రాజమకుటం చిత్రంలోని ఒక చక్కని పాటతో ఈ గాలి పాటల సీరీస్ ముగిద్దాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : రాజ మకుటం (1959)
సంగీతం : మాస్టర్ వేణు
సాహిత్యం : దేవులపల్లి కృష్ణ శాస్త్రి
గానం : పి.లీల
సడిసేయకోగాలి సడిసేయబోకే
సడిసేయకోగాలి సడిసేయబోకే
బడలి ఒడిలోరాజు పవళించేనే
సడిసేయకే
రత్నపీఠికలేని రారాజు నాస్వామి
మణికిరీటములేని మహరాజుగాకేమి
చిలిపిపరుగులుమాని కొలిచిపోరాదే
సడిసేయకే
ఏటిగలగలకే ఎగసి లేచేనే
ఆకుకదలికలకే అదరిచూసేనే
నిదుర చెదరిందంటే నేనూరుకోనే
సడిసేయకే
పండువెన్నెల నడిగి పాన్పుతేరాదే
నీడమబ్బులదాగు నిదురతేరాదే
విరుల వీవెనవూని విసిరిపోరాదే
సడిసేయకోగాలి సడిసేయబోకే
బడలి ఒడిలోరాజు పవళించేనే
సడిసేయకోగాలి
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.