అప్పుడు నేను పిడుగురాళ్ళ జడ్పీ హైస్కూల్ లో 7 లేదా 8 వ తరగతి చదువుతున్నాను. నాకు మొదటి నుండి సాధారణమైన పాటలకన్నా ఏదో ఒక ప్రత్యేకత ఉన్న పాటలు ఎక్కువ ఇష్టం. దానికి తోడు మనం చిరంజీవి కి వీరాభిమనులం. నిజం చెప్పొద్దూ, నేనేంటి లెండి మా ఇంట్లో ఇంటిల్లి పాది చిరు అభిమానులమే. మాలాంటి కుటుంబాలు అంధ్రాలో ఎన్నో... అవి చూసుకునె కదా మా బాసు కి రాజకీయాలు అనే ఆలోచన వచ్చింది. సరే ఆ టైము లో ఛాలెంజ్ సినిమా విడుదలైంది అందులోని "ఇందువదన కుందరదన" అనే పాట కొంచెం హడావిడి గా ప్రాసలతో నోరు సరిగా తిరగని వాళ్ళు పాడటం కొంచెం కష్టం గా వుండేది. పాట సాహిత్యం పెద్ద గా లేక పోయినా స్వరం బావుండటం మరియూ పదాల అల్లిక నన్ను చాలా ఆకర్షించేయడం తో ఒక నాలుగైదు సార్లు కష్ట పడి ఈ పాట పాడటం నేర్చేసుకున్నాను. నా క్లాస్మేట్స్ ఒకరిద్దరు అబ్బ కష్టమైన పాట రా బాగ పాడుతున్నావే అని మెచ్చుకుంటుంటే ఓ పొంగి పోయే వాడ్ని. ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంటుంది. అప్పట్లో ఆ పాట అర్ధం కూడా సరిగా తెలిసేది కాదు. ఆ పాట సాహిత్యం ఇక్కడ ఇస్తున్నాను.... ఛాలెంజ్
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి
ఇందువదన కుందరదన మందగమన
మధురవచన గగన జఘన సొగసు లలనవే
ఇందువదన కుందరదన మందగమన
మధురవచన గగన జఘన సొగసు లలనవే
తొలి వలపే తెలిపే చిలిపీ సిగ్గేలనే
చెలి చిగురు తొడిగే వగల మొగ్గేలనే
ఐ లవ్యూ ఓ హారికా.. నీ ప్రేమకే జోహారిక...||2||
||ఇందువదన||
కవ్వించే కన్నులలో.. కాటేసే కలలేన్నో...
పక పక నవ్వులలో పండిన వెన్నెలవై నన్నందుకో..
కసి కసి చూపులతో కొస కొస మెరుపులతో నన్నల్లుకో..
ముకుళించే పెదవుల్లో మురిపాలూ..
ఋతువుల్లో మధువంతా సగపాలూ..
సాహోరే భామా హొయ్...
||ఇందువదన||
మీసం లో మిసమిసలు.. మోసాలే చేస్తుంటే..
బిగిసిన కౌగిలిలో సొగసరి మీగడలే దోచేసుకో...
రుసరుస వయసులతో..ఏడదల దరువులతో ముద్దాడుకో..
చలి పుట్టే ఎండల్లో సరసాలు...
పగ బట్టే పరువం లో ప్రణయాలు...
జోహారే ప్రేమా హొయ్....
||ఇందువదన||
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.