శనివారం, మే 31, 2008

ఇందువదన కుందరదన - ఛాలెంజ్

అప్పుడు నేను పిడుగురాళ్ళ జడ్పీ హైస్కూల్ లో 7 లేదా 8 వ తరగతి చదువుతున్నాను. నాకు మొదటి నుండి సాధారణమైన పాటలకన్నా ఏదో ఒక ప్రత్యేకత ఉన్న పాటలు ఎక్కువ ఇష్టం. దానికి తోడు మనం చిరంజీవి కి వీరాభిమనులం. నిజం చెప్పొద్దూ, నేనేంటి లెండి మా ఇంట్లో ఇంటిల్లి పాది చిరు అభిమానులమే. మాలాంటి కుటుంబాలు అంధ్రాలో ఎన్నో... అవి చూసుకునె కదా మా బాసు కి రాజకీయాలు అనే ఆలోచన వచ్చింది. సరే ఆ టైము లో ఛాలెంజ్ సినిమా విడుదలైంది అందులోని "ఇందువదన కుందరదన" అనే పాట కొంచెం హడావిడి గా ప్రాసలతో నోరు సరిగా తిరగని వాళ్ళు పాడటం కొంచెం కష్టం గా వుండేది. పాట సాహిత్యం పెద్ద గా లేక పోయినా స్వరం బావుండటం మరియూ పదాల అల్లిక నన్ను చాలా ఆకర్షించేయడం తో ఒక నాలుగైదు సార్లు కష్ట పడి ఈ పాట పాడటం నేర్చేసుకున్నాను. నా క్లాస్మేట్స్ ఒకరిద్దరు అబ్బ కష్టమైన పాట రా బాగ పాడుతున్నావే అని మెచ్చుకుంటుంటే ఓ పొంగి పోయే వాడ్ని. ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంటుంది. అప్పట్లో ఆ పాట అర్ధం కూడా సరిగా తెలిసేది కాదు. ఆ పాట సాహిత్యం ఇక్కడ ఇస్తున్నాను.... ఛాలెంజ్

Listen to Challenge Audio Songs at MusicMazaa.com

చిత్రం : ఛాలెంజ్
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

ఇందువదన కుందరదన మందగమన
మధురవచన గగన జఘన సొగసు లలనవే
ఇందువదన కుందరదన మందగమన
మధురవచన గగన జఘన సొగసు లలనవే
తొలి వలపే తెలిపే చిలిపీ సిగ్గేలనే
చెలి చిగురు తొడిగే వగల మొగ్గేలనే
ఐ లవ్యూ ఓ హారికా.. నీ ప్రేమకే జోహారిక...||2||

||ఇందువదన||

కవ్వించే కన్నులలో.. కాటేసే కలలేన్నో...
పక పక నవ్వులలో పండిన వెన్నెలవై నన్నందుకో..
కసి కసి చూపులతో కొస కొస మెరుపులతో నన్నల్లుకో..
ముకుళించే పెదవుల్లో మురిపాలూ..
ఋతువుల్లో మధువంతా సగపాలూ..
సాహోరే భామా హొయ్...

||ఇందువదన||

మీసం లో మిసమిసలు.. మోసాలే చేస్తుంటే..
బిగిసిన కౌగిలిలో సొగసరి మీగడలే దోచేసుకో...
రుసరుస వయసులతో..ఏడదల దరువులతో ముద్దాడుకో..
చలి పుట్టే ఎండల్లో సరసాలు...
పగ బట్టే పరువం లో ప్రణయాలు...
జోహారే ప్రేమా హొయ్....

||ఇందువదన||

శనివారం, మే 24, 2008

విధాత తలపున

అప్పుడు నేను 9 వ తరగతి చదువుతున్నా అనుకుంటా. నాకో నేస్తం వుండే వారు చిత్తరంజన్ అనీ ఇప్పుడు ఎక్కడ వున్నారో తెలీదు. అప్పట్లో మా ఇంటికి దగ్గరలో ఒక రికార్డింగ్ షాపు పెట్టారు. నాకు పేరు పెట్టి పిలిచే చనువు వున్నా నాకంటే కొంచెం పెద్ద లెండి. తన గురించి తన కుటుంబం తో నా అనుబంధం గురించి తర్వాత వ్రాస్తాను. నాకు తీరిక దొరికినప్పుడల్లా నేను ఎక్కువ సమయం ఆ షాపు లోనే పాటలు వింటూ గడిపే వాడ్ని. తను రికార్డింగ్ తో పాటు చిన్న చిన్న రిపేర్లు కూడా చేస్తుండే వాడు. నేను చాలా ఆసక్తి గా గమనించే వాడ్ని. పాడైపోయిన టేప్ రికార్డరు మోటారు తో ఒక చిన్న ఫేన్ తయారు చేసారు తను అప్పట్లో అది నాకు ఓ అద్భుతం చాలా సరదాగా అనిపించేది.

