శుక్రవారం, ఏప్రిల్ 10, 2015

ఘల్లు ఘల్లునా...

లేట్ ఎయిటీస్ లోని సంగీత ప్రభంజనం "నీరాజనం" సినిమా కోసం జానకి గారు పాడిన ఒక చక్కని పాట ఈరోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : నీరాజనం (1988)
సంగీతం : ఓ.పి. నయ్యర్
సాహిత్యం : రాజశ్రీ
గానం : జానకి

ఘల్లు ఘల్లునా గుండె ఝల్లునా
పిల్ల ఈడు తుళ్ళి పడ్డదీ
మనసు తీరగా మాటలాడకా
మౌనం ఎందుకన్నదీ

ఘల్లు ఘల్లునా గుండె ఝల్లనా
పిల్ల ఈడు తుళ్ళి పడ్డదీ...
మనసు తీరగా మాటలాడకా
మౌనం ఎందుకన్నదీ...

 
క్షణమాగక తనువూగెను ఈ సంధ్యా సమీరాలలో
అనురాగమే తల ఊపెను నీలాకాశ తీరాలలో
క్షణమాగక తనువూగెను ఈ సంధ్యా సమీరాలలో
అనురాగమే తల ఊపెను నీలాకాశ తీరాలలో

ఘల్లు ఘల్లునా గుండె ఝల్లనా
పిల్ల ఈడు తుళ్ళి పడ్డదీ...హో
మనసు తీరగా మాటలాడకా
మౌనం ఎందుకన్నదీ...

ఘల్లు ఘల్లునా గుండె ఝల్లనా
పిల్ల ఈడు తుళ్ళి పడ్డదీ...హో
మనసు తీరగా మాటలాడకా
మౌనం ఎందుకన్నదీ...

 
కలగీతమై పులకించెను నవకళ్యాణ నాదస్వరం
కథ కానిదీ తుది లేనిది మన హృదయాల నీరాజనం
కలగీతమై పులకించెను నవకళ్యాణ నాదస్వరం
కథ కానిదీ తుది లేనిది మన హృదయాల నీరాజనం

ఘల్లు ఘల్లునా గుండె ఝల్లనా
పిల్ల ఈడు తుళ్ళి పడ్డదీ...
మనసు తీరగా మాటలాడకా
మౌనం ఎందుకన్నదీ...

ఘల్లు ఘల్లునా గుండె ఝల్లనా
పిల్ల ఈడు తుళ్ళి పడ్డదీ
మనసు తీరగా మాటలాడకా
మౌనం ఎందుకన్నదీ
 

1 comments:

ఆహా..మరో సారి ఓ.పి.నయ్యర్ గారు..నీరాజనం లోని వారి పాటలన్నీ మిస్ కాకుండా మాకందిస్తున్నందుకు అభినందనలండీ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.