సోమవారం, ఏప్రిల్ 13, 2015

గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా...

సినిమాలో ఈపాట సంధర్బమేమిటో గానీ ఆసక్తిగా ఉంది.. ఒకే చరణాన్నిఒకరు రాగయుక్తంగానూ మరొకరు రిథమిక్ గానూ పాడి రెండొవ చరణంలో ఒకరిశైలి ఒకరు అనుకరిస్తూ పాడి సరదాగా సాగుతుంది. రమేష్ నాయుడి గారి స్వరసారధ్యంలో సాగే ఈ అందమైన పాట మీరూ విని ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : కళ్యాణి (1979)
సంగీతం : రమేశ్ నాయుడు
సాహిత్యం : దాసం గోపాలకృష్ణ
గానం : బాలు, సుశీల

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా..
గుండెలే దోస్తావు ఓ మల్లికా
పూవుల్లో మేనకవె నవమల్లికా..
పూబోణి కానుకవె సిరిమల్లికా

గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా..
గుండెలే దోస్తావు ఓ మల్లికా
పూవుల్లో మేనకవె నవమల్లికా..
పూబోణి కానుకవె సిరిమల్లికా
పూబోణి కానుకవె సిరిమల్లికా

జవరాలి జడలోనా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
జవరాలి జడలోన..జలతారు తారవై
కాముకుల మెడలోన..కర్పూర హారమై
దేహాన్ని..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
దేహాన్ని పులకించి..మురిసిపోతావు
దేవుణ్ణి పూజించ నోచుకోలేవూ..
దేవుణ్ణి పూజించ నోచుకోలేవూ....

జవరాలి జడలోన..జలతారు తారవై
కాముకుల మెడలోన..కర్పూర హారమై
దేహాన్ని పులకించి..మురిసిపోతావు
దేవుణ్ణి పూజించ నోచుకోలేవూ..

గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా..
గుండెలే దోస్తావు ఓ మల్లికా
పూవుల్లో మేనకవె నవమల్లికా..
పూబోణి కానుకవె సిరిమల్లికా

సుతిమెత్తగా నీవు తల్పాలు వేస్తావు
సువాసనలతోటి..తానమాడిస్తావు 
ఉల్లాసకేళికి వళ్ళు ఇస్తావు..
ఉసిగొల్పి ఉసిగొల్పి..కళ్ళుమూస్తావు

సుతిమెత్తగా నీవు..ఆ ఆ ఆ ఆ ఆ ఆ
సుతిమెత్తగా నువ్వు..తల్పాలు వేస్తావు
సువాసనలతోటి..తానమాడిస్తావు
ఉల్లాసకేళికి..ఆ ఆ ఆ ఆ ఆ
ఉల్లాసకేళికి వళ్ళు ఇస్తావు..
ఉసిగొలిపి ఉసిగొలిపి..కళ్ళుమూస్తావు
ఉసిగొలిపి ఉసిగొలిపి..కళ్ళుమూస్తావు

గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా..
గుండెలే దోస్తావు ఓ మల్లికా
పూవుల్లో మేనకవె నవమల్లికా..
పూబోణి కానుకవె సిరిమల్లికా
పూబోణి కానుకవె సిరిమల్లికా


1 comments:

పూల తేరుల్లాంటి అమ్మాయిల వర్ణన యెన్ని సార్లు విన్నా బావుంటుందండీ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.