I just wanna be free
I wanna be all I can be.


Im just a traveling soldier
And Ill be all I can be!
'But right now, I just wanna be free
I wanna be all I can be
'But right now, I just wanna be free
I wanna be all I can be
Hei hei I wanna be all I can be .!!!
Hei hei I wanna be all I can be .!!!
Hei hei I wanna be all I can be .!!! 



ఆదివారం, జులై 23, 2017

చల్ల గాలికి చెప్పాలని...

థమ్ చిత్రంలోని ఒక చక్కని మెలోడీని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : థమ్ (2003)
సంగీతం : రమణ గోగుల
సాహిత్యం : సురేంద్ర కృష్ణ
గానం : హరిహరన్, నందిత

చల్ల గాలికి చెప్పాలని ఉంది మన కథ ఈ వేళ
చందమామకు చెప్పాలని ఉంది సరసకు రావేలా?
వింతలు చూపి పులకింతలు రేపి మురిపించే కలని
తోడుగా ఉండి మనసంతా నిండి నడిపించే జతని

చల్ల గాలికి చెప్పాలని ఉంది మన కథ ఈ వేళ

నువ్వున్నది నాకోసం నేనే నీకోసంలా
నిలిచేది మనప్రేమలా
నువు లేని ప్రతి నిమిషం ఎదలో
ఒక గాయంలా కరిగే ఈ కన్నీటిలా
మనసున ఇంద్రజాలమే ఈప్రేమ
పరువపు పూల వానలే
ఇరువురి వలపు వంతెనే ఈ ప్రేమ
సకలం ప్రేమ సొంతమే

చల్ల గాలికి చెప్పాలని ఉంది మన కథ ఈ వేళ
చందమామకు చెప్పాలని ఉంది సరసకు రావేలా?

I love u I love u I love u I love u

నిదురంటూ మటుమాయం 
కుదురంటూకరువె ప్రతి గమకం సంగీతమే
ప్రతి ఊహ ఒక కావ్యం ప్రతి ఊసు మైకం 
ప్రతి చూపు పులకింతలె
చెదరని ఇంద్రధనుసులే ఈ ప్రేమ
తొలకరి వాన జల్లులే
కరగని పండు వెన్నెలే ఈ ప్రేమ
కలిగిన వేళ హాయిలె

చల్ల గాలికి చెప్పాలని ఉంది మన కథ ఈ వేళ
చందమామకు చెప్పాలని ఉంది సరసకు రావేలా?
వింతలు చూపి పులకింతలు రేపి మురిపించె కలని
తోడుగా ఉండి మనసంతా నిండి నడిపించే జతని

చల్ల గాలికి చెప్పాలని ఉంది మన కథ ఈ వేళ
చందమామకు చెప్పాలని ఉంది సరసకు రావేలా?

 

ఆదివారం, ఆగస్టు 21, 2016

కృష్ణవేణి తీరంలో...

కృష్ణవేణి తీరంలో మెరిసి మురిపించిన ప్రేయసి మళ్ళీ అదే తీరంలో కనిపిస్తే ఆ ప్రేమికుని సంతోషం ఎలా ఉంటుందో రమణగోగుల స్వరంలో మీరే వినండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడ్ చేసిన ఫ్లాష్ ప్లేయర్ లోడ్ అవకపోతే వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మౌనమేలనోయి (2002)
సంగీతం : రమణగోగుల
సాహిత్యం : వేటూరి
గానం : రమణగోగుల

Waiting for your love yeah yeah
Waiting for your love yeah yeah
I've been waiting for your love yeah yeah
I am so happy you are right next to me.

హెయ్ కృష్ణవేణి తీరంలో
సంధ్యా సమయంలో కనులా ఒక తార మెరిసే
కృష్ణ వేణు గానంలో యమునా తీరంలో
మెరిసిన తార నేడు రాధలాగ దిగివచ్చే
తుంగభద్ర తీరంలో హంపీ క్షేత్రంలో
శిలలే చిగురించి కదిలే
హెయ్ నీవులేని రాత్రుల్లో 
నిద్రపోని నేత్రంలో కలలే మిగిలే

Your dreams are all i have with me.
seen my love yeah yeah
well I've seen my love yeah yeah
well Ive seen my love yeah yeah
i am so happy she is right next to me.

