శనివారం, ఏప్రిల్ 25, 2015

ఒక పూల బాణం...

ఆత్మ గౌరవం చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఆత్మ గౌరవం (1966)
సంగీతం : సాలూరి రాజేశ్వర్ రావు
సాహిత్యం : దాశరథి
గానం : ఘంటసాల, సుశీల

ఒక పూల బాణం తగిలింది మదిలో 
తొలి ప్రేమ దీపం వెలిగింది లే
నాలో వెలిగింది లే

ఒక పూల బాణం తగిలింది మదిలో 
తొలి ప్రేమ దీపం వెలిగింది లే
నాలో వెలిగింది లే

అలనాటి కలలే ఫలియించే నేడే 
అలనాటి కలలే ఫలియించే నేడే
మనసైన వాడే మనసిచ్చి నాడే
 
ఈ ప్రేమ లో లోకమే పొంగి పోయి 
ఈ ప్రేమ లో లోకమే పొంగి పోయి 
వసంతాల అందాలా ఆనందాల ఆడాలొయి

ఒక పూల బాణం తగిలింది మదిలో 
తొలి ప్రేమ దీపం వెలిగింది లే
నాలో వెలిగింది లే

ఏ పూర్వ బంధమో అనుబంధమాయె 
ఏ పూర్వ బంధమో అనుబంధమాయె 
అపురూప మైన అనురాగ మాయె
నీ కౌగిటా హాయిగా సోలిపోయి
నీ కౌగిటా హాయిగా సోలిపోయి
సరదాల ఉయ్యాల ఉల్లాసం గా వూగాలోయి

ఒక పూల బాణం తగిలింది మదిలో 
తొలి ప్రేమ దీపం వెలిగింది లే
నాలో వెలిగింది లే 

1 comments:

కాంచన నిజంగానే నీలోత్పల లానే ఉంటుండండీ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.