బుధవారం, జులై 26, 2017

చలచల్లగా గాలీ...

యమదొంగ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : యమదొంగ (2007)
సంగీతం : కీరవాణి 
సాహిత్యం : భువనచంద్ర 
గానం : కీరవాణి, సంగీత 

చలచల్లగా గాలీ... 
మెలమెల్లగా తేలీ.. 
మేఘవనిలో రాగమధనం 
మనమే చేయాలీ... 
ఆహా... ఓహో... ఓఓఓఓఓఓఓ.. 
ఆహా... ఓఓఓఓఓఓ

కసి ఉసిగొలిపే గుసగుసలో 
రసికత పండాలీ.. 
అవసర సుమశర 
స్వర్గములే చూపించాలీ

మగసిరి గడసరి డోలికలో 
మనజత ఊగాలీ 
యమసుర వరునికి 
అమృతమే అందించాలీ
లాహిరీ కేళి ఈ జిలిబిలీ
నావసరళి నీవు కదలి 
చెలి గిలి భళీ.. 
 
చలచల్లగా గాలీ... ఉమ్..
మెలమెల్లగా తేలీ.. 
మేఘవనిలో రాగమధనం 
మనమే చేయాలీ... 
ఆహా... ఓహో... ఓఓఓఓఓఓఓ.. 
ఆహా... ఓహోఓఓఓ


2 comments:

వేణూ! మనసుకి పాట కరువాయే, ఆ పాటకి జాడ మరుగాయే అని అనిపిస్తూ ఉన్నప్పుడు నేను వెదుక్కునే దెస ఇటుగానే! ఒక్కోసారి మదిలోని వేలాది పాటలూ మటుమాయం అయిన స్తబ్దత కి సడి అందేది ఇక్కడే..ఇన్నేళ్ళుగా, ఇంకెంతో నిలకడగా మీరు కూరుస్తున్న ఈ కోశాగారం ఇలానే అక్షయం కావాలి, పాటల పుష్పకం కావాలి అని మనసారా కోరుకుంటూ...

నాకు మాటలు కరువాయే ఉషగారు... మీ ప్రోత్సాహానికి బోలెడు ధన్యవాదాలు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.