మంగళవారం, ఏప్రిల్ 07, 2015

పాటల్లో పాడలేనిదీ...

సిరివెన్నెల చిత్రంకోసం కేవి మహదేవన్ గారు కంపోజ్ చేసిన ఒక చక్కని పాట ఈరోజు తలచుకుందాం. హుషారైన డాన్స్ ట్యూన్నూ మాంచి మెలోడీని అద్భుతంగా కలిపేయడం మహదేవన్ గారికే చెల్లింది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.

చిత్రం : సిరివెన్నెల (1986)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, ఆనంద్, సుశీల

పాటల్లో పాడలేనిదీ నోటి మాటల్లో చెప్పలేనిదీ
నీ గుండెల్లో నిండి వున్నదీ ఈ బండల్లో పలుకుతున్నదీ
పాటల్లో పాడలేనిదీ నోటి మాటల్లో చెప్పలేనిదీ
నీ గుండెల్లో నిండి వున్నదీ ఈ బండల్లో పలుకుతున్నదీ

నీ ఆర్టు చూసి హార్టు బీటు రూటు మార్చి కొట్టుకుంటు
ఆహా ఓహో అంటున్నదీ.. అది ఆహా ఓహో అంటున్నదీ

ఈ ఇలలోనా శిలపైన కొలువైనా వాణి
ఈ ఇలలోనా శిలపైన కొలువైనా వాణి
వరవీణ మృదుపాణి వనరుహ లోచను రాణి
వరవీణ మృదుపాణి వనరుహ లోచను రాణి

నల్లనయ్యా.. పిల్లనగ్రోవినూదా వెల్లువై యెద పొంగిపోదా
నల్లనయ్యా.. పిల్లనగ్రోవినూదా వెల్లువై యెద పొంగిపోదా
పాట వింటూ లోకమంతా రాతి బొమ్మై నిలిచిపోదా
పాట వింటూ లోకమంతా రాతి బొమ్మై నిలిచిపోదా
నల్లనయ్యా...

అందమైన సుందరాంగులూ యెందరికో నెలవైన రాణివాసము
ఈ కోటలోన దాగి వున్నదీ నాటి ప్రేమగాధలెన్నొ కన్నది
అందమైన సుందరాంగులూ యెందరికో నెలవైన రాణివాసము
ఈ కోటలోన దాగి వున్నదీ నాటి ప్రేమగాధలెన్నొ కన్నది

హిస్టరీల మిస్టులోన మిస్టరీని చాటిచెప్పి
ఆహా ఓహో అంటూన్నదీ
అది ఆహా ఓహో అంటూన్నదీ..

రాసలీలా.. రాగహేల
రాసలీలా.. రాగహేల
రసమయమై సాగు వేళా

తరుణుల తనువులు వెన్నెల తరగలుగా ఊగు వేళా
నురుగుల పరుగులుగా సాగే యమునా నది ఆగు వేళ

నింగినేలా వాగూ వంకా చిత్రంగా చిత్తరువాయే
నింగినేలా వాగూ వంకా చిత్రంగా చిత్తరువాయే
నల్లనయ్యా.. పిల్లనగ్రోవినూదా వెల్లువై యెద పొంగిపోదా
లా లా లా లా లా...
 
1 comments:

సిరివెన్నెలగారిని మనకిచ్చిన కళాతపస్వి కి జేజేలు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.