ఆనంద్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆనంద్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శనివారం, మార్చి 14, 2020

కానలోన గంతకట్టి...

మేము చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మేము (2015)
సంగీతం : అరొల్ కొరెలి
సాహిత్యం : శశాంక్ వెన్నెలకంటి
గానం : ఆనంద్

కానలోన గంతకట్టి
వదిలినట్టే వదిలిపెట్టి
నాగుమల్లే ఆడమంటే
ఆడుతుందా అమ్ముకుట్టీ
ఇంకి పింకి పాంకి అంటూ
ఛెంగు ఛెంగు దూకమంటె
హద్దులేదే..
టిక్కు టాకు బెల్లు కొట్టి
లెఫ్ట్ రైట్ వెళ్ళు అంటే
నేను రోబో కాదే
కొట్టి కొట్టి ఉయ్యాలలే ఊగు
సాటిలేని ఆటుందిలే
స్వీటు స్వీటు పద్యాలనే పాడె
హాటు హాటు చోటుందిలే
వన్ టూ త్రీ
డోంట్ యూ వర్రీ
కుర్రకారు రంకెలేస్తె శివరాత్తిరీ

కానలోన గంతకట్టి
వదిలినట్టే వదిలిపెట్టి
నాగుమల్లే ఆడమంటే
ఆడుతుందా అమ్ముకుట్టీ

కూల్ హంగామా
సాగనీమంది ఈడమ్మ
జోర్ పెంచమ్మా
హంసల్లే నింగి తాకమ్మ
కులాసాల ఉషస్సులో
విలాసాల మజా ఇదే
ఛలో అనే వయస్సుకీ
ఫుల్ స్టాపు పెట్టొద్దులే
శరత్తునై సుఖించనా
సుఖాలలో తరించనా
సుగంధమై వరించనా
సందేళ సందిట్లోనా
తప్పు తప్పుగా మోళీ
కట్టమాకురా కాళీ
కొట్టి కొట్టి చంపకొట్టి
నీ కన్నే కొట్టీ కొట్టమంది
అమ్ముకుట్టి వెన్నేతట్టీ

కానలోన గంతకట్టి
వదిలినట్టే వదిలిపెట్టి
నాగుమల్లే ఆడమంటే
ఆడుతుందా అమ్ముకుట్టీ

ఇంకి పింకి పాంకి అంటూ
ఛెంగు ఛెంగు దూకమంటె
హద్దులేదే..
టిక్కు టాకు బెల్లు కొట్టి
లెఫ్ట్ రైట్ వెళ్ళు అంటే
నేను రోబో కాదే
కొట్టి కొట్టి ఉయ్యాలలే ఊగు
సాటిలేని ఆటుందిలే
స్వీటు స్వీటు పద్యాలనే పాడె
హాటు హాటు చోటుందిలే
వన్ టూ త్రీ
డోంట్ యూ వర్రీ
కుర్రకారు రంకెలేస్తె శివరాత్తిరీ



బుధవారం, నవంబర్ 14, 2018

తంతంతారరంపంపంపం...

బాలల దినోత్సవం సంధర్బంగా చిన్నారులకు శుభాకాంక్షలు మరియూ దీవెనలు అందజేస్తూ మేము చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మేము (2016)
సంగీతం : అరోల్ కొరెల్లి
సాహిత్యం : వెన్నెలకంటి
గానం : ఆనంద్

తంతంతారరంపంపంపం
తంతంతారరంపంప
తారెరారేరారేరా..
తంతంలోని తంతంతంతం
హృదయం పాడె సంగీతం
నిన్ను చేరినదా

కష్టాలు లేని ఏ పిల్లలు లేరులే
బొమ్మల్లే బతికే వారు పిల్లలు కారులే
దిగులింక ఏలా మనమల్లరి పిల్లలై
మేఘాలు దాటి ఎగిరేము గువ్వలై

తంతంతారరంపంపంపం
తంతంతారరంపంప
తారెరారేరారేరా..
తంతంలోని తంతంతంతం
హృదయం పాడె సంగీతం
నిన్ను చేరినదా

తల్లి కడుపులో ఉన్నాం
కాళ్ళు చేతులాడించాం
ఈ నేలపైకొచ్చీ
మౌనంగా ఎందుకున్నాం
తోడుంది నీకు ఈకాలమే
నువ్వు సాగిముందుకే పో
ఆ మబ్బుల్ని నీవడిగావుగా
నీ రెక్కల్లే నే వస్తానురా నీకై

తంతంతారరంపంపంపం
తంతంతారరంపంప
తారెరారేరారేరా..
తంతంలోని తంతంతంతం
హృదయం పాడె సంగీతం
నిన్ను చేరినదా

ఆగాజుపెట్టెలలో
జీవించు చేపలకు
కడలినీదు అనుభవమే
నేర్పించ మరచాము
ఆకాశమే నీదైనదో
హద్దేది లేదు నువ్వుపో
నువ్వు అరవిచ్చు పువ్వేనురా
నువ్వు పాపైతే నే రెప్పేనురా ఇక

తంతంతారరంపంపంపం
తంతంతారరంపంప
తారెరారేరారేరా..
తంతంలోని తంతంతంతం
హృదయం పాడె సంగీతం
నిన్ను చేరినదా

ఆదివారం, జులై 03, 2016

నిన్న లేని వింతలే...

