శుక్రవారం, ఫిబ్రవరి 28, 2014

ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి...

ఆసక్తికరమైన కథా కథనాలతో తొంబైలో వచ్చిన ఒక మంచి సినిమా ఆత్మబంధం. కలకాలంతోడుంటాడని ప్రాణంగా ప్రేమించి పెళ్ళిచేసుకున్న తన భర్త ఒక యాక్సిడెంట్ లో తనని వీడివెళ్ళిపోయాడనే దిగులుతో ఉన్న ఆమెకి అతను ఆత్మరూపంలో తనచుట్టూనే ఉండి కాపాడుకుంటున్నాడని తెలిసిన క్షణంలో నమ్మలేని ఆ నిజాన్ని ఒట్టి ఊహకాదని ఒట్టేసి చెప్పవా అంటూ భర్తనే అడిగే సంధర్బంలోని ఈ పాట చాలా అందంగా ఉంటుంది. మీరూ ఆస్వాదించండి. యూట్యూబ్ పనిచేయని వారు ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : ఆత్మబంధం (1990)  
సంగీతం  : కీరవాణి 
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర 

ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టి ఊహ కాదని ఈ కొత్త పూల గాలి
నమ్మలేక పోతున్నా కమ్మనీ నిజాన్ని
బొట్టు పెట్టి పిలవగానె స్వర్గం దిగి వచ్చిందని

ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టి ఊహ కాదని ఈ కొత్త పూల గాలి
నమ్మలేక పోతున్నా కమ్మనీ నిజాన్ని
బొట్టు పెట్టి పిలవగానె స్వర్గం దిగి వచ్చిందని

ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి

ఒకేసారి కలలన్నీ వెలేసాయి కన్నుల్నీ
అమావాశ్య కొలువై మోయమంటూ రేయినీ
సుదూరాల తారల్ని సుధా శాంతి కాంతుల్నీ
వలలు వేసి తెచ్చా కంటి కొనలో నింపనీ
చెదరని చెలిమి కి సాక్ష్యమా
హృదయము తెలుపగ సాధ్యమా
మాయని మమతల దీపమా 
ఉదయపు తళుకులు చూపుమా
నా జాబిలి నీవేనని

ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి

ల ల ల ల ల లా
ల ల ల ల ల లా
ల ల ల ల ల లా
ల ల ల ల ల లా

తుదే లేని కధ కాని గతం కాని స్వప్నాన్ని
ఇదే కౌగిలింతై కాలమంతా ఉండనీ
నువ్వే వున్న కన్నులతో మరే వంక చూడననీ
రెప్ప వెనక నిన్నే ఎల్లకాలం దాచనీ
యుగములు కలిగిన కాలమా 
ఈ ఒక గడియను వదులుమా
చరితలు కలిగిన లోకమా 
ఈ జత జోలికి రాకుమా
స్వప్నం చిగురించిందని

ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టి ఊహ కాదని ఈ కొత్త పూల గాలి
నమ్మలేక పోతున్నా కమ్మనీ నిజాన్ని
బొట్టు పెట్టి పిలవగానె స్వర్గం దిగి వచ్చిందని

ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి
ఒట్టేసి చెప్పవా ఇంకొక్కసారి 
ఇంకొక్కసారి
ఇంకొక్కసారి

గురువారం, ఫిబ్రవరి 27, 2014

కానరార కైలాస నివాస/గంగావతరణం

కైలాసానికేగి ఈశ్వరదర్శనాన్ని కోరుతూ రావణ బ్రహ్మ పాడిన ఈ పాట చాలా ప్రసన్నంగా బాగుంటుంది. ఇంతగా వేడుకున్ననూ శివుడు ప్రత్యక్షం కాకపోగా కావలి ఉన్న నంది హేళనగా నవ్వేసరికి కోపమోచ్చిన రావణాసురుడు కైలాసగిరినే పెకలించి తీసుకువెళ్ళే ప్రయత్నంలో పాడే శివతాండవ స్తోత్రం వీడియో ఇక్కడ చూడవచ్చు. రావణబ్రహ్మగా ఎన్టీఆర్ మొదట ఎంత ప్రసన్నంగా కనిపిస్తారో తరువాత అంత రౌద్రాన్నీ అవలీలగా పోషించారు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే రాగాలో ఇక్కడ వినవచ్చు. 
మిత్రులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.
 


చిత్రం : సీతారామకళ్యాణం (1961)
సంగీతం : గాలి పెంచల నర్సింహారావు
సాహిత్యం : సముద్రాల సీనియుర్
గానం : ఘంటసాల

కానరార కైలాస నివాస
బాలేందు ధరా జటాధరాహర
కానరార కైలాస నివాస
బాలేందు ధరా జటాధరా కానరార

భక్తజాల పరిపాల దయాళ
భక్తజాల పరిపాల దయాళ
హిమశైలసుతా ప్రేమలోలా

కానరార కైలాస నివాస
బాలేందు ధరా జటాధరా కానరార

నిన్నుజూడ మది కోరితిరా... ఆ...
నిన్నుజూడ మది కోరితిరా
నీ సన్నిధానమున చేరితిరా
నిన్నుజూడ మది కోరితిరా
నీ సన్నిధానమున చేరితిరా

కన్నడ సేయక కన్నులు చల్లగ
మన్నన సేయరా గిరిజా రమణా

కానరార కైలాస నివాస
బాలేందు ధరా జటాధరా కానరార

సర్ప భూషితాంగ కందర్పదర్పభంగా
సర్ప భూషితాంగ కందర్పదర్పభంగా
భవపాశనాశ పార్వతీ మనోహర
హే మహేశ వ్యోమకేశ త్రిపురహర

కానరార కైలాస నివాస
బాలేందు ధరా జటాధరా కానరార 

~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌

బగీరధుని తపస్సుకు మెచ్చిన గంగ తాను దివినుండి భువికి దిగిరావడానికి సిద్దమే కానీ తననుభరించే నాథుడెవరు అని అడిగితే, ఆ భగీరధుడు గంగ ఉరవడిని కట్టడి చేయగలవాడు సాక్షత్తూ ఆ పరమశివుడేనని ఎంచి ఈశ్వరుని ఎలా వేడుకున్నాడో ఆ గంగావతరణమెలా జరిగిందో ఈ శివరాత్రి పర్వదినాన మరో సారి వీక్షించండి. ఈ క్లిప్ బాపు గారి దర్శకత్వంలో వచ్చిన సీతాకళ్యాణం సినిమాలోనిది, సినిమాటోగ్రఫీ రవికాంత్ నగాయచ్.


చిత్రం : సీతా కల్యాణం (1976)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : సినారె
గానం : పి. బి. శ్రీనివాస్, బాలు, రామకృష్ణ, సుశీల

ఇనవంశ జలజాత దినకరుడు
సత్యనిరతుడు ధర్మవ్రతుడు భగీరథుడు
తన ముత్తాతల తరింప చేయగా...
గగన గంగనే జగతికి దించగా...
తపమొనరించెను ఆనాడు..
అదియే నదియై నడిచెను ఈనాడు...ఊ..ఊ..

మెచ్చితిని తపమో భగిరథా...
నిశ్చలనిరంతర మనోరథా...
ఇచ్చెదను వరము దిగి వచ్చెదను ధరకు..
మరి నను భరించే నాథుడెవ్వడు...
నను భరించే నాథుడెవ్వడు...

ప్రభో శూలపాణే విభో విశ్వనాథా..
మహాదేవ శంభో మహేశా త్రినేత్రా...
శివా కాంతశాంతస్మరారే పురారే...
పదన్యోవరేణ్యోనమాణ్యోనగన్యః

గళమున గరళము ధరించినావే...
తలపై గంగను భరించలేవా..
భవా....శివా...శివా...

