సోమవారం, జులై 31, 2017

సడిసేయకోగాలి సడిసేయబోకే...

రాజమకుటం చిత్రంలోని ఒక చక్కని పాటతో ఈ గాలి పాటల సీరీస్ ముగిద్దాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రాజ మకుటం (1959)
సంగీతం : మాస్టర్ వేణు
సాహిత్యం : దేవులపల్లి కృష్ణ శాస్త్రి
గానం : పి.లీల

సడిసేయకోగాలి సడిసేయబోకే
సడిసేయకోగాలి సడిసేయబోకే
బడలి ఒడిలోరాజు పవళించేనే 

సడిసేయకే

రత్నపీఠికలేని రారాజు నాస్వామి
మణికిరీటములేని మహరాజుగాకేమి
చిలిపిపరుగులుమాని కొలిచిపోరాదే 

సడిసేయకే

ఏటిగలగలకే ఎగసి లేచేనే
ఆకుకదలికలకే అదరిచూసేనే
నిదుర చెదరిందంటే నేనూరుకోనే 

సడిసేయకే

పండువెన్నెల నడిగి పాన్పుతేరాదే
నీడమబ్బులదాగు నిదురతేరాదే
విరుల వీవెనవూని విసిరిపోరాదే

సడిసేయకోగాలి సడిసేయబోకే
బడలి ఒడిలోరాజు పవళించేనే 

సడిసేయకోగాలి

 

ఆదివారం, జులై 30, 2017

ఈ గాలిలో.. ఊరేగు రాగాలలో..

నోట్ బుక్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. లిరిక్స్ వీడియోలో ఆడియో క్వాలిటీ బావుంది అది ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నోట్ బుక్ (2007)
సంగీతం : మిక్కీ జె మేయర్
సాహిత్యం : వనమాలి
గానం : నిత్య సంతోషిణి

ఈ గాలిలో.. ఊరేగు రాగాలలో
ఈ వేళ నా.. మనవిని వినవా
నీ ఊసులే.. నా గుండె లోగిళ్ళలో
దాచానులే.. మనసును కనవా

నాలో.. లో లోనా.. నిన్నే చూస్తున్నా
నువ్వే నేనా విడలేని శ్వాసనా
రోజూ..నీడల్లే..నిన్నే వెంటాడే
పాదం కానా..కడదాక సాగనా

ఈ గాలిలో ఊరేగు రాగాలలో
ఈ వేళ నా మనవిని వినవా

పూసే..పువ్వా..ఇది విన్నావా
కూసే..గువ్వా..ఇటుగా వాలవా
మువ్వా..నువ్వూ..దయచేసావా
పువ్వులా విరబూస్తున్నా..గువ్వలా ఎగిరొస్తున్నా
మువ్వలా నవ్వుతున్నా..నన్ను చూడవే

తెలుపరే ఇకమీదైనా..మారదా మన తీరైనా
గుండెలో ప్రేమై రానా !

ఈ గాలిలో ఊరేగు రాగాలలో
ఈ వేళ నా మనవిని వినవా
ఈ ఊసులే నా గుండె లోగిళ్ళలో
దాచానులే మనసుని కనవా

నిన్నా..మొన్నా..కలగన్నానా
నేడే..నన్నే..ఎద కవ్వించెనా
రేయీ..పగలూ..తన ధ్యాసేనా
ఇంతగా వారిస్తున్నా..చెంతకే రానంటున్నా
ఎందుకీ మనసుకు మాత్రం ఇంత యాతనా
జంటగా ముడిపెడుతున్నా
జంకితే ముడి దొరికేనా
జన్మకే బంధం కానా !

నాలో..లో లోనా.. నిన్నే చూస్తున్నా
నువ్వే విన్నా విడలేని శ్వాసనా
రోజూ..నీడల్లే..నిన్నే వెంటాడే
పాదం కానా..కడదాక సాగనా

ఈ గాలిలో ఊరేగు రాగాలలో
ఈ వేళ నా మనవిని వినవా
ఈ ఊసులే నా గుండె లోగిళ్ళలో
దాచానులే మనసుని కనవా


శనివారం, జులై 29, 2017

గాలి లోనే మాటి మాటికీ...

సత్య చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సత్య (1999)
సంగీతం : విశాల్ భరద్వాజ్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : రాజేష్

గాలి లోనే మాటి మాటికీ
వేలితో నీ పేరు రాయడం
గాలి లోనే మాటి మాటికీ
వేలితో నీ పేరు రాయడం
యెమయ్యిందో యేమిటో
నాకేమయ్యిందో యేమిటో
రాతిరంతా చందమామతో
లేని పోని ఊసులాడటం
యెమయ్యిందో యేమిటో
నాకేమయ్యిందో యేమిటో

ఒక్క సారి నిన్ను వానవొల్లో
ఆడుతుంటె చూసాను
అంత వరకు ఎప్పుడు ఆనవాలే
లేని ఊహలోన తడిసాను
ఒక్క సారి నిన్ను వాన వొల్లో
ఆడుతుంటె చూసాను
అంత వరకు ఎప్పుడు ఆనవాలే
లేని ఊహ లోన తడిసాను
మెరిసె వాన విల్లులా కలలో నువ్విలా
కొలువుండిపోతె ఇంక నిదురించేదెలా

కునుకు రాని అర్ధరాత్రిలో
కళ్ళు తెరిచి కలవరించడం
యెమయ్యిందో యేమిటో
నాకేమయ్యిందో యేమిటో

మెరిసె మాయలేడి రూపం
మంత్రం వేసి నన్ను లాగుతుంటె
ఆగుతుందా నాలో వయసు వేగం
మనస్సులో సముద్రమై
అలజడి ఎటున్నా రమ్మని
నీకోసం కోటి అలలై పిలిచే సందడి
దిక్కులంటి నీ దాటి జాడ వెతకనీ

దారి పోయె ప్రతి వారిలో
నీ పోలికలే వెతుకుతుండటం
యెమయ్యిందో యేమిటో
నాకేమయ్యిందో యేమిటో

గాలి లోనే మాటి మాటికీ
వేలితో నీ పేరు రాయడం
యెమయ్యిందో యేమిటో
నాకేమయ్యిందో యేమిటో


శుక్రవారం, జులై 28, 2017

భాగ్యద లక్ష్మీ బారమ్మా...