వన్ ఎయిటీ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం.. ఈ పాట ఆడియో మాత్రమె వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : 180 (2011)
సంగీతం : శరత్ వాసుదేవన్
సాహిత్యం : వనమాలి
గానం : ఆనంద్, చిత్ర, ఎస్.సౌజన్య 

నిన్న లేని వింతలే చూపెనే కంటిపాపలే
మోములన్ని చింతగా చూడని వెండి నవ్వులే
నీ కన్నుల్నే చూస్తూ కాలాలే దాటేయ్ నా
చిరునవ్వే నాదయ్యేనా
నిన్న లేని వింతలే చుపెనే కంటిపాపలే

నీ లో ఆ కసి గుసలే ప్రేమే వల్లించేనా
పలుకే అలిసే పెదవే సెధ తీరేలా
నిరకం నిలిచే పనులే చేద్దాం చేతల్లో
రి ని రి గ రి బ్రతుకున ఓఓ
రి మ ని ప గ రి పరమార్ధమే
మనసా కోరే తీరి
రి గ మ ప ద ని స మనిషిగా నిలపదా

నిన్న లేని వింతలే చుపెనే కంటిపాపలే
మోములన్ని చింతగా చూడని వెండి నవ్వులే

నీతో ఈ పయనాలే రోజూ కొనసాగేనా
మలుపే తిరిగే పెరిగే బహుదురాలే
మననే కడకు నిలిపే గమ్యం నీదైనా
ఆఆ ద ని ద మ గ రి నిను విడని
రి ప మ ని ప గ రి చిరు సంబరం
ద ని స ని నీతో నీడై
గ మ ప ద ని స కదిలితే చాలదా

నిన్న లేని వింతలే చుపెనే కంటిపాపలే
మొములన్ని చింతగా చూడని వెండి నవ్వులే
నీ కన్నుల్నే చూస్తూ కాలాలే దాటేయ్ నా
నీ నవ్వే.. చిరునవ్వే నాదయ్యేనా..ఆఆ..

 

మంగళవారం, ఏప్రిల్ 07, 2015

పాటల్లో పాడలేనిదీ...

సిరివెన్నెల చిత్రంకోసం కేవి మహదేవన్ గారు కంపోజ్ చేసిన ఒక చక్కని పాట ఈరోజు తలచుకుందాం. హుషారైన డాన్స్ ట్యూన్నూ మాంచి మెలోడీని అద్భుతంగా కలిపేయడం మహదేవన్ గారికే చెల్లింది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సిరివెన్నెల (1986)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, ఆనంద్, సుశీల

పాటల్లో పాడలేనిదీ నోటి మాటల్లో చెప్పలేనిదీ
నీ గుండెల్లో నిండి వున్నదీ ఈ బండల్లో పలుకుతున్నదీ
పాటల్లో పాడలేనిదీ నోటి మాటల్లో చెప్పలేనిదీ
నీ గుండెల్లో నిండి వున్నదీ ఈ బండల్లో పలుకుతున్నదీ

నీ ఆర్టు చూసి హార్టు బీటు రూటు మార్చి కొట్టుకుంటు
ఆహా ఓహో అంటున్నదీ.. అది ఆహా ఓహో అంటున్నదీ

ఈ ఇలలోనా శిలపైన కొలువైనా వాణి
ఈ ఇలలోనా శిలపైన కొలువైనా వాణి
వరవీణ మృదుపాణి వనరుహ లోచను రాణి
వరవీణ మృదుపాణి వనరుహ లోచను రాణి

నల్లనయ్యా.. పిల్లనగ్రోవినూదా వెల్లువై యెద పొంగిపోదా
నల్లనయ్యా.. పిల్లనగ్రోవినూదా వెల్లువై యెద పొంగిపోదా
పాట వింటూ లోకమంతా రాతి బొమ్మై నిలిచిపోదా
పాట వింటూ లోకమంతా రాతి బొమ్మై నిలిచిపోదా
నల్లనయ్యా...

అందమైన సుందరాంగులూ యెందరికో నెలవైన రాణివాసము
ఈ కోటలోన దాగి వున్నదీ నాటి ప్రేమగాధలెన్నొ కన్నది
అందమైన సుందరాంగులూ యెందరికో నెలవైన రాణివాసము
ఈ కోటలోన దాగి వున్నదీ నాటి ప్రేమగాధలెన్నొ కన్నది

హిస్టరీల మిస్టులోన మిస్టరీని చాటిచెప్పి
ఆహా ఓహో అంటూన్నదీ
అది ఆహా ఓహో అంటూన్నదీ..

రాసలీలా.. రాగహేల
రాసలీలా.. రాగహేల
రసమయమై సాగు వేళా

తరుణుల తనువులు వెన్నెల తరగలుగా ఊగు వేళా
నురుగుల పరుగులుగా సాగే యమునా నది ఆగు వేళ

నింగినేలా వాగూ వంకా చిత్రంగా చిత్తరువాయే
నింగినేలా వాగూ వంకా చిత్రంగా చిత్తరువాయే
నల్లనయ్యా.. పిల్లనగ్రోవినూదా వెల్లువై యెద పొంగిపోదా
లా లా లా లా లా...
 

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.