అందాలలో ఎన్ని అందాలో అందాలిలే నాకు ఒక్క చూపుకే
ఆ చూపులో ఎన్ని గ్రంథాలో చదివానులే లేత కన్నెమనసుని
ఆ నడకలో ఏమి నాట్యాలో చూశానులే నే సుందరాంగిలో
అమ్మాయిలో ఎన్ని శిల్పాలో ఠీవీ.. 
ఎంటీవి.. యమ తీరి చూస్తె చాలునంట
వంశధార తీరంలో వెలిసా కుసుమంలో విరిసే విరితేనె మనసా
వాలుచూపు గానంలో వలచిన మౌనంలో
కలసిన భామ నేడు ప్రేమలాగ ఎదురొచ్చే

well I've seen my love yeah yeah
seen my love yeah yeah seen my love yeah yeah
i am so happy i am right next to her.

ఆ తారకే నేను ఆకాశం సందె వేళ పుట్టాను ఆమెకోసమే
ఆ భావనే లేత శృంగారం ఎంకి పాటనైనాను ఆమెకోసమే
ఆ నవ్వులా మల్లెజాజుల్లో వేగానులే నే విరహ జీవినై
అమ్మాయితో ఏమి చెప్పాలో Don't know don't know
i don't know what to tell her..

కృష్ణవేణి తీరంలో
సంధ్యా సమయంలో కనులా ఒక తార మెరిసే
కృష్ణ వేణు గానంలో యమునా తీరంలో
మెరిసిన తార నేడు రాధలాగ దిగివచ్చే

seen my love yeah yeah
seen my love yeah yeah
well I've seen my love yeah
i am so happy i am right next to her.
seen my love seen my love
seen my love seen my love
seen my love seen my love
 

మంగళవారం, జులై 26, 2016

మనసేమో చెప్పిన మాటే...

యువరాజు చిత్రం కోసం రమణ గోగుల స్వరపరచిన ఒక చక్కని మెలొడీని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : యువరాజు (2000)
సంగీతం : రమణ గోగుల 
సాహిత్యం : వేటూరి
గానం : చిత్ర, రమణగోగుల

మనసేమో చెప్పిన మాటే వినదు.. అది ఏమో ఇవాళ
పెదవుల్లో దాచినదసలే అనదు.. అనరాని నిజాలా
ఏ మాయ చేసాయో ఏ మత్తు జల్లాయో
ఆ కళ్ళే ఆశలతో వయస్సులో
ఓ నిమిషం నిట్టూర్పు ఓ నిమిషం మైమరపు
అదేమిటో ఈ కధేమిటో

అధరం మధురం నయనం మధురం
వచనం మధురం వదనం మధురం
చరణం మధురం మధురం మధురం
శ్రీ మధురాధిపతి రఖిలం మధురం

నా పరువం ప్రణయం పయనం పరుగులే నీ కోసం
నా హృదయం వదనం నయనం అడిగెను నీ స్నేహం
నీ రూపమే ఆలాపనై నీ చూపుకే నీ దాననై
మౌనాలలో దాచానులే రాగాలిలా మోగాలిలా

ఓహోహో...హో..ఓ..ఓఓ....ఓఓఓఓ....

ఆ… సరసం విరసం విరహం సరిగమ సంగీతం
ఆ… చరణం చలనం గమనం ఇపుడిక నా సొంతం
అనుకున్నదే చెప్పాలని అనుకోనిదే అడగాలని
ఊరేగిన నా ఊహలో మేఘాలలో తేలానులే
ఓహోహో...హో..ఓ..ఓఓ....ఓఓఓఓ....

మనసేమో చెప్పిన మాటే వినదు.. అది ఏమో ఇవాళ
పెదవుల్లో దాచినదసలే అనదు.. అనరాని నిజాలా
ఏ మాయ చేసాయో ఏ మత్తు జల్లాయో
ఏ మాయ చేసాయో ఏ మత్తు జల్లాయో

  

గురువారం, జులై 21, 2016

మెల మెల్లగా చిగురించెనే...

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రం కోసం రమణ గోగుల స్వరపరచిన ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : వెంకటాద్రిఎక్స్ ప్రెస్ (2013)
సంగీతం : రమణగోగుల
సాహిత్యం : కాసర్ల శ్యామ్
గానం : శ్వేతా మోహన్, అంజనా సౌమ్య

మెల మెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరికా
మరుమల్లెలా వికసించెనే
ఎదలోతులో ఈ కలయికా

పెదవంచులుదాటి మౌనమే దిగివచ్చెను నేలా
పొగమంచును మీటినా కిరణమే తెచ్చెను హాయిలా
నిలువెల్లా నిండిపోయెనే నువ్వేనేనులా

ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో...
ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో...