కదిలింది కదిలింది గంగ...
కదిలి ఉప్పొంగింది గంగ ...
పరమ రాజసభావ పరిచుంబితనితాంగ
కదిలింది కదిలింది గంగ ...
కదిలి ఉప్పొంగింది గంగ ...

ఆకాశమే అదరగా... ఐరావతం బెదరగా
నందనవనం ప్రిదులగా... బృందారకులు చెదరగా

సాగింది సాగింది గంగ.. సాగి చెలరేగింది గంగ...
ఊగింది ఊగింది గంగ.. ఉద్వేగాభినేకాంతరంగ..
హరుని శిరమున పోటులెత్తగా.. బ్రహ్మాండభాండము బీటలెత్తగా...

ఉల్లల గంగా మహోర్ణికా వీచికా...
కల్లోల ధాటి ఒక కంట వీక్షించి..
సురగంగ గర్వంబు విరువంగ నెంచి ...
సంకీర్ణ చెటు ఝటాఝటలనుప్పొంగించి...
దుర్గంబుగా మలచినాడు...
గంగనద్భుతముగా బంధించినాడు ...

వెడయను అడవిని వడివడి అడుగిడి జాడ ఎరుంగనిదై ..
తడబడి నడచుచు గడగడ వడకుచు సుడివడిపోయినదై ...
ఒకపరి ఇటుచని ఒకపరి అటుచని మొఖమే చెల్లనిదై...
అగుపించని ఆ గగన గంగకై.. ఆక్రందించే భగీరథుడు...
ఆ మొర విని సురభిని చెర విడిపించెను కరుణాభరణుడు పురహరుడు...

ఉరికింది ఉరికింది గంగా..ఉన్మొత్త మానసవిహంగా..
మున్ముందుగా భగీరథుడు నడువంగా...
తన మేన సరికొత్త తరగలుప్పొంగ..
ఉరికింది ఉరికింది గంగా...

జలజలా పారుతూ... గలగల సాగుతూ..
చెంగుమని దూకుతూ... చెలరేగి ఆడుతూ...
తుళ్ళుతూ.. తూలుతూ... నిక్కుతూ.. నీల్గుచూ...
ముంచి వేసెను జహ్నుముని ఆశ్రమమునూ...
కనలి ఆ ముని మ్రింగే గంగాధరమునూ...

తరలింది తరలింది గంగా... సాగరుల పాపములు కడుగంగా..
సద్గతులనూ వారికొసగంగా... అల భగీరథునిచే ఇల పైన నిలుపంగా
తాను భాగీరథిగా... పుణ్యమొసగే నదిగా... తరలింది తరలింది గంగా...
గంగావతరణం

బుధవారం, ఫిబ్రవరి 26, 2014

అందెను నేడే అందని జాబిల్లి

తోడు అనేది అందని జాబిలిగా ఎంచి ఎదురు చూస్తున్న ఆమె దిగులును పటాపంచలు చేస్తూ తను కోరిన చెలుడు తన చెంతకు చేరాడట. ఆ ఆనందంలో ఇన్నేళ్ళకు వసంతములు విరిశాయిట, మల్లెలూ నవ్వాయిట ఇంకా ఆతని స్పర్శ తనలో గిలిగింతల పులకింతలు రేపాయిట. తనతోడు తనకి దొరికిందని ఇకపై కన్నీటి ముత్యాలు రాలవు, తోటలో పూవులూ వాడవు అంటూ నమ్మకంగా ఈమె చెప్తున్న ప్రేమ కబురు దాశరధి గారి మాటలలో విందామా. సాలూరు వారి సరళమైన సంగీతం ఈ పాటని కలకాలం గుర్తుంచుకునేలా చేస్తుంది. చిత్రీకరణ కూడా చాలా బాగుంటుంది, ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.

చిత్రం : ఆత్మగౌరవం(1965)
సంగీతం : సాలూరు రాజేశ్వరరావు 
సాహిత్యం : దాశరధి
గానం : సుశీల

 మ్.హుహుహు..ఓహోహొహోహోహో..
ఓహొహొహో ఆఅహాహాహహా
ఓహొహొహో ఆఅహాహాహహా


అందెను నేడే అందని జాబిల్లి
నా అందాలన్ని ఆతని వెన్నెలలే
అందెను నేడే అందని జాబిల్లి


ఇన్నేళ్ళకు విరిసె వసంతములు
ఇన్నాళ్ళకు నవ్వెను మల్లియలు
నిదురించిన ఆశలు చిగురించెలే
నిదురించిన ఆశలు చిగురించెలే
చెలికాడే నాలో తలపులు రేపెనులే 

అందెను నేడే అందని జాబిల్లి

నా చెక్కిలి మెల్లగ మీటగనే
నరనరముల వీణలు మ్రోగినవి
గిలిగింతల నా మేను పులకించెలే
గిలిగింతల నా మేను పులకించెలే
నెలరాజే నాతో సరసములాడెనులే 

అందెను నేడే అందని జాబిల్లి
 
ఇక రాలవు కన్నుల ముత్యములు
ఇక వాడవు తోటల కుసుమములు
వినువీధిని నా మది విహరించెలే
వినువీధిని నా మది విహరించెలే
వలరాజే నాలో వలపులు చిలికెనులే

అందెను నేడే అందని జాబిల్లి
నా అందాలన్ని ఆతని వెన్నెలలే
నా అందాలన్ని ఆతని వెన్నెలలే

మంగళవారం, ఫిబ్రవరి 25, 2014

సంగీతం మధుర సంగీతం..

ఈ సినిమా గురించి మంచి మాటలు చాలా సార్లు విన్నాను కానీ పూర్తిగా చూసే ఆవకాశం ఎపుడూ దొరకలేదు. "కృష్ణవేణి తెలుగింటి విరిబోణి" పాటతో పాటు ఈ సినిమాలో నాకు ఇష్టమైన మరో పాట "ఈ సంగీతం మధుర సంగీతం" పాట, ఈ సంగీత దర్శకుడు విజయభాస్కర్ గారు చేసినవే తక్కువ సినిమాలో లేక హిట్ అయినవి కొన్నో తెలియవు కానీ సంగీత దర్శకునిగా చాలా అరుదుగా వినిపించే పేరు కానీ ఉన్నవాటిలో మంచి పాటలు ఉన్నాయి. ఈ చక్కని పాటను మీరూ ఆస్వాదించండి, ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే చిమటాలో ఇక్కడ వినండి లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోండి.చిత్రం : కృష్ణవేణి (1974) 
సంగీతం : విజయభాస్కర్
సాహిత్యం : ఆరుద్ర 
గానం : పి.సుశీల 

సంగీతం మధుర సంగీతం
సంగీతం మధుర సంగీతం
తల్లీ పిల్లల హృదయ సంకేతం
సంగీతం మధుర సంగీతం


ముద్దుల కూనల తీయని పిలుపే తల్లికి కోకిల గానం 
లలలా లలలా లలలలా... లలలా లలలా లలలలా
ఆహహహా.. ఆహహహా.. మ్.హుహుహుహూ..
ముద్దుల కూనల తీయని పిలుపే తల్లికి కోకిల గానం
మదిలో మమతలే మంజుల రవళిగ మ్రోగును మోహనరాగం
సంగీతం మధుర సంగీతం
బాలపాపల ఆటల పాటలె అమ్మకు కమ్మని గీతం
ఆకాశవీధుల సాగే గువ్వలు తెచ్చే ప్రేమ సందేశం