ఈ రోజు మొదటి శ్రావణ శుక్రవారం సంధర్బముగా ఆ శ్రీమహాలక్ష్మిని స్మరిస్తూ ప్రఖ్యాతినొందిన ఒక కన్నడ సంకీర్తన తలచుకుందాం. పురందరదాసు గారు రచించిన ఈ కీర్తనను నోడి స్వామి నావిరోదు హీగె (ನೋಡಿ ಸ್ವಾಮಿ ನಾವಿರೋದು ಹೀಗೆ) అనే చిత్రంలో ఉపయోగించారు. ఆ వీడియోను ఇక్కడ ఎంబెడ్ చేస్తున్నాను. ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : నోడి స్వామి నావిరోదు హీగె (ನೋಡಿ ಸ್ವಾಮಿ ನಾವಿರೋದು ಹೀಗೆ) (1983)
సంగీతం : పురందరదాసు/జి.కె.వెంకటేష్
సాహిత్యం : పురందరదాసు
గానం : పండిట్ భీంసేన్ జోషీ

లక్ష్మీ లక్ష్మీ లక్ష్మీ 
బారమ్మా బారమ్మా బారమ్మా 
లక్ష్మీ బారమ్మా
భాగ్యద లక్ష్మీ బారమ్మా నమ్మమ్మ 
నీ సౌభాగ్యద లక్ష్మీ బారమ్మా
నమ్మమ్మ నీ సౌభాగ్యద లక్ష్మీ బారమ్మా

  గెజ్జె కాల్గళ ధ్వనియ తోరుత 
గెజ్జె కాల్గళ ధ్వనియ తోరుత 
హెజ్జయ మేలెందెజ్జెయ నిక్కుత
సజ్జన సాధు పూజెయ వేళెగె 
మజ్జిగెయొళగిన బెణ్ణెయంతె

భాగ్యద లక్ష్మీ బారమ్మా 
నమ్మమ్మ నీ సౌభాగ్యద లక్ష్మీ బారమ్మా
నమ్మమ్మ నీ సౌభాగ్యద లక్ష్మీ బారమ్మా

కనక వృష్టియ కరెయుత బారె,
  కనక వృష్టియ కరెయుత బారె, 
మన కామనయ సిద్ధియ తోరే
దినకర కోటి తేజది హొళెయువ 
జనకరాయన కుమారి బేగ

 
భాగ్యద లక్ష్మీ బారమ్మా 
నమ్మమ్మ నీ సౌభాగ్యద లక్ష్మీ బారమ్మా
నమ్మమ్మ నీ సౌభాగ్యద లక్ష్మీ బారమ్మా
 
సంఖ్యె ఇల్లద భాగ్యవ కొట్టు 
కంకణ కైయ తిరువుత బారె
సంఖ్యె ఇల్లద భాగ్యవ కొట్టు 
కంకణ కైయ తిరువుత బారె 
 కుంకుమాంకితె పంకజలోచనె, 
వెంకటరమణన బింకద రాణీ

భాగ్యద లక్ష్మీ బారమ్మా 
నమ్మమ్మ నీ సౌభాగ్యద లక్ష్మీ బారమ్మా
నమ్మమ్మ నీ సౌభాగ్యద లక్ష్మీ బారమ్మా

సక్కరె తుప్పద కాలువె హరిసి   సక్కరె తుప్పద కాలువె హరిసి 
 శుక్రవారధ పూజయ వేళగె
అక్కరెయుళ్ళ అళగిరి రంగన 
చొక్క పురందర విఠలన రాణీ
విఠలన రాణీ విఠలన రాణీ  
విఠలన రాణీ విఠలన రాణీ ఆఆఆఆ...

భాగ్యద లక్ష్మీ బారమ్మా 
నమ్మమ్మ నీ సౌభాగ్యద లక్ష్మీ బారమ్మా
నమ్మమ్మ నీ సౌభాగ్యద లక్ష్మీ బారమ్మా

లక్ష్మీ బారమ్మా లక్ష్మీ లక్ష్మీ 
బారమ్మా బారమ్మా బారమ్మా బారమ్మా

ఈ పాటకు ప్రతిపదార్థం కాకపోయినా తెలుగు వర్షన్ గా ఈ కింది సాహిత్యాన్ని తీస్కోవచ్చు. ఈ తెలుగు అర్ధం అండ్ లిరిక్ న్యూ ఆవకాయ అనే సైట్ నుండి సంగ్రహించడమైనది.

