సోమవారం, ఏప్రిల్ 06, 2015

కనులు కనులతో...

సుమంగళి చిత్రం లోనుండి ఒక చక్కని ప్రేమ గీతం ఈరోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సుమంగళి (1965)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : ఘంటసాల, సుశీల

కనులు కనులతో కలబడితే
ఆ తగవుకు ఫలమేమి.. కలలే
 
కనులు కనులతో కలబడితే
ఆ తగవుకు ఫలమేమి.. కలలే
నా కలలో నీవే కనబడితే
ఆ చొరవకు బలమేమి.. మరులే
మరులు మనసులో స్ధిరపడితే
ఆపై జరిగేదేమి.. మనువూ.. ఊ ఊ ఊ
మనువై ఇద్దరు ఒకటైతే
ఆ మనుగడ పేరేమి.. సంసారం..
 
కనులు కనులతో కలబడితే
ఆ తగవుకు ఫలమేమి.. కలలే..

అల్లరి ఏదో చేసితిని..
చల్లగ ఎదనే దోచితివి
అల్లరి ఏదో చేసితిని..
చల్లగ ఎదనే దోచితివి
ఏమీ లేని పేదననీ..
నాపై మోపకు నేరాన్ని
ఏమీ లేని పేదననీ..
నాపై మోపకు నేరాన్ని
లేదు ప్రేమకు పేదరికం..
నే కోరను నిన్నూ ఇల్లరికం
 
లేదు ప్రేమకు పేదరికం..
నే కోరను నిన్నూ ఇల్లరికం
 
నింగీ నేలకు కడు దూరం
మన ఇద్దరి కలయిక విడ్డూరం

 
కనులు కనులతో కలబడితే
ఆ తగవుకు ఫలమేమి.. కలలే 
నా కలలో నీవే కనబడితే
ఆ చొరవకు బలమేమి.. మరులే
మరులు మనసులో స్ధిరపడితే
ఆపై జరిగేదేమి.. మనువూ.. ఊ ఊ ఊ
మనువై ఇద్దరు ఒకటైతే
ఆ మనుగడ పేరేమి.. సంసారం..
 
కనులు కనులతో కలబడితే
ఆ తగవుకు ఫలమేమి.. కలలే..ఏ.ఏ..ఏఏ..


1 comments:

యెంతమంది యెన్ని రకాలుగా వర్నించినా అప్పైట్ ఉండీ ఇప్పటి వరకూ ప్రేమ యెవ్వర్ గ్రీన్ సబ్జెక్ట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.