రన్ సినిమా కోసం విద్యాసాగర్ స్వరపరచిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఈ పాట సినిమాలో లేదనుకుంటాను వీడియో దొరకలేదు. ఎంబెడెడ్ వీడియో ప్రజంటేషన్ ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : రన్ (2003)
సంగీతం : విద్యాసాగర్
రచన : ఎ.ఎం.రత్నం, శివ గణేష్
గానం : బలరామ్ , సాధనా సర్గం
చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా
చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా
సద్దేలేని దీపావళినే మనసే కోరింది
హద్దేలేని ముద్దులగాలిలో తనువే ఊగింది
వయసే వయసుకు వలపులు నేర్పింది
చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా
మనముండే చోటు ఏకాంత ద్వీపం
ఎవ్వరికి అనుమతి లేదంటా
ఓ.. దారితప్పి ఎవరో వస్తే రావొచ్చు
చిరునామా ఇంటికి వలదంట
నే వెతికే సొగసరివి నే మెచ్చే గడుసరివి
ఊపిరిలో ఊపిరివి నాలోన ఆవిరివి
ఎన్ని సిరులైనా వదిలేస్తా నిను మాత్రం బంధించేస్తా
ఏమో నా హృదయం పొంగింది
చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా
హొ.. నిదురేమో నీది కలలన్నీ నావి
నిద్దురను కలచి వెయ్యొద్దు
పదమేమో నీది పాదాలు నావి
పయనాన్ని ఆపి వెయ్యొద్దు
నీ పేరే నా మదిలో వేదంలా వల్లిస్తా
నువు నడిచే దారంట మేఘాలే పరిచేస్తా
ఇద్దరము కలిసిపోదాం లోకంలో నిలిచి ఉందాం
కలలన్ని నిజమే చేసేద్దాం
చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా
సద్దేలేని దీపావళినే మనసే కోరింది
హద్దేలేని ముద్దులగాలిలో తనువే ఊగింది
వయసే వయసుకు వలపులు నేర్పింది
చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.