సిరివెన్నెల గారు రాసిన పాట గురించి ఎక్కువ మాట్లాడడానికి ఏముంటుంది చెప్పండి. ఈ చక్కని పాటను మీరూ చూసీ వినీ ఆస్వాదించండి. ఈ పాట కాస్త బెటర్ క్వాలిటీ ఇక్కడ చూడవచ్చు ఐతే ఇది కేవలం కొన్ని దేశాల్లో మాత్రమే ప్లే అవుతుంది ఇతరులు కింది ఎంబెడ్ వీడియో చూడవచ్చు. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : నువ్వేకావాలి(2000)
సంగీతం : కోటి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : శ్రీరామ్, గోపికా పూర్ణిమ
ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటోందీ
చెలీ! ఇదేం అల్లరి
నానీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదేం గారడి
నేను కూడా నువ్వయానా పేరుకైనా నేను లేనా
దీనిపేరేనా ప్రేమ అనే ప్రియభావన
నానీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదేం గారడి
నేను కూడా నువ్వయానా పేరుకైనా నేను లేనా
దీనిపేరేనా ప్రేమ అనే ప్రియభావన
ఓఓఓఓ... దీనిపేరేనా ప్రేమ అనే ప్రియభావన
లాలాలలల లాలాలలలల
ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటోంది...
చెలీ! ఇదేం అల్లరి
లాలాలలల ఏహే.. లాలాలలలల
నిద్దుర తుంచే మల్లెల గాలి వద్దకు వచ్చి తానెవరంది
నువ్వే కదా చెప్పు ఆ పరిమళం
వెన్నెలకన్నా చల్లగ ఉన్న చిరునవ్వేదో తాకుతు ఉంది
నీదే కాదా చెప్పు ఆ సంబరం
కనుల ఎదుట నువులేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా
ఎవరు ఎవరితో ఏమన్నా నన్ను పిలిచినట్టనుకున్నా
నువ్వే కదా చెప్పు ఆ పరిమళం
వెన్నెలకన్నా చల్లగ ఉన్న చిరునవ్వేదో తాకుతు ఉంది
నీదే కాదా చెప్పు ఆ సంబరం
కనుల ఎదుట నువులేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా
ఎవరు ఎవరితో ఏమన్నా నన్ను పిలిచినట్టనుకున్నా
ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా
ఏమిటౌతుందో ఇలా నా ఎదమాటునా
దీనిపేరేనా ప్రేమ అనే ప్రియభావనా
ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటోంది..
దీనిపేరేనా ప్రేమ అనే ప్రియభావనా
ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటోంది..
చెలీ! ఇదేం అల్లరి
లాలాలలల.. లాలాలలలల
లాలలాల లాలాలాల లాలలాల లాలాలాలా
కొండలనుంచి కిందికి దూకే తుంటరి వాగు నాతో అందీ
నువ్వూ అలా వస్తూ ఉంటావని
గుండెలనుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకో కబురంపింది
చెలీ నీకై చూస్తూ వుంటానని
మనసు మునుపు ఎపుడూ ఇంత ఉలికి ఉలికి పడలేదు కదా
మనకు తెలియనిది ఈ వింత ఎవరి చలవ ఈ గిలిగింత
నాలాగే నీక్కూడా అనిపిస్తూ ఉన్నదా
ఏమి చేస్తున్నా పరాకే అడుగడుగునా
దీని పేరేనా ప్రేమ అనే ప్రియభావనా
నానీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది అరే ఇదేం గారడి
నేను కూడా నువ్వయానా పేరుకైనా నేను లేనా
దీనిపేరేనా ప్రేమ అనే ప్రియభావన
ఓఓఓఓ.. దీనిపేరేనా ప్రేమ అనే ప్రియభావన
లాలలాల లాలాలాల
2 comments:
అద్భుతమనలేము గానీ గుడ్ సాంగ్..
థాంక్స్ శాంతి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.