శనివారం, ఏప్రిల్ 12, 2014

శ్రీ రఘురాం జయ రఘురాం

సాంఘీక చిత్రంలోనిదే అయినా మరో మంచి రాముల వారి పాట నాకు నచ్చినది మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ లేదా ఇక్కడ వినవచ్చు.



చిత్రం : శాంతినివాసం (1960) 
సంగీతం : ఘంటసాల 
సాహిత్యం : సముద్రాల(జూనియర్)
గానం : నాగయ్య/పిబిశ్రీనివాస్ ?, పి.సుశీల

శ్రీ రామ చ౦ద్రః ఆశ్రిత పారిజాతః
సమస్తకళ్యాణ గుణాభిరామః
సీతా ముఖా౦బోరుహ చ౦చరీకః
నిర౦తర౦ మ౦గళమాతనోతూ..
ఆ..ఆ..ఆ...

శ్రీ రఘురామ్ జయ రఘురామ్
శ్రీ రఘురామ్ జయ రఘురామ్
సీతామనోభిరామ్
శ్రీ రఘురామ్ జయ రఘురామ్


అన్నదమ్ముల ఆదర్శమైనా
ఆలుమగల అన్యోన్యమైనా ఆఆఆఆ
అన్నదమ్ముల ఆదర్శమైనా
ఆలుమగల అన్యోన్యమైనా

త౦డ్రి మాటను నిలుపుటకైన
ధరలోమీరే దశరధరామ్ 

శ్రీ రఘురామ్ జయ రఘురామ్
సీతామనోభిరామ్
శ్రీ రఘురామ్ జయ రఘురామ్

వెలయునేయెడ నీ దివ్యమూర్తి
వెలిగేనాయెడ ఆన౦దజ్యోతి
వెలయునేయెడ నీ దివ్యమూర్తి
వెలిగేనాయెడ ఆన౦దజ్యోతి

వెలసి మాగృహ౦ శా౦తినివాస౦
సలుపవె శుభ గుణ శోభితరామ్

శ్రీ రఘురామ్ జయ రఘురామ్
సీతామనోభిరామ్
శ్రీ రఘురామ్ జయ రఘురామ్ 

 

2 comments:

హ్యూమన్ రిలేషన్స్, ఫామిలి వాల్యూస్, పెర్సనాలిటి డెవెలప్మెంట్, టైం మేనేజ్మెంట్ , స్ట్రెస్ మేనేజ్మెంట్ ..ఇలా ప్రతీ విషయానికీ మన చుట్టూ వందల క్రాష్ కోర్స్ లు..బట్ కాస్త ఇష్టం తో, ఇంటరస్ట్ తో మన రామాయణ, భారత, భాగవతాలని చదవ గలిగితే, పై కోర్సులేవీ మనకి అవసరం లేదనిపిస్తుందండి..

వెల్ సెడ్ శాంతి గారు థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.