భాగ్యపు లక్ష్మీ రావమ్మ, మాయమ్మ, 
ఓ సౌభాగ్యపు లక్ష్మీ రావమ్మ

అడుగున అడుగు వేయుచు 
కాలి గజ్జెల రవముల చూపుచు
సజ్జన సాధు పూజల వేళకు 
మజ్జిగలోని వెన్నెలాగ

భాగ్యపు లక్ష్మీ రావమ్మ, మాయమ్మ, 
ఓ సౌభాగ్యపు లక్ష్మీ రావమ్మ

కనక వృష్టిని కురియుచు రావె, 
మన కామనపు సిద్ధిని చూపుమ
దినకర కోటి తేజములలర 
జనక రాయడి కుమారి, వేగమే

భాగ్యపు లక్ష్మీ రావమ్మ, మాయమ్మ, 
ఓ సౌభాగ్యపు లక్ష్మీ రావమ్మ

సంఖ్యే ఎరుగని భాగ్యములిచ్చి, 
కంకణ భూషిత కరముల ద్రిప్పి
కుంకుమాంకితే, పంకజలోచని, 
వెంకటరమణుని అనుంగు పత్నీ

భాగ్యపు లక్ష్మీ రావమ్మ, మాయమ్మ, 
ఓ సౌభాగ్యపు లక్ష్మీ రావమ్మ

చక్కెర, నెయ్యి కాలువ పారగ, 
శుక్రవారపు పూజల వేళకు
అక్కరలెరిగిన అళగిరి రంగడు 
చక్కని పురందరవిఠలుని రాణీ

భాగ్యపు లక్ష్మీ రావమ్మ, మాయమ్మ, 
ఓ సౌభాగ్యపు లక్ష్మీ రావమ్మగురువారం, జులై 27, 2017

గాలే నా వాకిటికొచ్చె...

రిథమ్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : రిథం (2000)
సంగీతం : ఏ.ఆర్. రెహమాన్
సాహిత్యం : వేటూరి
గానం : ఉన్నికృష్ణన్, కవితాకృష్ణమూర్తి

గాలే నా వాకిటికొచ్చె.. మెల్లంగా తలుపే తెరిచే
ఐతే మరి పేరేదన్నా.. లవ్వే అవునా...ఆ..ఆ.ఆ

నీవూ నిన్నెక్కడ వున్నావ్.. గాలీ అది చెప్పాలంటే
శ్వాసై నువ్ నాలో వున్నావ్ అమ్మీ అవునా !

తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయే ఎంకి పాట పాడూ..
ఇల వున్న వరకూ నెలవంక వరకూ.. గుండెలోకి వీచు

ఇల వున్న వరకూ నెలవంక వరకూ.. 
గుండెలోకి వీచు ఊ ఊ ఊ

గాలే నా వాకిటికొచ్చె..మెల్లంగా తలుపే తెరిచే
ఐతే మరి పేరేదన్నా.. లవ్వే అవునా...ఆ..ఆ..ఆ.ఆ

నీవూ నిన్నెక్కడ వున్నావ్.. గాలీ అది చెప్పాలంటే
శ్వాసై నువ్ నాలో వున్నావ్.. అవునూ..ఊ అవునా..ఆ..ఆ

తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయే ఎంకి పాట పాడూ..
ఇల వున్న వరకూ నెలవంక వరకూ.. గుండెలోకి వీచు

తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయె 
ఎంకి పాట పాడూ..ఊ..ఊ..ఊ

గాలే నా వాకిటికొచ్చె..మెల్లంగా తలుపే తెరిచే
ఐతే మరి పేరేదన్నా.. లవ్వే అవునా...ఆ..ఆ..ఆ.ఆ

ఆషాడ మాసం వచ్చి.. వానొస్తే నీవే దిక్కు
నీ వోణీ గొడుగే పడతావా..ఆ..ఆ..ఆ..ఆ

అమ్మో నాకొకటే మైకం.. అనువైన చెలిమే స్వర్గం
కన్నుల్లో క్షణమే నిలిపేవా..ఆ..ఆ..ఆ..ఆ

నీ చిరు సిగ్గుల వడి తెలిసే..
నేనప్పుడు మదిలో వొదిగితే
నీ నెమ్మదిలో నా వునికే కనిపెడతా..ఆ.వా..ఆ..ఆ

పువ్వులలోనా తేనున్నవరకూ కదలను వదిలి
పువ్వులలోనా తేనున్నవరకూ కదలను వదిలి

భూమికి పైన మనిషున్న వరకూ కరగదు వలపు

గాలే నా వాకిటికొచ్చె..మెల్లంగా తలుపే తెరిచే
ఐతే మరి పేరేదన్నా.. లవ్వే అవునా...ఆ..ఆ..ఆ.ఆ

గాలే నా వాకిటికొచ్చె..మెల్లంగా తలుపే తెరిచే
ఐతే మరి పేరేదన్నా.. లవ్వే అవునా...ఆ..ఆ..ఆ.ఆ

చిరకాలం చిప్పల్లోనా వన్నెలు చిలికే ముత్యం వలెనే
నా వయసే తొణికసలాడినదే..ఏ..ఏ..ఏ..
తెరచాటు నీ పరువాల తెర తీసే శోధనలో
ఎదనిండా మదనం జరిగినదే..ఏ..ఏ..ఏఏ..ఏఏ..ఏఏ

నే నరవిచ్చిన పువ్వైతే.. నులి వెచ్చని తావైనావు
ఈ పడుచమ్మను పసిమొగ్గను చేస్తావా...ఆ..ఆ..ఆ..ఆ

కిర్రు మంచమడిగే కుర్ర దూయలుంటే సరియా సఖియా..
కిర్రు మంచమడిగే కుర్ర దూయలుంటే సరియా సఖియా..

చిన్న పిల్లలై మనం కుర్ర ఆటలాడితే వయసా వరసా..

గాలే నా వాకిటికొచ్చె.. మెల్లంగా...
ఐతే మరి పేరేదన్నా.. లవ్వే అవునా...ఆ..ఆ..ఆ.ఆ

తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయే ఎంకి పాట పాడూ..
ఇల వున్న వరకూ నెలవంక వరకూ.. గుండెలోకి వీచు

తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయే ఎంకి పాట పాడూ.. ఊ ఊ ఊ
తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయే ఎంకి పాట పాడూ..

 

బుధవారం, జులై 26, 2017

చలచల్లగా గాలీ...