మెల మెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరికా

అనుకోని తీరమైనా నిను నేను చేరనా
చిరుగాలి తాకుతున్నా చిగురాకులా
ననుచూసి ఇలా నాక్కూడా కొత్తగ ఉందికదా
కలకాదు కదా నీ వెంట ఉన్నది నేనేగా

ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో...
ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో...

మెల మెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరికా

మెరుపల్లె చేరువైతే చినుకల్లె మారనా
నీలోన నేనుకరిగీ పులకించనా
నీకోసమిలా కదిలేటి నిముషమునాపేస్తా
నీతోడుఅలా సాగేటి కాలమె నేనౌతా

ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో...
ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో...

మెల మెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరికా

 

మంగళవారం, ఫిబ్రవరి 16, 2016

పెదవి దాటని మాటొకటుంది...

తమ్ముడు చిత్రంకోసమ్ సిరివెన్నెల గారు వ్రాసిన ఓ అందమైన ప్రేమగీతాన్ని ఈ రోజు తలచుకుందామ్. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : తమ్ముడు (1999) 
సంగీతం : రమణ గోగుల 
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : రమణ గోగుల, సునీత 

పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా
అడగరానిది ఏమిటి ఉంది తెలుపవా సరిగా
మనసు చాటున ఎందుకు ఉంది తెరలు తీయ్ త్వరగా

మనసు నిన్నే తలచుకుంటోంది 
వినపడదా దాని గొడవ
తలుచుకుని అలసిపోతోందా 
కలుసుకునే చొరవ లేదా
ఇబ్బందిపడి ఎన్నాళ్లిలా ఎలాగ మరి
అందాల సిరి ఒళ్లో ఇలా వచ్చేస్తే సరి

పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా

 
ఇదిగిదిగో కళ్లలో చూడు 
కనపడదా ఎవ్వరున్నారు 
ఎవరెవరో ఎందుకుంటారు 
నీ వరుడే నవ్వుతున్నాడు
ఉండాలి నువ్వు నూరేళ్లిలా చిలిపి కలా
బాగుంది గాని నీ కోరిక కలైతే ఎలా

పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా
హే కోయిలా.. ఓ కోయిలా.. 
హే కోయిలా.. ఓ కోయిలా.. 
 
 

బుధవారం, డిసెంబర్ 09, 2015

బంగాళాఖాతంలో...

బద్రి సినిమాలోని ఓ హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : బద్రి (2000)
సంగీతం : రమణ గోగుల
రచన : చంద్రబోస్
గానం : రమణ గోగుల, సునీత

బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే
రంగీలా పాటల్లో రాగం నువ్వేలే
ఖండాలా దారుల్లో మంచంటే నువ్వేలే
మండేలా చూపే నువ్వేలే
ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ
నా వీనస్సే నువ్వేనమ్మా
ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో
లవ్ వైరస్సే సోకిందయ్యో

రాకెట్ కంటే ఫాస్టుగా దూసుకుపోయే
ఈ కాలం ప్రేమికులం
బుల్లెట్ కంటే స్పీడుగా అల్లుకుపోయే
చలికాలం శ్రామికులం
అడ్డురాదంట నో ఎంట్రీ కుర్ర రహదారిలో
హద్దుకాదంట ఏ కంట్రీ వింత లవ్ యాత్రలో

ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ
నా వీనస్సే నువ్వేనమ్మా
ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో
లవ్ వైరస్సే సోకిందయ్యో
 
స్పీడోమీటర్‌కందని వేగం చూపే
జోడైన జంట ఇది
మూడో మనిషి ఉండని లోకం చేరే
జోరైన టూరు ఇది
అందుకున్నాక టేకాఫే హాల్ట్ కాదెప్పుడు
సర్దుకున్నాక ఆహాహా అలుపురాదెప్పుడు

ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ
నా వీనస్సే నువ్వేనమ్మా
ఓ మిస్సయ్యో మిస్సయ్యో హయ్యో
లవ్ వైరస్సే సోకిందయ్యో 

బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే
రంగీలా పాటల్లో రాగం నువ్వేలే
ఖండాలా దారుల్లో మంచంటే నువ్వేలే
మండేలా చూపే నువ్వేలే
ఓ మిస్సమ్మ మిస్సమ్మా యమ్మ
నా వీనస్సే నువ్వేనమ్మా
ఓ మిస్సయ్య మిస్సయ్య హయ్య
లవ్ వైరస్సే సోకిందయ్య


సోమవారం, ఆగస్టు 31, 2015

నీ ఇల్లు బంగారం కాను..