సంగీతం మధుర సంగీతం
తల్లీ పిల్లల హృదయ సంకేతం
సంగీతం మధుర సంగీతం


ఎన్నోనోముల పంటలుపండి ముచ్చట గొలుపు సంతానం
లలలా లలలా లలలలా.. లలలా లలలా లలలలా
ఆహహహా.. ఆహహహా.. మ్.హుహుహుహూ..
ఎన్నోనోముల పంటలుపండి ముచ్చట గొలుపు సంతానం
ఆశాఫలముల రాశులు ఎదలో చేసెను రాగ సంచారం
సంగీతం మధుర సంగీతం
శోభన జీవన దీపావళిలో పెరిగెను పావనతేజం
తనివే తీరా తనయుల చేర తల్లికి తరగని భాగ్యం

సంగీతం మధుర సంగీతం
తల్లీ పిల్లల హృదయ సంకేతం
సంగీతం మధుర సంగీతం

సోమవారం, ఫిబ్రవరి 24, 2014

తుమ్మెదా ఓ తుమ్మెదా

నాకు నచ్చిన మరో మాంచి కన్నయ్య పాట, ఊహూ కన్నయ్య పాట అనే కాదులెండి మాంచి రొమాంటిక్ పాట కూడా అనుకోవచ్చేమో డాన్సులు కాస్త పక్కన పెట్టేస్తే సిరివెన్నెల గారి సాహిత్యం మహదేవన్ గారి సంగీతాలను చాలా బాగా ఎంజాయ్ చేయచ్చు. ఇక పాటలో అచ్చతెలుగు పరికిణీలలో గౌతమి, భానుప్రియల గురించి చెప్పనే అక్కర్లేదనుకోండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : శ్రీనివాస కల్యాణం(1987) 
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : సిరివెన్నెల సీతరామ శాస్త్రి 
గానం : బాలు, సుశీల 

తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా 
తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా 
 మగడు లేని వేళ తుమ్మెదా.. వచ్చి మొగమాట పెడతాడె తుమ్మెదా
మాట వరసకంటు తుమ్మెదా పచ్చి మోట సరసమాడె తుమ్మెదా
అత్త ఎదురుగానే తుమ్మెదా రెచ్చి హత్తుకోబోయాడె తుమ్మెదా
తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా

 
ఎదురు పడితె కదలనీక దడికడతాడే
పొద చాటుకి పద పదమని సొద పెడతాడే 

 ఎదురు పడితె కదలనీక దడికడతాడే
పొద చాటుకి పద పదమని సొద పెడతాడే
 
ఒప్పనంటె వదలడమ్మా ముప్పు తప్పదంటె బెదరడమ్మా
ఒప్పనంటె వదలడమ్మా ముప్పు తప్పదంటె బెదరడమ్మా

చుట్టు పక్కలేమాత్రం చూడని ఆత్రం 
పట్టు విడుపు లేనిదమ్మ కృష్ణుని పంతం

మగడు లేని వేళ తుమ్మెదా.. వచ్చి మొగమాట పెడతాడె తుమ్మెదా
మాట వరసకంటు తుమ్మెదా పచ్చి మోట సరసమాడె తుమ్మెదా
అత్త ఎదురుగానే తుమ్మెదా రెచ్చి హత్తుకోబోయాడె తుమ్మెదా
తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా 

తుమ్మెదా తుమ్మెదా

తానమాడు వేళ తాను దిగబడతాడే
మాను మాటు చేసి చుడ ఎగబడతాడే 

 తానమాడు వేళ తాను దిగబడతాడే
మాను మాటు చేసి చుడ ఎగబడతాడే 

చెప్పుకుంటె సిగ్గు చేటు అబ్బ నిప్పులాంటి చూపు కాటు 
 చెప్పుకుంటె సిగ్గు చేటు అబ్బ నిప్పులాంటి చూపు కాటు  
ఆదమరిచి ఉన్నామా కోకలు మాయం 
ఆనక ఎమనుకున్నా రాదే సాయం

మగడు లేని వేళ తుమ్మెదా.. వచ్చి మొగమాట పెడతాడె తుమ్మెదా
మాట వరసకంటు తుమ్మెదా పచ్చి మోట సరసమాడె తుమ్మెదా
అత్త ఎదురుగానే తుమ్మెదా రెచ్చి హత్తుకోబోయాడె తుమ్మెదా
తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా

 
తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెదా

ఆదివారం, ఫిబ్రవరి 23, 2014

కలనైనా క్షణమైనా...

ఈ పాటలో బాలు గొంతు ఎంత బాగుంటుందో నాకు చాలా ఇష్టం. తను ఎన్టీఆర్ ఏఏన్నార్ లాంటి పెద్ద హీరోలకి కాకుండా చంద్రమోహన్ లాంటి వారికి పాడేటప్పుడు స్వచ్చంగా స్వేచ్చగా పాడతారనిపిస్తుంటుంది నాకు బహుశా అందుకేనేమో ఈ పాటలలో మరింత బాగుంటుంది. ఇక సినారే గారి పదాల ఎంపిక సింపుల్ అండ్ స్వీట్ అనిపించే పాటలలో ఇదీ ఒకటి... మీరూ ఆస్వాదించండి, ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : రాధాకళ్యాణం (1981)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల


ఊహూహూ..ఆఆఆఅ..లలలలలాఅ..ఆఅఅ 

ఊఊహుహూ...ఆఆఆఆఆఆ
కలనైనా క్షణమైనా మాయనిదే
మన ప్రేమా.. మన ప్రేమా
కలకాలం కావ్యంలా నిలిచేదే
మన ప్రేమా.. మన ప్రేమా
 
కలనైనా క్షణమైనా...ఆఆఅ.ఆఆఅ.. 

 నీ కళ్ళల్లో తొంగి చూడనిదే
నిదురేది ఆ రేయి నా కళ్ళకు
నీ కళ్ళల్లో తొంగి చూడనిదే
నిదురేది ఆ రేయి నా కళ్ళకు
నీ పాట మనసారా పాడనిదే
నిలకడ ఏదీ నా మనసుకూ
నీ పాట మనసారా పాడనిదే
నిలకడ ఏదీ నా మనసుకూ

ఊపిరిలో.. ఊపిరిలా.. ఒదిగేదే.. మన ప్రేమా

కలనైనా క్షణమైనా..ఆఆఅ..ఆఆఆ..

నా చెంపకు ఎంతటి ఉబలాటమో
నీ చెంపతో చెలగాటమాడాలని
నా చెంపకు ఎంతటి ఉబలాటమో
నీ చెంపతో చెలగాటమాడాలని
నా పెదవికి ఎంతటి ఆరాటమో
నీ పెదవిపై శుభలేఖ రాయాలని
నా పెదవికి ఎంతటి ఆరాటమో
నీ పెదవిపై శుభలేఖ రాయాలని
కౌగిలిలో.. ఊహూ.. కౌగిలిలా.. ఊఊ... 
కరిగేదే.. మన ప్రేమా

కలనైనా క్షణమైనా మాయనిదే
మన ప్రేమా మన ప్రేమా
కలకాలం కావ్యంలా నిలిచేదే
మన ప్రేమా మన ప్రేమా
 
 
కలనైనా క్షణమైనా...ఆఆఅ.ఆఆఅ.. 
 

