థమ్ చిత్రంలోని ఒక చక్కని మెలోడీని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : థమ్ (2003)
సంగీతం : రమణ గోగుల
సాహిత్యం : సురేంద్ర కృష్ణ
గానం : హరిహరన్, నందిత
చల్ల గాలికి చెప్పాలని ఉంది మన కథ ఈ వేళ
చందమామకు చెప్పాలని ఉంది సరసకు రావేలా?
వింతలు చూపి పులకింతలు రేపి మురిపించే కలని
తోడుగా ఉండి మనసంతా నిండి నడిపించే జతని
చల్ల గాలికి చెప్పాలని ఉంది మన కథ ఈ వేళ
నువ్వున్నది నాకోసం నేనే నీకోసంలా
నిలిచేది మనప్రేమలా
నువు లేని ప్రతి నిమిషం ఎదలో
ఒక గాయంలా కరిగే ఈ కన్నీటిలా
మనసున ఇంద్రజాలమే ఈప్రేమ
పరువపు పూల వానలే
ఇరువురి వలపు వంతెనే ఈ ప్రేమ
సకలం ప్రేమ సొంతమే
చల్ల గాలికి చెప్పాలని ఉంది మన కథ ఈ వేళ
చందమామకు చెప్పాలని ఉంది సరసకు రావేలా?
I love u I love u I love u I love u
నిదురంటూ మటుమాయం
కుదురంటూకరువె ప్రతి గమకం సంగీతమే
ప్రతి ఊహ ఒక కావ్యం ప్రతి ఊసు మైకం
ప్రతి చూపు పులకింతలె
చెదరని ఇంద్రధనుసులే ఈ ప్రేమ
తొలకరి వాన జల్లులే
కరగని పండు వెన్నెలే ఈ ప్రేమ
కలిగిన వేళ హాయిలె
చల్ల గాలికి చెప్పాలని ఉంది మన కథ ఈ వేళ
చందమామకు చెప్పాలని ఉంది సరసకు రావేలా?
వింతలు చూపి పులకింతలు రేపి మురిపించె కలని
తోడుగా ఉండి మనసంతా నిండి నడిపించే జతని
చల్ల గాలికి చెప్పాలని ఉంది మన కథ ఈ వేళ
చందమామకు చెప్పాలని ఉంది సరసకు రావేలా?
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.