మంగళవారం, ఏప్రిల్ 21, 2015

నారాయణ మంత్రం...

ఈ రోజు అక్షయ తృతీయ కదా... ముందుగా ఘంటసాల వారి స్వరంలోని ఈ లక్ష్మీ దేవి ప్రార్ధనతో మొదలెడదాం.


లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం !
దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం !!
శ్రీమన్మంద కటాక్ష లబ్ధవిభవ ద్బ్రహ్మేంద్ర గంగాధరాం !
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం !!

~*~*~*~*~*~*~*~*~*~

ఈ రోజు ఆ నారాయణున్ని తలచుకొనడం కూడా పుణ్యమే కనుక భక్త ప్రహ్లాద లోని పాట గుర్తు చేసుకుందాం. సాలురి వారి స్వరకల్పనలో సుశీల గారు గానం చేసిన ఈ పాట నాకు చాలా ఇష్టం. ఈ పాట ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


 చిత్రం : భక్తప్రహ్లాద
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : సముద్రాల
గానం : సుశీల

ఓం నమో నారాయణాయ
ఓం నమో నారాయణాయ 
ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ 
ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ 

నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
భవబంధాలు పారద్రోలి పరమునొసంగే సాధనం

నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం

 

గాలిని బంధించి హసించి గాసిల పనిలేదు
గాలిని బంధించి హసించి గాసిల పనిలేదు
జీవుల హింసించే క్రతువుల చేయగ పనిలేదు
జీవుల హింసించే క్రతువుల చేయగ పనిలేదు
మాధవ మధుసూధన అని మనసున తలచిన చాలుగా
మాధవ మధుసూధన అని మనసున తలచిన చాలుగా

నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం

 

తల్లియు తండ్రియు నారాయణుడె
గురువు చదువు నారాయణుడె
యోగము యాగము నారాయణుడె
ముక్తియు దాతయు నారాయణుడె
భవబంధాలు పారద్రోలి పరమునొసంగే సాధనం

నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం

 

నాథహరే శ్రీ నాథహరే
నాథహరే జగన్నాథహరే
 

 

1 comments:

నిజం గా యెన్ని సార్లు విన్న మనసు భక్తితో నిండిపొతుందండీ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.