శనివారం, ఫిబ్రవరి 22, 2014

దిక్కులు చూడకు రామయ్యా

రేడియోలో విన్న పాటలలో ఇది కూడా ఒకటి. పాటలంటే బాలు గారి గొంతో ఘంటసాల గారి గొంతో తప్ప మిగిలిన గొంతులు ఏవీ పెద్దగా వినపడని ఆ రోజుల్లో మరో కొత్త గొంతు ఏది వినపడినా కొంచెం రిఫ్రెషింగ్ గా అనిపించి చెవులు రిక్కించి వినేటైమ్ లో ఈ జి.ఆనంద్ గారి పాటలు కూడా ప్రత్యేకంగా అనిపించేవి. మీరూ ఆస్వాదించండి, ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.చిత్రం : కల్పన (1977)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి 
గానం : సుశీల, జి.ఆనంద్

ఓఓ.ఓ..ఓ.ఓఓ..
దిక్కులు చూడకు రామయ్యా.. 
పక్కనే ఉన్నది సీతమ్మా
దిక్కులు చూడకు రామయ్యా.. 

పక్కనే ఉన్నది సీతమ్మా..సీతమ్మా..

సిరిమల్లె నవ్వుల సీతమ్మా.. 

ముందుకు రావే ముద్దుల గుమ్మ
సిరిమల్లె నవ్వుల సీతమ్మా... 

ముందుకు రావే ముద్దుల గుమ్మ...ముద్దులగుమ్మా

ఎదనే దాచుకుంటావో... నా ఎదనే దాగిఉంటావో..ఓ...
ఎదనే దాచుకుంటావో... నా ఎదనే దాగిఉంటావో..ఓ...
కదలికలన్నీ కథలుగ అల్లి 

కవితలే రాసుకుంటావో..రామయ్యా..
పొన్నలు పూచిన నవ్వు... 

సిరివెన్నెల దోచి నాకివ్వు.
పొన్నలు పూచిన నవ్వు... 

సిరివెన్నెల దోచి నాకివ్వు.
ఆ వెన్నెలలో... నీ కన్నులలో... 

ఆ వెన్నెలలో..నీ కన్నులలో..
సన్నజాజులే రువ్వు.. కను సన్నజాజులే రువ్వు.. 

సన్నజాజులే రువ్వు..కను సన్నజాజులే రువ్వు.. 
సీతమ్మా..సీతమ్మా 

దిక్కులు చూడకు రామయ్య
పక్కనే ఉన్నది సీతమ్మా..సీతమ్మా..
సిరిమల్లె నవ్వుల సీతమ్మా.. 

ముందుకు రావే ముద్దుల గుమ్మ ముద్దులగుమ్మా

కలలో మేలుకుంటావో.. నా కళలే ఏలుకుంటావో..
కలలో మేలుకుంటావో.. నా కళలే ఏలుకుంటావో..
కలలిక మాని కలయికలో..

నా కనులలో చూసుకుంటావో.. రామయ్యా
వెల్లువలైనది సొగసు.. తొలివేకూవ నీ మనసు..
వెల్లువలైనది సొగసు.. తొలివేకూవ నీ మనసు..
ఆ వెల్లువలో... నా పల్లవిలో.. 

ఆ వెల్లువలో.. నా పల్లవిలో..
రాగమే పలికించు.. అనురాగమై పులకించు..

రాగమే పలికించు.. అనురాగమై పులకించు..
సీతమ్మా..సీతమ్మా.. 
 
దిక్కులు చూడకు రామయ్య
పక్కనే ఉన్నది సీతమ్మా..సీతమ్మా..
సిరిమల్లె నవ్వుల సీతమ్మా.. 

ముందుకు రావే ముద్దుల గుమ్మ ముద్దులగుమ్మా..
 

శుక్రవారం, ఫిబ్రవరి 21, 2014

తొలిచూపు ఒక పరిచయం

టీవీలు రాకముందు నేను రేడియోలో విన్న మరిచిపోలేని పాటలలో ఇదీ ఒకటి. సాలూరు వారు, రాజన్-నాగేంద్ర, రమేష్ నాయుడు గార్ల పాటలు రేడియోలో వింటూ పెరగడం నాకు కలిగిన అదృష్టాలలో ఒకటి. ఈ పాటలలోని సంగీత సాహిత్యాల గొప్పదనం ఒక ఎత్తైతే ఈ పాటలు విన్నపుడల్లా నా మనసు ఆనాటి మధుర జ్ఞాపకాలలోకి పరుగులు తీయడం ఈ పాటలు నేనింతగా ఇష్టపడడానికి మరో కారణం. ఈ చక్కని పాట మీరూ విని చూసీ ఆస్వాదించండి..  ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.చిత్రం : అద్దాలమేడ(1981)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : దాసరి నారాయణరావు.
గానం : బాలు, సుశీల

తొలిచూపు ఒక పరిచయం..మలిచూపు ఒక అనుభవం
ఈ చూపుల ఊసులలో..ఆ కన్నుల కలయికలో
జరిగే తతంగం..అనురాగపు తొలి రంగం

తొలిచూపు ఒక పరిచయం..మలిచూపు ఒక అనుభవం
ఈ చూపుల ఊసులలో..ఆ కన్నుల కలయికలో
జరిగే తతంగం..అనురాగపు తొలి రంగం

తొలిచూపు ఒక పరిచయం..మలిచూపు ఒక అనుభవం

ఒక పూవు పూచిన చోట..ఆ పూవు నవ్విన చోట
ఒక పూవు పూచిన చోట..ఆ పూవు నవ్విన చోట
వెలిసింది దేవాలయం..అదే ప్రేమాలయం
ఒక రాగం పిలిచిన చోట..అనురాగం పలికిన చోటా
వెలిసింది రాగాలయం..అదే ప్రేమాలయం అదే ప్రేమాలయం

తొలిచూపు ఒక పరిచయం..మలిచూపు ఒక అనుభవం
ఈ చూపుల ఊసులలో..ఆ కన్నుల కలయికలో
జరిగే తతంగం..అనురాగపు తొలి రంగం
తొలిచూపు ఒక పరిచయం..మలిచూపు ఒక అనుభవం

ఆ ఆ ఆ ఆహ్హా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ
లలలలా లలలా లాలా..ఆ ఆ ఆ
మలిసంధ్య ముగిసిన చోట..జాబిల్లి విరిసిన చోట
మలిసంధ్య ముగిసిన చోట..జాబిల్లి విరిసిన చోట
వెలిసింది హృదయాలయం..అదే ప్రేమాలయం
ఆకాశం వంగిన చోట..భూదేవిని తాకిన చోట
వెలిసింది ఒక ఆలయం..అదే ప్రేమాలయం అదే ప్రేమాలయం

తొలిచూపు ఒక పరిచయం..మలిచూపు ఒక అనుభవం
ఈ చూపుల ఊసులలో..ఆ కన్నుల కలయికలో
జరిగే తతంగం..అనురాగపు తొలి రంగం
తొలిచూపు ఒక పరిచయం..మలిచూపు ఒక అనుభవం
ల్లాలల్లా లాలాలలా..మ్మ్ మ్మ్ హు..లాలలా లలలాల
మలిసంధ్య ముగిసిన చోట..జాబిల్లి విరిసిన చోట

గురువారం, ఫిబ్రవరి 20, 2014

డ్రీమ్ గర్ల్..

