శుక్రవారం, జులై 07, 2017

ప్రణయానికి పుట్టినరోజు...

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న ఒక నేస్తానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఝూన్సీరాణి చిత్రం లోని ఒక చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఝూన్సీరాణి (1988)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల

నా జీవిత ఆకాశంలో
ధృవతార నవ్విన వేళ
శతకోటి తారలు దీపాలై
శతమానం భవతి అన్నాయి

ప్రణయానికి పుట్టినరోజు
పరువానికి పండుగరోజు
ప్రణయానికి పుట్టినరోజు
పరువానికి పండుగరోజు

నీకోసం వాకిట నిలచి
నా ఆశలు దోసిట నింపి
నిలుచున్నా నీవొస్తావనీ దీవిస్తావనీ
నా ప్రేమనీ ఓ ఆమని

ప్రణయానికి పుట్టినరోజు
పరువానికి పండుగరోజు 
 
తోడు లేని తోటలోకి దేవతలా వచ్చావు
నీడలేని జీవితాన హారతిలా వెలిగావు
వేణువంటి సోయగాన ప్రాణ వాయువైనావు
ప్రశ్నలాంటి యవ్వనాన బదులు నీవు ఐనావు
నాకోసం నిన్నే వలచి నీకోసం నన్నే మరచి
నిలుచున్నా నీవొస్తావని ప్రేమిస్తావని
ఈ జీవిని ఓ భామిని

ప్రణయానికి పుట్టినరోజు
పరువానికి పండుగరోజు

స్వాతి వాన జల్లులాగా లేత చెలిమి జల్లావు
చెలిమికన్నా చల్లనైన చేయి నీవు కలిపావు
నెమలికన్ను లాంటి నాకు కంటిపాపవైనావు
చంటి పాప లాంటి నాకు జోలపాటవైనావు
నా అందం కన్నులు తెరచి 
అనుబంధం ఆశలు పరచి
అనుకున్నా కలిసొస్తావని మనసిస్తావని
ఈ ప్రేమకి నీ ప్రేమకి

ప్రణయానికి పుట్టినరోజు
పరువానికి పండుగరోజు

ప్రణయానికి పుట్టినరోజు
పరువానికి పండుగరోజు
నీకోసం వాకిట నిలచి
నా ఆశలు దోసిట నింపి
నిలుచున్నా నీవొస్తావనీ దీవిస్తావనీ
నా ప్రేమనీ ఓ ఆమని


 

2 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.