ఆదివారం, జులై 16, 2017

వసంతాల ఈ గాలిలో...

ఇది మా అశోగ్గాడి ప్రేమ కథ చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఈ పాట వీడియో దొరకలేదు, ఎంబెడెడ్ వీడియో ఆడియో జ్యూక్ బాక్స్ మాత్రమే అది ఇక్కడ కూడా చూడవచ్చు.


చిత్రం : ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ (2002)
సంగీతం : ఆనంద్ మిలింద్
సాహిత్యం : వేటూరి
గానం : అభిజిత్

వసంతాల ఈ గాలిలో గులాబి గుబాళింపులు
సరాగాల ఈ సంజెలో పరాగాల కవ్వింపులు
ఇవేనాటి క్రీనీడలో తుషారాలనీరెండలు
కుహూమన్న ఈ గొంతులో ధ్వనించాయిలే ప్రేమలు
వసంతాల ఈ గాలిలో గులాబి గుబాళింపులు
సరాగాల ఈ సంజెలో పరాగాల కవ్వింపులూ


మేఘాల సందేశమూ ఆ ప్రేమ విరిజల్లులే
స్వప్నాల సంకేతమూ ఎదలోని హరివిల్లులే
మైనాల సంగీతమూ ఈ పూల గంధాలులే
ప్రతిరోజు సాయంత్రమూ నీ వేడి నిట్టూర్పులే
అది శోకమో ఒక శ్లోకమో ఈ లోకమే ప్రేమలే

వసంతాల ఈ గాలిలో గులాబి గుబాళింపులు
సరాగాల ఈ సంజెలో పరాగాల కవ్వింపులూ


ప్రేమించినా కళ్ళకూ నిదురన్నదే రాదులే
ప్రేమించినా వాళ్ళకూ ఏ ఆకలి లేదులే
ఊహల్లో విహరింపులూ ఉయ్యాల పవళింపులూ
వెన్నెల్ల వేధింపులూ వెచ్చంగ లాలింపులూ
అది యోగమో అనురాగమో పురివిప్పు ఈ ప్రేమలో

వసంతాల ఈ గాలిలో గులాబి గుబాళింపులు
సరాగాల ఈ సంజెలో పరాగాల కవ్వింపులు
ఇవేనాటి క్రీనీడలో తుషారాల నీరెండలు
కుహూమన్న ఈ గొంతులో ధ్వనించాయిలే ప్రేమలు

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.