సిరివెన్నెల అంటే క్లాసికల్ పాటలనే కాదు ఇలాంటి అల్లరి పాటలను సైతం తెలుగు ఇంగ్లీష్ కలిపి కూడా అందంగా రాయగలరు ఆకట్టుకోగలరు అని నిరూపించిన పాట. కృష్ణవంశీ మొదటి మాజిక్ "గులాబి" నుండి. శశిప్రీతమ్ అప్పట్లో గొప్ప యూత్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతాడని మాకాలేజ్ లో అందరం ఫిక్స్ అయిపోయాం కానీ ఎందుకో ఎక్కువ అవకాశాలు రాలేదు. ఎపుడు విన్నా నా కాలేజ్ రోజులని గుర్తు చేసే ఈ పాటని మీరూ విని ఎంజాయ్ చేయండి. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినండి.చిత్రం : గులాబి(1996)
సంగీతం : శశి ప్రీతం
సాహిత్యం : సిరివెన్నెల
గానం : సుచిత్రాక్రిష్ణమూర్తి, సురేష్ పీటర్స్ 

మాధురీని మరిపించె సుస్మితాను ఓడించె 
అందమైన అమ్మాయిరోయ్
రమ్యకృష్ణ రూపాన్ని చిత్ర లోని రాగాన్ని 
కలుపుకున్న పాపాయి రోయ్
ఎవ్వరురా ఆ చిన్నది.. ఎక్కడ రా దాగున్నది..
ఎప్పుడు రా.. ఎటు నుంచి దిగుతుంది

డ్రీమ్ గర్ల్ ఎదలో ఈల వేసే నైటింగేల్..
డ్రీమ్ గర్ల్ మెడలో మాల వేసే డార్లింగ్ డాల్..

లా..లా..లా..ల..ల..ఆహా..ఆహ.హా.హ.హా..
హెల్లో హనీ వెల్కమ్ అనీ అంటూ నీ వెంట ఉన్నానని
కల్లోన నువు లేవని గిల్లేసి చూపించని
వెంటాడినా వేధించినా నీ చెంత చేరాలని
నమ్మాలి నా మాటనీ తగ్గించు అల్లర్లనీ

డ్రీమ్ గర్ల్ గుండెల్లో మోగే టెంపుల్ బెల్..
డ్రీమ్ గర్ల్ దిగి రా నీలి నింగి ట్వింకిల్ స్టార్

ఊహూ..హు.హు.హు..తూరూ.రూ.రూ.రూ..
ఆటాడినా మాటాడినా ఆలోచనంత తానేనని
చెప్పేది ఎల్లాగని చేరేది యే దారినీ
యెటు పోయినా ఎం చేసినా నా నీడలాగ అడుగడుగుని
చూస్తున్న ఆ కళ్ళని చూసేది యే నాడనీ

డ్రీమ్ గర్ల్
కొంగు చాటు గులాబి ముళ్ళు నాటు హనీబి
ఎక్కడుందొ ఆ బేబీ
కొంటె ఊసులాడింది హార్టు బీటు పెంచింది 
ఎమిటంట దాని హాబీ..

వాట్ ఈజ్ దిస్...వంకాయ్ పుల్స్
నో అడ్రస్.. మిస్ యూనివర్స్.. మెంటల్ కేస్..
అంతెలేర బాసు.. మే గాడ్ బ్లెస్ యూ..

డ్రీమ్ గర్ల్ ఎదలో ఈల వేసే నైటింగేల్..
డ్రీమ్ గర్ల్ దిగి రా నీలి నింగి ట్వింకిల్ స్టార్

డ్రీమ్ గర్ల్ నిన్నే తలచుకొంటే నిద్దర నిల్..
డ్రీమ్ గర్ల్ మనసే తడిసిపోయే వాటర్ ఫాల్..
డ్రీమ్ గర్ల్ త్వరగా చేరుకోవే మై డార్లింగ్..
డ్రీమ్ గర్ల్ ఇంకా ఎంతకాలం ఈ వెయిటింగ్..
డ్రీమ్ గర్ల్...డ్రీమ్ గర్ల్...డ్రీమ్ గర్ల్..
హేయ్.. మై డ్రీమ్ గర్ల్
డ్రీమ్ గర్ల్
 

బుధవారం, ఫిబ్రవరి 19, 2014

తప్పట్లోయ్ తాళాలోయ్..

ముద్దుగారే యశోదా ముంగిట ముత్యము నువ్వూ
విశ్వనాథ్ గారి లేటెస్ట్ సినిమా శుభప్రదంలో ఈ పాట చాలా బాగుంటుంది, శివకేశవులు ఒకటేనంటూ పోలికలు చూపే ప్రయత్నం చేసిన చరణం కానీ పల్లవిలోని వాక్యాలు కానీ చక్కని సాహిత్యం, ఈ సినిమాలో పాటలన్నీ కూడా ఒకప్పటి విశ్వనాథ్ సినిమాలతో పోల్చలేకపోయినా ఈకాలం స్టాండర్డ్స్ కి చక్కని సంగీత సాహిత్యాల మేళవింపే. రౌతుకొద్దీ గుర్రమనే సామెత మోటుగా ఉన్నా దర్శకుడిని బట్టే పాటల రచయిత ప్రతిభ అని ఈపాటతో మరోసారి రుజువైంది. సేమ్యా ఉప్మా చైనీస్ నూడుల్స్ అంటూ పాటలు రాసిన రామజోగయ్య శాస్త్రిగారితో విశ్వనాథ్ గారు ఎంతచక్కని పాట రాయించుకున్నారో మీరే చూడండి. ఈ అందమైన పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.చిత్రం : శుభప్రదం(2010)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : చైత్ర, ఫిమేల్ కోరస్, మేల్ కోరస్

తైతారే.. తక్క.. తైతారే..
దిగుతక తైతారే తైతారే దిగుతకతై..
తైతారే.. తక్క.. తైతారే..
దిగుతక తైతారే తైతారే తకతకతారే..

తప్పట్లోయ్ తాళాలోయ్ 
అచ్చట్లోయ్ ముచ్చట్లోయ్
ప్రతిలోగిలి ముంగిట్లో 
సిరిమువ్వల కిట్టయ్య మెరుపుల మిరుమిట్లో
అట కురిసిన వెన్నెట్లో 
విరబూసిన గుండెల గలగల పదిరెట్లోయ్
నలుదిక్కుల చీకటినంతా 
తన మేనిలొ దాచిన వింతా
కడువిందుగా వెలుగులు 
చిందెను మా కన్నుల్లో
ఆనంద ముకుందుని చేతా 
ఆంతర్యము అణువణువంతా
మధునందనమాయెను 
తన్మయ తారంగంలో..ఓఓ..

తప్పట్లోయ్ తాళాలోయ్ 
అచ్చట్లోయ్ ముచ్చట్లోయ్
తప్పట్లోయ్ తాళాలోయ్ 
అచ్చట్లోయ్ ముచ్చట్లోయ్

స్వాగతం కృష్ణా శరణాగతమ్ కృష్ణా 
మధురాపురి సదనా 
మృదువదనా మధుసూదనా...

తలపైనా కన్నున్న ముక్కంటి తానేగా 
శివమూర్తి శిఖిపించ మౌళీ
ప్రాణాలు వెలిగించు ప్రాణవార్ధమేగా 
తన మోవి మురళీస్వరాళి
భవుని మేని ధూళీ 
తలపించదా వనమధూళీ
ప్రమాధగణ విరాగీ 
యదుకాంతులకు ప్రియవిరాళీ
ఝనన ఝనన పదయుగళమె 
జతపడి శివకేశవా భేదకేళీ

తప్పట్లోయ్ తాళాలోయ్ 
అచ్చట్లోయ్ ముచ్చట్లోయ్

హొయ్యారే తయ్యర తయ్ 
తయ్యర తయ్.. హోయ్..హోయ్..
తయ్యారే తయ్యర తయ్ 
తయ్యర తయ్.. హోయ్..హోయ్..