నేను ఏదో ఒక మాస్ సినిమా పాటలు రికార్డ్ చేయించుకోడానికి వెళ్ళినప్పుడల్లా తను సిరివెన్నెల గ్రాం ఫోన్ రికార్డ్ చూపించి ఈ పాటలు చాలా బావున్నాయి తీసుకు వెళ్ళు వేణు అని చెప్పే వారు. మనకి చిన్న తనం గదా, ఏ చిరంజీవో ఇంకెవరో పెద్ద నటుడి బొమ్మో రికార్డు మీద వుంటే కానీ ఆనేది కాదు అలాంటిది బెనర్జీ ఉన్న రికార్డు ఎలా నచ్చుతుంది చెప్పండి. చాలా రోజులు దాన్ని అలానే వుంచేసాను. ఒక రోజు తనే "విధాత తలపున" పాట ఒక క్యాసెట్ లో ఖాళీ ఉంటే రికార్డ్ చేసి ఇచ్చారు. అది విన్న మరుసటి రోజే మిగిలిన అన్ని పాటలు రికార్డ్ చేయించుకుని విన్నాను అప్పుడు మొదలు పెట్టిన ఆ పాటలు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా నా ప్లేలిస్ట్ లో మొదటి స్తానం లో వుంటూనే వున్నాయి. తను పరిచయం చేసిన పాటలలో నీరాజనం ఒకటి మర్చిపోలేని ఆల్బం.

సిరివెన్నెల నుండి విధాత తలపున గీత సాహిత్యం మన కోసం. సిరివెన్నెల

undefined

గానం : బాలు, సుశీల
సంగీతం : కే వి మహదేవన్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం...ఓం.మ్మ్..
ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవ నాదమ్...ఓం.మ్మ్..
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం..
ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానమ్....ఆఅ..

సరస స్వర సుర ఝారీగమనమౌ సామ వేద సార మిది...||2||
నేపాడిన జీవన గీతం ఈ... గీతం..

విరించినై విరచించితిని ఈ కవనం..
విపంచినై వినిపించితిని ఈ గీతం....

ప్రాగ్దిశ వీణియ పైన దినకర మయూఖ తంత్రులపైనా..
జాగృత విహంగ తతులె వినీల గగనపు వేదిక పైన... ||2||
పలికిన కిలకిల స్వరముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా..
విశ్వకావ్యమునకిది భాష్యముగా....

||విరించినై..||

జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం... ||2||
అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహిని గా..
సాగిన సృష్టి విలాసము నే...

||విరించినై..||

నా ఉఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం ||2||
సరస స్వర సుర ఝారీగమనమౌ సామ వేద సార మిది...
నేపాడిన జీవన గీతం ఈ... గీతం..

సోమవారం, మే 19, 2008

నా షోలాపూర్ చెప్పులు

ఈ పాట ముద్దమందారం సినిమా లోనిది.

నా చిన్నపుడు పెళ్ళిలో మాకు అదో పెద్ద విచిత్రం... మైక్ సెట్ ఆపరేటర్ దగ్గర పిల్లలమంతా మూగి వాడు రికార్డ్ ప్లేయర్ కి కీ ఇచ్చి పాటలు ప్లే చెస్తుంటే అబ్బురం గా చూసే వాళ్ళం... చిన్న పెద్ద రెండు సైజుల్లో రికార్డ్ లు, వాటి కవర్ల పై సినిమా బొమ్మలు, చూడటం అదో సరదా. భలే వుండేవి ఆ రోజులు.... ఏ సమస్యలు భాధ్యతలు తెలియకుండ ప్రతి పని లోను అనందాన్ని మాత్రమే అస్వాదించే రోజులు... మళ్ళీ వస్తే ఎంత బావుండునో.....
ముద్దమందారం

Listen to Mudda Mandaram Audio Songs at MusicMazaa.com

రచన : వేటూరి గారు అనుకుంటాను నాకు ఖచ్చితం గా తెలీదు
గానం : జిత్ మోహన్ మిత్రా
సంగీతం : రమేష్ నాయుడు (ఇది "మై కాలే హైతో క్యాహువ" అనే హిందీ పాటకి అనుకరణ)

షోలాపూర్...చెప్పులు పోయాయి...
నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలొ పోయాయి
అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకు పోయేవీ..
||నా షొలాపూర్ 2||
నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలొ పోయాయి

అరె రమణ మూర్తి పెళ్ళి.. ఇది రాదు మళ్ళీ మళ్ళీ
నవ్వాలి తుళ్ళి తుళ్ళి... అని పాడెను మళ్ళీ మళ్ళీ
మన రమణ మూర్తి పెళ్ళి.. ఇది రాదు మళ్ళీ మళ్ళీ
నవ్వాలి తుళ్ళి తుళ్ళి... అని పాడెను మళ్ళీ మళ్ళీ
ఆ సందట్లొ కన్నేసి కనిపెట్టి కాజేసాడెవడో...

నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలొ పోయాయి
అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకు పోయేవీ..
నా షోలా..షోలా..షోలాపూర్ పెళ్ళిలొ చెప్పులు పోయాయి

ఇది షోలాపూరు లెదరు..యాస్ లైట్ యాస్ ఫెదరు..
సూట్ యట్ ఎనీ వెదరు..నువు తొడిగి చూడు బ్రదరూ..||2||
అని మురిపించి మరిపించి కొనిపించాడా కొట్టోడూ...

||నా షోలాపూర్||

జత నంబరేమొ ఆరు..ధర చూస్తె ఇరవయ్యారు...
తొడిగాను ఒక్క మారు..వెళ్ళాను పాత వూరు ||2||
ఒక సారైన పాలీషు కొట్టందె కొట్టేసాడెవడో..

||నా షోలాపూర్||

నా షోలాపూర్ చెప్పులూ... పెళ్ళిలొ పోయాయి...
దొరికితే... ఎవరైనా ఇవ్వండీ...హ హ హ

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.