యమదొంగ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : యమదొంగ (2007)
సంగీతం : కీరవాణి 
సాహిత్యం : భువనచంద్ర 
గానం : కీరవాణి, సంగీత 

చలచల్లగా గాలీ... 
మెలమెల్లగా తేలీ.. 
మేఘవనిలో రాగమధనం 
మనమే చేయాలీ... 
ఆహా... ఓహో... ఓఓఓఓఓఓఓ.. 
ఆహా... ఓఓఓఓఓఓ

కసి ఉసిగొలిపే గుసగుసలో 
రసికత పండాలీ.. 
అవసర సుమశర 
స్వర్గములే చూపించాలీ

మగసిరి గడసరి డోలికలో 
మనజత ఊగాలీ 
యమసుర వరునికి 
అమృతమే అందించాలీ
లాహిరీ కేళి ఈ జిలిబిలీ
నావసరళి నీవు కదలి 
చెలి గిలి భళీ.. 
 
చలచల్లగా గాలీ... ఉమ్..
మెలమెల్లగా తేలీ.. 
మేఘవనిలో రాగమధనం 
మనమే చేయాలీ... 
ఆహా... ఓహో... ఓఓఓఓఓఓఓ.. 
ఆహా... ఓహోఓఓఓ


మంగళవారం, జులై 25, 2017

జాలి జాలి సందెగాలి...

యుద్దభూమి సినిమాలోని ఒక హాయైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : యుద్దభూమి (1988)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

జాలి జాలి సందెగాలి లాలిపాడినా 
తేలి తేలి మల్లెపూల తెమ్మెరాడినా 
ఎందుకో నిదరపోదు నా వయసు బహుశా.. 
బహుశా.. ప్రేమించిందో ఏమో నా మనసు 

సోలి సోలి లేత ఈడు సొమ్మసిల్లినా
చూసి చూసి రెండు కళ్ళు చెమ్మగిల్లినా
ఎందుకో నిలువనీదు నా మనసు బహుశా.. 
బహుశా.. విరహంలో వుందేమో ఆ సొగసు 

పడమటింట పొద్దు వాలి గడియ పెట్టినా 
తారకల్లు ఆకసాన దీపమెట్టినా 
వాగులమ్మ అలల నీటి వీణ మీటినా 
వెన్నెలమ్మ కనుల మీద వేణువూదినా 
ఆగదు అందదు మనసు ఎందుకో 
ఒడినే అడిగే ఒంటి మీద వలపు సోకి 
కంటి మీద కునుకురాని కొంటె కోరిక 
తెలుసుకో ఇక....! 

జాలి జాలి సందెగాలి లాలిపాడినా 
చూసి చూసి రెండు కళ్ళు చెమ్మగిల్లినా
 
కోకిలమ్మ కొత్త పాట కోసుకొచ్చినా 
పూవులమ్మ కొత్త హాయి పూసి వెళ్ళినా 
వానమబ్బు మెరుపులెన్ని మోసుకొచ్చినా 
మాఘవేళ మత్తు జల్లి మంత్రమేసినా 
తీరని తీయని మనసు ఏమిటో 
అడుగు చెబుతా ఒంటిగుంటె ఓపలేక 
జంట కట్టుకున్న వేళ చిలిపి కోరిక 
తెలుపుకో ఇక... 

సోలి సోలి లేత ఈడు సొమ్మసిల్లినా
చూసి చూసి రెండు కళ్ళు చెమ్మగిల్లినా
ఎందుకో నిలువనీదు నా మనసు బహుశా.. 
బహుశా.. విరహంలో వుందేమో ఆ సొగసు 

జాలి జాలి సందెగాలి లాలిపాడినా 
తేలి తేలి మల్లెపూల తెమ్మెరాడినా 
ఎందుకో నిదరపోదు నా వయసు బహుశా.. 
బహుశా.. ప్రేమించిందో ఏమో నా మనసు 

సోమవారం, జులై 24, 2017

చలిగాలి చలిగాలి పరవశమా...

రన్ సినిమా కోసం విద్యాసాగర్ స్వరపరచిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఈ పాట సినిమాలో లేదనుకుంటాను వీడియో దొరకలేదు. ఎంబెడెడ్ వీడియో ప్రజంటేషన్ ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రన్ (2003)
సంగీతం : విద్యాసాగర్
రచన : ఎ.ఎం.రత్నం, శివ గణేష్
గానం : బలరామ్ , సాధనా సర్గం

చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా
చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా
సద్దేలేని దీపావళినే మనసే కోరింది
హద్దేలేని ముద్దులగాలిలో తనువే ఊగింది
వయసే వయసుకు వలపులు నేర్పింది
చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా

మనముండే చోటు ఏకాంత ద్వీపం 
ఎవ్వరికి అనుమతి లేదంటా
ఓ.. దారితప్పి ఎవరో వస్తే రావొచ్చు 
చిరునామా ఇంటికి వలదంట
నే వెతికే సొగసరివి నే మెచ్చే గడుసరివి
ఊపిరిలో ఊపిరివి నాలోన ఆవిరివి
ఎన్ని సిరులైనా వదిలేస్తా నిను మాత్రం బంధించేస్తా
ఏమో నా హృదయం పొంగింది 

చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా

హొ.. నిదురేమో నీది కలలన్నీ నావి 
నిద్దురను కలచి వెయ్యొద్దు
పదమేమో నీది పాదాలు నావి 
పయనాన్ని ఆపి వెయ్యొద్దు
నీ పేరే నా మదిలో వేదంలా వల్లిస్తా
నువు నడిచే దారంట మేఘాలే పరిచేస్తా
ఇద్దరము కలిసిపోదాం లోకంలో నిలిచి ఉందాం
కలలన్ని నిజమే చేసేద్దాం

చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా
సద్దేలేని దీపావళినే మనసే కోరింది
హద్దేలేని ముద్దులగాలిలో తనువే ఊగింది
వయసే వయసుకు వలపులు నేర్పింది
చలిగాలి చలిగాలి పరవశమా పరవశమా


ఆదివారం, జులై 23, 2017

చల్ల గాలికి చెప్పాలని...