ముద్దుగారే యశోదా 
ముంగిట ముత్యము నేను
ముద్దుగోరే రాధమ్మ 
సందిట చెంగల్వ పూదండ నేను
చెలిమికోరే ..ఏ.ఎ.ఎ.ఏఏ.. 
చెలిమికోరే గోపెమ్మలా 
చేతవెన్నముద్ద నేను
నన్ను కోరే ఎవ్వరికైనా 
బంధుగోవిందుడనౌతానూ  
ముద్దుగారే యశోదా 
ముంగిట ముత్యము నువ్వూ
ముద్దుగోరే రాధమ్మ 
సందిట చెంగల్వ పూదండ నువ్వూ

తప్పట్లోయ్ తాళాలోయ్ 
అచ్చట్లోయ్ ముచ్చట్లోయ్
ప్రతిలోగిలి ముంగిట్లో 
సిరిమువ్వల కిట్టయ్య మెరుపుల మిరుమిట్లో
అట కురిసిన వెన్నెట్లో 
విరబూసిన గుండెల గలగల పదిరెట్లోయ్. 
ముద్దుగోరే రాధమ్మ సందిట చెంగల్వ పూదండ నువ్వూ

మంగళవారం, ఫిబ్రవరి 18, 2014

నీతో ఏదో అందామనిపిస్తుంది

కృష్ణవంశీ సిరివెన్నెల కాంబినేషన్ లో సాయికార్తీక్ సంగీత దర్శకత్వంలో ఇటీవలే వచ్చిన మరో మంచి మెలోడి ఇది, సిరివెన్నెల తనమాజిక్ చూపించేస్తే కృష్ణవంశీ తన ఓల్డ్ స్టైల్లో చిత్రించిన చిత్రీకరణ సైతం ఆకట్టుకుంటుంది. ఎంబెడ్ చేసిన యూట్యూబ్ వీడియో ఒక నిముషం ప్రోమోషనల్ వీడియో మాత్రమే. యూట్యూబ్ లో ఫోటోలు ప్లస్ పూర్తిపాట ఆడియోతో చేసిన ప్రజంటేషన్ ఇక్కడ చూడవచ్చు లేదా ఆడియో మాత్రమే రాగాలో ఇక్కడ వినవచ్చు.చిత్రం : పైసా (2013)
సంగీతం : సాయి కార్తీక్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : శ్వేత మోహన్, సాయి కార్తీక్
 
హీరోసే..మయ్యా సయ్యారే
హరె మోరేసా
హీరోసే మయ్యా సయ్యారే... 


హో... హో.... ఓ... ఓ...
నీతో ఏదో అందామనిపిస్తోంది...
ఎపుడూ నీతో ఉండాలనిపిస్తోంది...
నా పుట్టుక నీతో మొదలైంది...
నీతోనే పూర్తయిపోతోంది...
ఇంకెలా చెప్పనూ మాటల్లో వివరించి
నీకెలా చూపనూ నా మనసింతకు మించి
 
నీతో ఏదో అందామనిపిస్తోంది...
ఎపుడూ నీతో ఉండాలనిపిస్తోంది...

హీరోసే మయ్యా సయ్యారే
హరె మోరేసా
హీరోసే మయ్యా సయ్యారే...
సరిగమపనిసా..
నిసా నిసా నిసా నిసా నిసగారిసా నిసా నిసనిపమగరి
సరిగమపనిసా..
నిసా నిసా నిసా నిసా నిసగారిసా నిసా నిసనిపమగరి 

 
కంటికి నువు కనిపిస్తే ఉదయం అయ్యిందంట
ఇంటికిపో అంటే సాయంత్రం అనుకుంటా..
నువు నను పిలిచేటపుడే నా పేరుని గుర్తిస్తా
నీవైపుకి కదిలే అడుగుల్నే నడకంటా
ఏమౌతావు నువ్వు అంటే ఏమో తెలియదు గాని
ఏమి కావు అంటే లోలో ఏదో నొప్పిగ ఉంటుందే
 

హీరోసే మయ్యా సయ్యారే
హరె మోరేసా
హీరోసే మయ్యా సయ్యారే... 

తెలియని దిగులౌతుంటే నిను తలచే గుండెల్లో
తియ తియ్యగ అనిపిస్తోందే ఆ గుబులూ
ముచ్చెమటలు పోస్తుంటే వెచ్చని నీ ఊహల్లో
మల్లెలు పూస్తునట్టొళ్ళంతా ఘుమఘుమలూ
బతకడమంటే ఏమిటంటే సరిగా తెలియదు గాని
నువ్విలాగ నవ్వుతుంటే చూస్తూ ఉండడమనుకోని
 
హీరోసే మయ్యా సయ్యారే
హరె మోరేసా
హీరోసే మయ్యా సయ్యారే...

నీతో ఏదో అందామనిపిస్తోంది...
ఎపుడూ నీతో ఉండాలనిపిస్తోంది.

సోమవారం, ఫిబ్రవరి 17, 2014

ఉయ్యాలైనా జంపాలైనా

కొత్త దర్శకులనుండీ కొత్త సంగీత దర్శకులనుండి మంచి పాటలు ఆశించడం ఎపుడో మానేసిన నాకు ఇటీవల విడుదలైన ఉయ్యాల జంపాల లోని ఈపాట బాగా నచ్చింది, సీతారాములని మళ్ళీ మనలా పుట్టించాడు అని అనుకోవడం ఆ తర్వాత సాహిత్యంలో వాసు వలభోజు ఉపయోగించిన చక్కని తెలుగు చూస్తే ఈ టీమ్ నుండి మరిన్ని మంచి పాటలు ఆశించవచ్చునేమో అనిపించింది, సన్నీ మ్యూజిక్ కూడా చాలా సూతింగ్ గా ఉంది. ఈపాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. అలాగే ఎంబెడ్ చేసిన వీడియో ముప్పై సెకన్ల ప్రోమో మాత్రమే పూర్తిపాట లిరిక్స్ తో యూట్యూబ్ లో ఇక్కడ వినవచ్చు.చిత్రం : ఉయ్యాలా జంపాలా (2013)
సంగీతం : సన్నీ M.R
రచన : వాసు వలబోజు
గానం : హర్షిక గుడి, అనుదీప్ దేవ్

ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమనీ
మళ్లీ మనలా పుట్టించాడు సీతారాములనీ
ఇదోరకం స్వయంవరం అనేట్టుగా ఇలా
నీ చూపులే నాపై పడే ఓ పూలమాలలా
హరివిల్లు దారాల బంగారు ఉయ్యాల
వెన్నెల్లొ ఊగాలిలా
ఒహో... నీవేగ నాలో నా గుండెలో శ్రుతీ లయ
ఒహో... నీవేగ నాకు నా ఊహలో సఖీ ప్రియా

తక్ ధినధీమ్.. తక్ ధినధీమ్.. 
తక్ ధినధీమ్.. తక్ ధినధీమ్.. తక్..
టడడం..టడం.టడం..టం..
టడడం..టడం.టడం..టం..
టడడం..టడం.టడం.టడం.టడం.టడం...
టడడం..టడం.టడం..టం..
టడడం..టడం.టడం..టం..
టడడం..టడం.టడం.టడం.టడం.టడం...
తక్ ధినధీమ్.. తక్ ధినధీమ్.. తక్.. 

