శుక్రవారం, ఏప్రిల్ 24, 2015

నీలాల నింగిలో...

జేబుదొంగ చిత్రం కోసం చక్రవర్తి గారి స్వరరచనలో బాలూ సుశీలలు గానం చెసిన ఒక చక్కని యుగళ గీతం ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : జేబు దొంగ (1975)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం: బాలు, సుశీల

నీలాల నింగిలో.. మేఘాల తేరులో..
ఆ పాల పుంతలో..నీ కౌగిలింతలో..
నిలువెల్లా కరిగిపోనా.. నీలోనా కలిసిపోనా

నీలాల నింగిలో... మేఘాల తేరులో..
ఆ పాల పుంతలో ..నీ కౌగిలింతలో..
నిలువెల్లా కరిగిపోనా... నీలోనా కలిసిపోనా

 
నీలాల నింగిలో... మేఘాల తేరులో..ఓ..ఓ..

ఆ నింగికి నీలం నీవై...
ఈ నేలకు పచ్చను నేనై
రెండూ కలిసిన అంచులలో..
రేపూ మాపుల సంధ్యలలో

ఎర్రని పెదవుల ముద్దులుగా
నల్లని కన్నుల సుద్దులుగా
ఎర్రని పెదవుల ముద్దులుగా
నల్లని కన్నుల సుద్దులుగా
 
మెల్లగ.. చల్లగ...
మెత్తగ.. మత్తుగ హత్తుకుపోయీ
నిలువెల్లా కరిగిపోనా నీలోనా కలిసిపోనా

నీలాల నింగిలో.. మేఘాల తేరులో.. ఓఓఓ...

ఆ హిమగిరి శిఖరం నీవై ...
ఈ మమతల మంచును నేనై
 
ఆశలు కాచే వేసవిలో..
తీరని కోర్కెల తాపంలో

శివపార్వతుల సంబరమై
గంగా యమునల సంగమమై
శివపార్వతుల సంబరమై
గంగా యమునల సంగమమై

 
ఉరకల..పరుగులా ..
పరువములోనా.. ప్రణయములోనా...
నిలువెల్లా కరిగిపోనా నీలోనా కలిసిపోనా

నీలాల నింగిలో.. మేఘాల తేరులో..
ఆ పాల పుంతలో..నీ కౌగిలింతలో..
నిలువెల్లా కరిగిపోనా.. నీలోనా కలిసిపోనా
నీలాల నింగిలో... మేఘాల తేరులో..
ఆహాహా..ఆఅహహ..ఊహూహూ.హుహు.. 

1 comments:

మనసుని మల్లెల తీరానికి చేర్చే పాట..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.