థమ్ చిత్రంలోని ఒక చక్కని మెలోడీని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : థమ్ (2003)
సంగీతం : రమణ గోగుల
సాహిత్యం : సురేంద్ర కృష్ణ
గానం : హరిహరన్, నందిత

చల్ల గాలికి చెప్పాలని ఉంది మన కథ ఈ వేళ
చందమామకు చెప్పాలని ఉంది సరసకు రావేలా?
వింతలు చూపి పులకింతలు రేపి మురిపించే కలని
తోడుగా ఉండి మనసంతా నిండి నడిపించే జతని

చల్ల గాలికి చెప్పాలని ఉంది మన కథ ఈ వేళ

నువ్వున్నది నాకోసం నేనే నీకోసంలా
నిలిచేది మనప్రేమలా
నువు లేని ప్రతి నిమిషం ఎదలో
ఒక గాయంలా కరిగే ఈ కన్నీటిలా
మనసున ఇంద్రజాలమే ఈప్రేమ
పరువపు పూల వానలే
ఇరువురి వలపు వంతెనే ఈ ప్రేమ
సకలం ప్రేమ సొంతమే

చల్ల గాలికి చెప్పాలని ఉంది మన కథ ఈ వేళ
చందమామకు చెప్పాలని ఉంది సరసకు రావేలా?

I love u I love u I love u I love u

నిదురంటూ మటుమాయం 
కుదురంటూకరువె ప్రతి గమకం సంగీతమే
ప్రతి ఊహ ఒక కావ్యం ప్రతి ఊసు మైకం 
ప్రతి చూపు పులకింతలె
చెదరని ఇంద్రధనుసులే ఈ ప్రేమ
తొలకరి వాన జల్లులే
కరగని పండు వెన్నెలే ఈ ప్రేమ
కలిగిన వేళ హాయిలె

చల్ల గాలికి చెప్పాలని ఉంది మన కథ ఈ వేళ
చందమామకు చెప్పాలని ఉంది సరసకు రావేలా?
వింతలు చూపి పులకింతలు రేపి మురిపించె కలని
తోడుగా ఉండి మనసంతా నిండి నడిపించే జతని

చల్ల గాలికి చెప్పాలని ఉంది మన కథ ఈ వేళ
చందమామకు చెప్పాలని ఉంది సరసకు రావేలా?

 

శనివారం, జులై 22, 2017

సన్నగ వీచే చల్ల గాలికి...

గుండమ్మ కథ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : గుండమ్మ కథ (1962)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : పింగళి
గానం : సుశీల

సన్నగ వీచే చల్ల గా...లికి
కనులు మూసినా కలలాయే
తెల్లని వెన్నెల పానుపు పై ఆ
కలలో వింతలు కననాయే

సన్నగ వీచే చల్ల గాలికి
కనులు మూసినా కలలాయే
తెల్లని వెన్నెల పానుపు పై
ఆ కలలో వింతలు కననాయే..

అవి తలచిన ఏమో సిగ్గాయే

కనులు తెరచినా నీవాయే
నే కనులు మూసినా నీవాయే
కనులు తెరచినా నీవాయే

నిదురించిన నా హృదయమునెవరో
కదిలించిన సడి విననాయే
నిదురించిన నా హృదయమునెవరో
కదిలించిన సడి విననాయే

కలవరపడి నే కనులు తెరువ
నా కంటి పాపలో నీవాయే
ఎచట చూచినా నీవాయే

కనులు తెరచినా నీవాయే
నే కనులు మూసినా నీవాయే
కనులు తెరచినా నీవాయే

మేలుకొనిన నా మదిలో యేవో
మెల్లని పిలుపులు విననాయే
మేలుకొనిన నా మదిలో యేవో
మెల్లని పిలుపులు విననాయే

ఉలికిపాటుతో కలయ వెతక
నా హృదయ ఫలకమున నీవాయే

కనులు తెరచినా నీవాయే
నే కనులు మూసినా నీవేనాయే
 

శుక్రవారం, జులై 21, 2017

గాలికదుపు లేదు...

ఇది కథ కాదు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడ్ చేసిన వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : ఇది కథ కాదు (1979)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
రచన : ఆచార్య ఆత్రేయ
గానం : జానకి

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. 
గాలికదుపు లేదు.. కడలికంతు లేదు
గంగ వెల్లువా కమండలంలో ఇమిడేదేనా
ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా

గాలికదుపు లేదు.. కడలికంతు లేదు
గంగ వెల్లువా కమండలంలో ఇమిడేదేనా
ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా

సారీసా సరిసరిసరిగ రీసాగ
సారీసా సరిసరిసరిగ రీసాగ
సారీసా సరిసరిసరిగ రీసాగ
సారీసా సరిసరిసరిగ రీసాగ

ఆ నింగిలో మబ్బునై పాడనా పాటలు ఎన్నో
ఈ నేలపై నెమలినై ఆడనా ఆటలు ఎన్నో
ఆ నింగిలో మబ్బునై పాడనా పాటలు ఎన్నో
ఈ నేలపై నెమలినై ఆడనా ఆటలు ఎన్నో
తుళ్ళి తుళ్ళి గంతులు వేసే లేగకేది కట్టుబాటు
మళ్ళీ మళ్ళీ వసంతమొస్తే మల్లెకేల ఆకుచాటు

గాలికదుపు లేదు.. కడలికంతు లేదు
గంగ వెల్లువా కమండలంలో ఇమిడేదేనా
ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా

ఓ తెమ్మెరా ఊపవే ఊహలా ఊయల నన్నూ
ఓ మల్లికా ఇవ్వవే నవ్వులా మాలిక నాకూ
తల్లి మళ్ళి తరుణయ్యింది.. పూవు పూసి మొగ్గయ్యింది
గుడిని విడిచివేరొక గుడిలో ప్రమిదనైతే తప్పేముందీ

గాలికదుపు లేదు.. కడలికంతు లేదు
గంగ వెల్లువా కమండలంలో ఇమిడేదేనా
ఉరికే మనసుకు గిరి గీస్తే అది ఆగేదేనా
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. గురువారం, జులై 20, 2017

చక్కనైన ఓ చిరుగాలి...