చెయ్యే చాస్తే అందేటంతా దగ్గర్లో ఉంది
చందమామ నీలామారి నా పక్కనుంది
నీకోసం నాకోసం ఇవ్వాళే ఇలా
గుమ్మంలో కొచ్చింది ఉగాదే కదా
ఒక్కోక్షణం పోతేపోనీ పోయేదేముంది
కాలాన్నిలా ఆపే బలం ఇద్దర్లో ఉంది
రేపంటూ మాపంటూ లేనేలేని
లోకంలో ఇద్దరినే ఊహించని

ఎటువైపు చూస్తున్న 
నీరూపు కనిపించి చిరునవ్వు నవ్వే ఎలా
ఎదురైతే రాలేను ఎటువైపు పోలేను నీ పక్కకొచ్చేదెలా
ఒహో... నా జానకల్లే ఉండాలిగా నువ్వే ఇలా
ఒహో... వనవాసమైన నీ జంటలో సుఖం కదా 

ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమనీ
మళ్లీ మనలా పుట్టించాడు సీతారాములనీ

నా పాదమే పదే పదే నీ వైపుకే పడే
జోలాలి పాట ఈడునే పడింది ఈ ముడే
ఒహో... ఎన్నాళ్లగానో నా కళ్లలో కనే కల
ఒహో... ఈ ఇంద్రజాలం నీదేనయా మహాశయా

గుండెకే చిల్లే పడేలా జింకలా నువ్వే గెంతాలా
ఇద్దరం చెరో సగం సగం సగం సగం
ఎందుకో ఏమో ఈవేళా నేనే సొంతం అయ్యేలా
నువ్వు నా చెంతేచేరి చేయి నిజం కొంచెం

ఆదివారం, ఫిబ్రవరి 16, 2014

వేవేలా వర్ణాలా

కొన్నేళ్ళ క్రితం ఓసారి ఈ పాట వింటూ టైప్ చేసుకున్నపుడు నేను రాసుకున్న మాటలు "ఈ మధ్య కాలం లో ఇంత ఆస్వాదిస్తూ రాసుకున్న పాట లేదు... ఆ తన్మయత్వం లో సిరివెన్నెల గారిని ఏమని పొగడాలో కూడా తెలియడం లేదు..." నేటికీ ఈ పాట వింటున్నపుడు నాలో అవే ఫీలింగ్స్... ఈ సినిమాలోని ప్రతిపాట నాకు చాలా ఇష్టమైనా ఈ పాట మరింత ఎక్కువ ఇష్టం. సిరివెన్నెల, ఇళయరాజా, బాలు, గీతాకృష్ణలు కలిసి చేసిన మాజిక్ మీరూ చూసి విని ఆనందించండి. ఆడియోమాత్రం కావాలంటే ఇక్కడ వినవచ్చు.చిత్రం : సంకీర్తన
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలూ, కౌసల్య(సీనియర్ లీడ్ కోరస్ సింగర్)

ఆ..ఆ..ఆ..అ..అ..ఆ..
ఆ..ఆ..ఆ..అ..అ..ఆ..
ఆ..ఆ..ఆ..అ..అ..ఆ..
వేవేలా వర్ణాలా...ఈ నేలా కావ్యాలా...
అలలూ శిలలూ తెలిపే కధలూ...
పలికే నాలో గీతాలై...

వేవేలా వర్ణాలా... ఈ నేలా కావ్యాలా...

ఓ గంగమ్మో పొద్దెక్కి పోతాంది తొరగా రాయే...
ఓ...తల్లీ గోదారి తుళ్ళి తుళ్ళి పారేటి
పల్లె పల్లె పచ్చాని పందిరీ...పల్లె పల్లె పచ్చాని పందిరీ...
నిండూ నూరేళ్ళు పండు ముత్తైదువల్లె వుండు
పంటా లచ్చిమి సందడీ...పంట పంటా లచ్చిమి సందడీ...
తందైన..తందతైన..తందైన..తందతైన..
తందైన..తందతయ్యనా.. తయ్య..తందైన..తందతయ్యనా..

వాన వేలి తోటీ నేల వీణ మీటే...
నీలి నింగి పాటే.. ఈ చేలటా...
కాళిదాసు లాటి.. తోట రాసుకున్న..
కమ్మనైన కవితలే ఈ పూలటా...
ప్రతి కదలికలో నాట్యమె కాదా..
ప్రతి ఋతువూ ఒక చిత్రమె కాదా..
ఎదకే కనులుంటే....

వే వేలా వర్ణాలా...ఈ నేలా కావ్యాలా...
అలలూ శిలలూ తెలిపే కధలూ...
పలికే నాలో గీతా లై...
వే వేలా వర్ణాలా...ఈ నేలా కావ్యాలా...
లాలలా...ఆ అ ఆ...
లాలలా...ఆ అ ఆ...
కాళిదాసు లాటి.. తోట రాసుకున్న.. కమ్మనైన కవితలే ఈ పూలటా..


కోరస్ పాడిన గాయణీమణి గురించి పాడుతాతీయగా లో బాలుగారు చెప్పారంటూ శ్రమతో లింక్ వెతికి ఇచ్చిన మిత్రులు నెమలికన్నుమురళి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. 

శనివారం, ఫిబ్రవరి 15, 2014

ముద్దుల జానకి పెళ్ళికి

నిన్నటిదాకా ప్రేమ గీతాలలో ఓలలాడాముగా ఇక తర్వాతేముంటుంది పెళ్ళే మరి :-) పెద్దరికం సినిమాలోని ఈ పెళ్ళిపాట నాకు చాలా ఇష్టం. నిజానికి దీనిని పెళ్ళి ఏర్పాట్ల పాట అని చెప్పాలేమో, చిత్రీకరణ చాలా బాగుంటుంది అచ్చ తెలుగమ్మాయిగా సుకన్య తనకు బామ్మగారిగా భానుమతి గారు కూడా బాగుంటారు. ఈ చక్కని పాట మీరూ చూసి విని ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.చిత్రం : పెద్దరికం (1992)
సంగీతం : రాజ్-కోటి
సాహిత్యం : భువనచంద్ర, వడ్డేపల్లి కృష్ణ
గానం : చిత్ర, కోరస్

ఓఓఓఓ..ఓఓ..ఓఓఓఓ....
ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే
ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే
ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలెనే
ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలెనే

మురిపాల తేలించ మునిమాపులో
దివినుండి రేరాజు దిగివచ్చులే
ఆ ఆ ఆ ఆ....
ఆ ఆ ఆ ఆ....

ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే
ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలెనే

తొలకరిలా వలపంతా కురిసెనులే 
తీయని ఊహలు చిగురు తొడిగెను

నింగిని తాకే పందిరి వేసీ
పచ్చని పల్లెను పీటగజేసీ
నింగిని తాకే పందిరి వేసీ
పచ్చని పల్లెను పీటగజేసి
బంగారు రంగులు వేయించరారే
మురిపాల పెళ్ళి జరిపించరారే

వధువు సొగసంత మెరిసే
వలపు మదిలోన విరిసే
చిలిపి కోరికలు కురిసే
పడుచు పరువాలు బిగిసే
కనివిని ఎరుగని కమ్మని భావన కధలుగ కనిపించే
ఆ ఆ ఆ ఆ....
ఆ ఆ ఆ ఆ....

ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే
ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలెనే

తూరుపు ఎరుపై మనసులు పాడే
గోదావరిలా మమతలు పొంగే
తూరుపు ఎరుపై మనసులు పాడే
గోదావరిలా మమతలు పొంగే
రాయంచలన్నీ రాగాలు తీసే
చిలకమ్మలెన్నో చిత్రాలు చేసే

కదలి రావమ్మ నేడే
కలలు పండేటి వేళా
వేచియున్నాడు వరుడే
సందె సరసాల తేలా
సరసపు వయసున 
ఒంపుల సొంపుల సరిగమ వినిపించే

ఆ ఆ ఆ ఆ...
ఆ ఆ ఆ ఆ...
ఆ ఆ ఆ ఆ...
 

శుక్రవారం, ఫిబ్రవరి 14, 2014

ప్రేమికుల రోజు శుభాకాంక్షలు ...

ప్రేమికుల రోజు శుభాకాంక్షలు...
గత నెలరోజులుగా బోలెడు ప్రేమ గీతాలని చూస్తూ వింటూ రోజంతా ప్రేమమయం చేసుకుంటూ ఆనందంగా గడిపాము కదా మరి ఈ రోజు ప్రేమికులరోజు సంధర్బంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు :-) ఈ ప్రత్యేకమైన రోజు తెలుగు సినీ ప్రపంచంలో మూడు తరాలకు చెందిన మూడు ప్రేమ పాటలను మీతో పంచుకుందామని తీసుకు వచ్చేశాను. 