పాట కొన్ని సెకన్లు వినగానే ఎవరు కంపోజ్ చేశారో సులువుగా చెప్పేయగల వైవిధ్యమైన శైలి రమణ గోగుల సొంతం. అదే విషయమై జోకులేసుకున్నాగానీ తన అర్కెస్ట్రేషన్ కోసం పాటలు వినడం కూడా నాకు ఇష్టమే.. యోగి సినిమాలో తను కంపోజ్ చేసిన ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : యోగి (2007)
సంగీతం : రమణ గోగుల
రచన : చంద్రబోస్
గానం : టిప్పు, సునీత

నీ ఇల్లు బంగారం కాను.. నా రవ్వల కొండ
నీ ఒళ్ళో బంధీనౌతాను..
నీ ఒళ్ళు ఉల్లాసంకాను.. నా గవ్వల దండ..
కౌగిల్లో వందేళ్ళుంటాను..
చిలుకను నేను.. చెరుకువు నువ్వు..
కొరికిన వేళ కాదనకు
పలకను నేను.. బలపం నువ్వు..
కలిసిన వేళ వలపులు రాయకుండా వెళ్ళకు..

నీ ఇల్లు నీ ఇల్లు 
నీ ఇల్లు బంగారంగాను.. నా రవ్వల కొండ
నీ ఒళ్ళో బంధీనౌతాను..
ఆఆ..నీ ఒళ్ళు ఉల్లాసం కాను.. నా గవ్వల దండ..
కౌగిల్లో వందేళ్ళుంటాను..

నీకే అందకపోతే అందం అందం కానే కాదు..
నీతో ఆడకపోతే ఆటే కాదంట..
నువ్వే ఉండకపోతే లోకం లోకం కానే కాదు..
నీలో ఉండకపోతే నేనే కాదంటా..
దొరలాగా.. దొరికావు.. నిను దోచుకోక పోను..
కథలాగ కదిలావు నిను చదవకుండా వెళ్ళను

నీ ఇల్లు నీ ఇల్లు 
నీ ఇల్లు బంగారం కాను.. నా రవ్వల కొండ
నీ ఒళ్ళో బంధీనౌతాను..
ఆఆ..నీ ఒళ్ళు ఉల్లాసంకాను.. నా గవ్వల దండ..
కౌగిల్లో వందేళ్ళుంటాను..
ఏఓ..ఏఓ.. నా రవ్వల కొండ.. 
ఏఓ..ఏఓ.. ఊ.హూహూ.. 
ఏఓ..ఏఓ.. నా పువ్వుల దండ
ఏఓ..ఏఓ.. ఊ.హూహూ.. 

ముక్కుపోగు చెప్పేసింది ముద్దుకు అడ్డం రానని..
మువ్వ కూడా చెప్పేసింది సవ్వడి చెయ్యదని
చిట్టి సిగ్గు చెప్పేసింది గుట్టును దాచేస్తానని
జారు పైట చెప్పేసింది మాటె జారనని..
మగవాడై తగిలావు ముడి వేసుకోక పొను
వగలడై రగిలావు సెగలణచకుండా ఉండను

నీ ఇల్లు నీ ఇల్లు 
నీ ఇల్లు బంగారం కాను.. నా రవ్వల కొండ
నీ ఒళ్ళో బంధీనౌతాను..
ఆఆ..నీ ఒళ్ళు ఉల్లాసంకాను.. నా గవ్వల దండ..
కౌగిల్లో వందేళ్ళుంటాను..
చిలుకను నేను.. చెరుకువు నువ్వు..
కొరికిన వేళ కాదనకు
పలకను నేను.. బలపం నువ్వు..
కలిసిన వేళ వలపులు రాయకుండా వెళ్ళకు..

నీ ఇల్లు నీ ఇల్లు 
నీ ఇల్లు బంగారంగాను.. నా రవ్వల కొండ
నీ ఒళ్ళో బంధీనౌతాను..
ఆఆ..నీ ఒళ్ళు ఉల్లాసం కాను.. నా గవ్వల దండ..
కౌగిల్లో వందేళ్ళుంటాను..

ఏఓ..ఏఓ.. నా రవ్వల కొండ.. 
ఏఓ..ఏఓ.. ఊ.హూహూ.. 
ఏఓ..ఏఓ.. నా పువ్వుల దండ
ఏఓ..ఏఓ.. ఊ.హూహూ.. 


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.