ప్రేమ సాగరం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ప్రేమసాగరం (1983)
సంగీతం : టి. రాజేందర్
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు

చక్కనైన ఓ చిరుగాలి... ఒక్కమాట వినిపోవాలి
చక్కనైన ఓ చిరుగాలి... ఒక్కమాట వినిపోవాలి

ఉషా దూరమైన నేను... ఊపిరైన తీయలేను
గాలి.. చిరుగాలి .. చెలి చెంతకు వెళ్ళి అందించాలి
నా ప్రేమ సందేశం...

చక్కనైన ఓ చిరుగాలి... ఒక్కమాట వినిపోవాలి
చక్కనైన ఓ చిరుగాలి... ఒక్కమాట వినిపోవాలి

ఉషా దూరమైన నేను... ఊపిరైన తీయలేను
గాలి.. చిరుగాలి .. చెలి చెంతకు వెళ్ళి అందించాలి
నా ప్రేమ సందేశం...


మూసారు గుడిలోని తలుపులను
ఆపారు గుండెల్లో పూజలను
దారిలేదు చూడాలంటే దేవతను
వీలుకాదు చెప్పాలంటే వేదనను
కలతైపోయే నా హృదయం 
కరువైపోయే ఆనందం
అనురాగమీవేళ అయిపోయే చెరసాల
అనురాగమీవేళ అయిపోయే చెరసాల
అయిపోయె చెరసాల

గాలి..  చిరుగాలి..  చెలి చెంతకు వెళ్ళి
అందించాలి... నా ప్రేమ సందేశం..

నా ప్రేమ రాగాలు కలలాయె
కన్నీటి కథలన్ని బరువాయే
మబ్బు వెనక చందమామ దాగి ఉన్నదో
మనసు వెనుక ఆశలన్ని దాచుకున్నదో
వేదనలేల ఈ సమయం
వెలుతురు నీదే రేపుదయం
శోధనలు ఆగేను శోకములు తీరేను
శోధనలు ఆగేను శోకములు తీరేను
శోకములు తీరేను..

గాలి..  చిరుగాలి..  చెలి చెంతకు వెళ్ళి
అందించాలి... నా ప్రేమ సందేశం.
..

చక్కనైన ఓ చిరుగాలి.. ఒక్కమాట వినిపోవాలి
చక్కనైన ఓ చిరుగాలి.. ఒక్కమాట వినిపోవాలి

ఉషా దూరమైన నేను.. ఊపిరైన తీయలేను
గాలి.. చిరుగాలి .. చెలి చెంతకు వెళ్ళి అందించాలి
నా ప్రేమ సందేశం.. ఈ నా ప్రేమ సందేశం..
ఈ  నా ప్రేమ సందేశం

 

బుధవారం, జులై 19, 2017

మల్లెపూల చల్లగాలి...

మౌనరాగం చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మౌనరాగం (1986)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం

మల్లెపూల చల్లగాలి మంటరేపె
సందెవేళలో ఏల ఈవేళా
కోరుకున్న గోరింకను చేరదేల
రామ చిలుకా ఏల అదేలా
ఆవేదనే.. ఈనాటికీ.. మిగిలింది నాకూ !

మల్లెపూల చల్లగాలి మంటరేపె
సందెవేళలో ఏల ఈవేళా

తామరలపైనా నీటిలాగా
భర్తయూ భార్యయూ కలవరంటా
తోడుగా చేరీ బ్రతికేందుకూ
సూత్రమూ మంత్రమూ ఎందుకంటా
సొంతం అనేది లేకా ప్రేమ బంధాలు లేకా
మోడంటి జీవితం ఇంకేలా ! హ !

మల్లెపూల చల్లగాలి మంటరేపె
సందెవేళలో .. ఏల ఈవేళ

వేదికై పోయే మన కధంతా
నాటకం ఆయెనూ మనుగడంతా
శోధనై పోయే హృదయమంతా
బాటలే మారెనే పయనమంతా
పండిచవే వసంతం పంచవేలా సుగంధం
నా గుండె గుడిలో నిలవాలీ .. రా !

మల్లెపూల చల్లగాలి మంటరేపె
సందెవేళలో ఏల ఈవేళా
కోరుకున్న గోరింకను చేరదేల
రామ చిలుకా ఏల అదేలా
ఆవేదనే ఈనాటికీ మిగిలింది నాకూ !

మల్లెపూల చల్లగాలి మంటరేపె
సందెవేళలో ఏల ఈవేళా 

 

మంగళవారం, జులై 18, 2017

ఈదురుగాలికి మా దొరగారికి...

కటకటాల రుద్రయ్య చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కటకటాల రుద్రయ్య (1978)
సంగీతం : జె.వి. రాఘవులు
రచన : వేటూరి
గానం: బాలు, సుశీల

ఈదురు గాలికి మా దొరగారికి 
ఏదో గుబులు రేగింది..
ఈ చలిగాలికి మా దొరసానికి 
ఎదలో వీణ మ్రోగింది..

హహ..ఉ హు ఉహు....
హహా..ఉహూ..ఉహు ఉహు..

