గుండమ్మ కథ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : గుండమ్మ కథ (1962)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : పింగళి
గానం : సుశీల
సన్నగ వీచే చల్ల గా...లికి
కనులు మూసినా కలలాయే
తెల్లని వెన్నెల పానుపు పై ఆ
కలలో వింతలు కననాయే
సన్నగ వీచే చల్ల గాలికి
కనులు మూసినా కలలాయే
తెల్లని వెన్నెల పానుపు పై
ఆ కలలో వింతలు కననాయే..
అవి తలచిన ఏమో సిగ్గాయే
కనులు తెరచినా నీవాయే
నే కనులు మూసినా నీవాయే
కనులు తెరచినా నీవాయే
నిదురించిన నా హృదయమునెవరో
కదిలించిన సడి విననాయే
నిదురించిన నా హృదయమునెవరో
కదిలించిన సడి విననాయే
కలవరపడి నే కనులు తెరువ
నా కంటి పాపలో నీవాయే
ఎచట చూచినా నీవాయే
కనులు తెరచినా నీవాయే
నే కనులు మూసినా నీవాయే
కనులు తెరచినా నీవాయే
మేలుకొనిన నా మదిలో యేవో
మెల్లని పిలుపులు విననాయే
మేలుకొనిన నా మదిలో యేవో
మెల్లని పిలుపులు విననాయే
ఉలికిపాటుతో కలయ వెతక
నా హృదయ ఫలకమున నీవాయే
కనులు తెరచినా నీవాయే
నే కనులు మూసినా నీవేనాయే
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.