ఈదురు గాలికి మా దొరగారికి 
ఏదో గుబులు రేగిందీ
ఈ చలిగాలికి మా దొరసానికి 
ఎదలో వీణ మ్రోగింది..
హహ...ఉ హు ఉహు..
హహా..ఉహూ..ఉహు ఉహు..
లల లలా..హుహు హుహూ

తడిసినకొద్ది..బిగిసిన రైక 
మిడిసి మిడిసి పడుతుంటే..
నిన్నొడిసి ఒడిసి పడుతుంటే....

తడిసే వగలు రగిలే సెగలు 
చిలిపి చిగురులేస్తుంటే..
నా కలలు నిదుర లేస్తుంటే..
నీ కళలు గెలలు వేస్తుంటే..

ఈదురుగాలికి మా దొరగారికి 
ఏదో గుబులు రేగిందీ
ఈ చలిగాలికి మా దొరసానికి 
ఎదలో వీణ మ్రోగింది..

లల లలా.. ఉహు ఉహూ
హెహె హెహే.. ఉహు ఉహూ

కరిగిన కుంకుమ పెదవి ఎరుపునే 
కౌగిలి కోరుతు ఉంటే
నా పెదవులెర్రబడుతుంటే
పడుచు సొగసులే ఇంద్రధనస్సులో 
ఏడు రంగులౌతుంటే..
నా పైట పొంగులౌతుంటే..
నీ హొయలు లయలు వేస్తుంటే..

ఈదురుగాలికి మా దొరగారికి 
ఏదో గుబులు రేగిందీ
హ.. ఈ చలిగాలికి మా దొరసానికి 
ఎదలో వీణ మ్రోగింది

హహ హహా..ఉహు ఉహూ
హహ హహా..ఉహు ఉహూ
లల లలా..హుహు హుహూ
హెహె హెహే..హుహు హుహూ


సోమవారం, జులై 17, 2017

గంధపు గాలిని...

ప్రియురాలు పిలిచింది చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ప్రియురాలు పిలిచింది(2000)
సంగీతం : రెహమాన్
సాహిత్యం : ఏ.ఎం.రత్నం, శివగణేష్
గానం : శంకర్ మహదేవన్

లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె
ఏమి చేయమందువే

గంధపు గాలిని తలుపులు ఆపుట
న్యాయమా.... న్యాయమా
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె
మౌనమా.... మౌనమా
చెలియా నాలో ప్రేమను తెలుప 
ఒక ఘడియ చాలులే
అదే నేను ఋజువే చేయ నూరేళ్లు చాలవే 

లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె
ఏమి చేయమందువే ఏమి చేయమందువే
 
గంధపు గాలిని తలుపులు ఆపుట
న్యాయమా.... న్యాయమా
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె
మౌనమా.... మౌనమా
చెలియా నాలో ప్రేమను తెలుప 
ఒక ఘడియ చాలులే
అదే నేను ఋజువే చేయ నూరేళ్లు చాలవే

లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె
ఏమి చేయమందువే ఏమి చేయమందువే
 
హృదయమొక అద్దమని నీ రూపు బింబమని
తెలిపేను హృదయం నీకు సొంతమనీ....
బింబాన్ని బంధింప తాడేది లేదు సఖి
అద్దాల ఊయల బింబమూగె చెలీ....
నువు తేల్చి చెప్పవే పిల్లా
లేక కాల్చి చంపవే లైలా
నా జీవితం నీ కనుపాపలతో
వెంటాడి ఇక వేటాడొద్దే

లేదని చెప్ప నిమిషము చాలు
లేదన్న మాట తట్టుకోమంటే
మళ్ళి మళ్ళి నాకొక జన్మే కావలె
ఏమి చేయమందువే ఏమి చేయమందువే

గంధపు గాలిని తలుపులు ఆపుట
న్యాయమా.... న్యాయమా
ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె
మౌనమా.... మౌనమా
 
తెల్లారి పోతున్నా విడిపోని రాత్రేది
వాసనలు వీచే నీ కురులే సఖీ....
లోకాన చీకటైనా వెలుగున్న చోటేది
సూరీడు మెచ్చే నీ కనులే చెలీ....
విశ్వ సుందరీమణులె వచ్చి
నీ పాద పూజ చేస్తారే
నా ప్రియ సఖియా ఇక భయమేలా
నా మనసెరిగి నా తోడుగ రావే

ఏమి చేయమందువే ఏమి చేయమందువే
ఏమి చేయమందువే ఏమి చేయమందువే
న్యాయమా... న్యాయమా
ఏమి చేయమందువే ఏమి చేయమందువే
మౌనమా... మౌనమా
ఏమి చేయమందువే
 

ఆదివారం, జులై 16, 2017

వసంతాల ఈ గాలిలో...

ఇది మా అశోగ్గాడి ప్రేమ కథ చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఈ పాట వీడియో దొరకలేదు, ఎంబెడెడ్ వీడియో ఆడియో జ్యూక్ బాక్స్ మాత్రమే అది ఇక్కడ కూడా చూడవచ్చు.


చిత్రం : ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ (2002)
సంగీతం : ఆనంద్ మిలింద్
సాహిత్యం : వేటూరి
గానం : అభిజిత్

వసంతాల ఈ గాలిలో గులాబి గుబాళింపులు
సరాగాల ఈ సంజెలో పరాగాల కవ్వింపులు
ఇవేనాటి క్రీనీడలో తుషారాలనీరెండలు
కుహూమన్న ఈ గొంతులో ధ్వనించాయిలే ప్రేమలు
వసంతాల ఈ గాలిలో గులాబి గుబాళింపులు
సరాగాల ఈ సంజెలో పరాగాల కవ్వింపులూ


మేఘాల సందేశమూ ఆ ప్రేమ విరిజల్లులే
స్వప్నాల సంకేతమూ ఎదలోని హరివిల్లులే
మైనాల సంగీతమూ ఈ పూల గంధాలులే
ప్రతిరోజు సాయంత్రమూ నీ వేడి నిట్టూర్పులే
అది శోకమో ఒక శ్లోకమో ఈ లోకమే ప్రేమలే

వసంతాల ఈ గాలిలో గులాబి గుబాళింపులు
సరాగాల ఈ సంజెలో పరాగాల కవ్వింపులూ


ప్రేమించినా కళ్ళకూ నిదురన్నదే రాదులే
ప్రేమించినా వాళ్ళకూ ఏ ఆకలి లేదులే
ఊహల్లో విహరింపులూ ఉయ్యాల పవళింపులూ
వెన్నెల్ల వేధింపులూ వెచ్చంగ లాలింపులూ
అది యోగమో అనురాగమో పురివిప్పు ఈ ప్రేమలో

వసంతాల ఈ గాలిలో గులాబి గుబాళింపులు
సరాగాల ఈ సంజెలో పరాగాల కవ్వింపులు
ఇవేనాటి క్రీనీడలో తుషారాల నీరెండలు
కుహూమన్న ఈ గొంతులో ధ్వనించాయిలే ప్రేమలు

 

శనివారం, జులై 15, 2017

జివ్వుమని కొండగాలి...

లంకేశ్వరుడు సినిమాలోని ఓ హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : లంకేశ్వరుడు (1989)
సంగీతం : రాజ్-కోటి 
సాహిత్యం : దాసరి 
గానం : మనో, జానకి

జివ్వుమని కొండగాలి
కత్తిలా గుచ్చుతోంది
వెచ్చనీ.. కోరికా.. రగిలిందిలే
నీవే నా ప్రేయసివే
నీకేలే అందుకో ప్రేమ గీతం

కస్సుమని పిల్లగాలి
నిప్పులా అంటుతోంది
తియ్యనీ.. కానుకా.. దొరికిందిలే
నీవే నా ప్రేమవులే
నీకేలే అందుకో ప్రేమ గీతం

 
జివ్వుమని కొండగాలి
కత్తిలా గుచ్చుతోంది

ఒంపుల్లో సొంపుల్లో అందముంది
కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది
ఒంపుల్లో సొంపుల్లో అందముంది
కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది 
కాశ్మీర కొండల్లో అందాలకే
కొత్త అందాలు ఇచ్చావో..
కాశ్మీర వాగుల్లో పరుగులకే
కొత్త అడుగుల్ని నేర్పావో..
నేనే నిను కోరి చేరి వాలి పోవాలి

కస్సుమని పిల్లగాలి
నిప్పులా అంటుతోంది

 
మంచల్లే కరగాలి మురిపాలు
సెలయేరల్లే ఉరకాలి యవ్వనాలు 
మంచల్లే కరగాలి మురిపాలు
సెలయేరల్లే ఉరకాలి యవ్వనాలు
కొమ్మల్లొ పూలన్ని పానుపుగా
మన ముందుంచే పూలగాలీ..
 
పూవుల్లొ దాగున్న అందాలనే
మన ముందుంచే గంధాలుగా..
నేనే నిను కోరి చేరి వాలి పోవాలి
 
జివ్వుమని కొండగాలి
కత్తిలా గుచ్చుతోంది
కస్సుమని పిల్లగాలి
నిప్పులా అంటుతోంది


శుక్రవారం, జులై 14, 2017

పిల్లగాలి అల్లరి...

అతడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అతడు (2005)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : సిరివెన్నెల
గానం : శ్రేయాఘోషల్

పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్లమబ్బు ఉరిమేనా
పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్లమబ్బు ఉరిమేనా
కళ్ళెర్రజేసి మెరుపై తరిమేనా
ఎల్లలన్నీ కరిగి,ఝల్లుమంటూ ఉరికి
మా కళ్ళలో, వాకిళ్ళలో వేవేల వర్ణాల వయ్యారి జాణ
అందమైన సిరివాన ముచ్చటగా మెరిసే సమయాన
అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లె తిరిగేనా

మౌనాల వెనకాల వైనాలు తెలిసేలా గారంగా పిలిచేనా
ఝల్లుమంటూ గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న తిల్లాన

మౌనాల వెనకాల వైనాలు తెలిసేలా గారంగా పిలిచేనా
ఝల్లుమంటూ గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న తిల్లాన
ఇంద్రజాలమై వినోదాల సుడిలో కాలాన్ని కరిగించగా
చంద్రజాలమై తారంగాల వొడిలో ఈళ్ళని మురిపించగా
తారలన్నీ తోరణాలై వారాల ముత్యాల హారాలయ్యేనా
చందనాలు చిలికేనా, ముంగిలిలో నందనాలు విరిసేనా

అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లె తిరిగేనా

నవ్వుల్లో హాయిరాగం, మువ్వల్లో వాయువేగం
ఏమైందో ఇంతకాలం ఇంతమంది బృందగానం
ఇవాళే పంపెనేమో ఆహ్వానం

నవ్వుల్లో హాయిరాగం, మువ్వల్లో వాయువేగం
ఏమైందో ఇంతకాలం ఇంతమంది బృందగానం
ఇవాళే పంపెనేమో ఆహ్వానం
పాలవెల్లిగా సంతోషాలు చిలికే సరదా సరాగాలుగా
స్వాతిజల్లుగా స్వరాలెన్నో పలికే సరికొత్త రాగాలుగా
నింగిదాకా పొంగిపోదా హోరెత్తిపోతున్న గానాభజానా
చెంగుమంటు ఆడేనా చిత్రంగా జావళీలు పాడేనా

అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లె తిరిగేనా

 

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.