సంతానం సినిమా కోసం ఘంటసాల గారు పాడిన ఈ "చల్లని వెన్నెలలో" పాట చాలా బాగుంటుంది, ముఖ్యంగా ప్రారంభంలో వచ్చే ఆలాపన వింటూంటే నిజ్జంగా చల్లని వెన్నెలలో తిరుగుతున్న అనుభూతిని ఇస్తుంది, సుసర్ల దక్షిణామూర్తి గారి స్వరసారధ్యంలో వచ్చిన ఈ అందమైన పాటను మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.చిత్రం : సంతానం (1955)
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి 
సాహిత్యం : అనిశెట్టి 
గానం : ఘంటసాల 

ఆఆఅ..ఆఆ..ఆఆఆఆఆ...ఆఆఆఆ
చల్లని వెన్నెలలో... చల్లని వెన్నెలలో..ఓఓఓ..
చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో
చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో
అందమె నాలో లీనమాయెనే...
ఆనందమె నా గానమాయెనే... 
చల్లని వెన్నెలలో... 

తెలి మబ్బుల కౌగిలిలో జాబిలి తేలియాడెనే ముద్దులలో
తెలి మబ్బుల కౌగిలిలో జాబిలి తేలియాడెనే ముద్దులలో
గాలిపెదవులే మెల్లగ సోకిన
గాలిపెదవులే మెల్లగ సోకిన 
పూలు నవ్వెనే నిద్దురలో..హో..ఓఓ..

చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో
అందమె నాలో లీనమాయెనే...
ఆనందమె నా గానమాయెనే... 
చల్లని వెన్నెలలో...

కళకళలాడే కన్నె వదనమే కనిపించును ఆ తారలలో ఓఓ..ఓఓ..
కళకళలాడే కన్నె వదనమే కనిపించును ఆ తారలలో
కలకాలము నీ కమ్మని రూపము
కలకాలము నీ కమ్మని రూపము..
కలవరింతులే నా మదిలో..ఓఓ..ఓఓ.

చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో
అందమె నాలో లీనమాయెనే...
ఆనందమె నా గానమాయెనే... 
చల్లని వెన్నెలలో...

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ప్రేమపాటలను చిత్రీకరించడంలో కృష్ణవంశీది ఒక ప్రత్యేకమైన శైలి అలాంటిది ఆ పాటకు సిరివెన్నెల గారి సాహిత్యం తోడైతే ఆ పాట చూస్తూ వింటూ తన కలల రాకుమారిని/రాకుమారుడిని తలచుకోని వ్యక్తి ఉండరనుకోవడంలో అతిశయోక్తి లేదేమో. నిన్నేపెళ్ళాడతా సినిమా లో టాబు,నాగర్జున నటించిన ఈ చక్కని ప్రేమ గీతాన్ని మీరూ చూసి/విని ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : నిన్నే పెళ్ళాడుతా (1996)
సంగీతం : సందీప్ చౌతా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : సంజీవ్, సుజాత

కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే
ఆ ఊసుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే

కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే


మది దాచుకున్నా రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదేలా  

నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా
గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగటం 

కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే 

 అదిరేటి పెదవుల్ని బతిమాలుతున్నాను మదిలోని మాటేదని
తల వంచుకొని నేను తెగ ఎదురు చూశాను నీ తెగువ చూడాలనీ
చూస్తూనే రేయంతా తెలవారిపోతుందో ఏమో ఎలా ఆపటం 

కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే 
ఆ ఊసుని తెలిపేందుకు నా భాష ఈ మౌనం  
 కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే 


గౌతమ్ మీనన్ ప్రేమకథా చిత్రాలు చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి ఈకాలం ప్రేమలను ఇతనంతబాగా ఎవరూ అర్ధంచేస్కోలేరేమో అనిపిస్తుంటుంది పైగా దర్శకుడికన్నా ముందు అతనో సినిమాటోగ్రాఫర్ అవడం వలనో ఏమో తన చిత్రాలన్నీ చూడ్డానికి కావ్యాల్లా కనిపిస్తాయి నాకు. సూర్యా సన్ ఆఫ్ కృష్ణన్ లో సూర్య మేఘనా కి ప్రపోజ్ చేసే ఈ సీన్ నాకు చాలా ఇష్టం దానివెంటనే వచ్చే ఈ పాట కూడా నా మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ లో ఒకటి. హారీస్ మ్యూజిక్ వేటూరి గారి సాహిత్యం ఈపాటని మర్చిపోనివ్వవు. చిత్రీకరణ కూడా బాగుంటుంది సమీరా కూడా అందంగా ఉంటుందనమాట అని అనిపించే చిత్రీకరణ గౌతమ్ కే సాధ్యం :-) ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : సూర్య s/o కృష్ణన్ (2008)
సంగీతం : హరీస్ జయరాజ్
సాహిత్యం : వేటూరి 
గానం : హరీష్ రాఘవేంద్ర, దేవన్, V. ప్రసన్న 

నాలోనే పొంగెను నర్మదా..
నీళ్ళల్లో మురిసిన తామరా..
అంతట్లో మారెను ఋతువులా పిల్లా నీవల్లా  
నీతో పొంగే వెల్లువా నీళ్ళల్లో ఈదిన తారకా
బంగారు పూవుల కానుకా… పేరేలే కాంచనా 
ఓ శాంతీ శాంతి ఓ శాంతి
నా ప్రాణం సర్వం నీవేలే
నా శ్వాసే నీవే దోచావే
చెలి నేనే నీవు అయ్యావే.. 

నాలోనే పొంగెను నర్మదా..
నీళ్ళల్లో మురిసిన తామరా..
అంతట్లో మారెను ఋతువులా పిల్లా నీవల్లా
  

ఆఅహ్హ్హా... హ్హ్.హ్.హ్.ఆ..

 ఏదో ఒకటి నన్ను కలచి.. ముక్కు చివర మర్మమొకటి
కల్లాకపటం కరిగిపోయి ముసినవ్వా బోగన్ విల్లా..
నువ్వు నిలిచిన చోటేదో వెలయెంత పలికేను
నువ్వు నడిచే బాటంతా మంచల్లే అయ్యేను!
నాతోటి రా.. ఇంటి వరకు
నా ఇల్లే చూసి నన్ను మెచ్చు
ఈమె ఎవరో ఎవరొ తెలియకనే
ఆ వెనెకే నీడై పోవద్దే
ఇది కలయో నిజమో ఏం మాయో
నా మనసే నీకు వశమాయే.. వశమాయే.. 

నాలోనే పొంగెను నర్మదా..
నీళ్ళల్లో మురిసిన తామరా..
అంతట్లో మారెను ఋతువులా పిల్లా నీవల్లా..ఓఓ.. 
నీతో పొంగే వెల్లువా నీళ్ళల్లో ఈదిన తారకా
బంగారు పూవుల కానుకా… పేరేలే కాంచనా
 

కంటి నిద్రే దోచుకెళ్ళావ్ ఆశలన్నీ చల్లి వెళ్ళావ్
నిన్ను దాటి పోతూవుంటే వీచే గాలీ దిశలు మారు
ఆగంటూ నీవంటే నా కాళ్ళే ఆగేనే
నీ తలలో పూలన్నీ వసివాడవ ఏనాడు
కౌగిలింతే కోరలేదు
కోరితే కౌగిలి కాదు
నా జీవన సర్వం నీతోనే..
నను తలచే నిముషం ఇదియేనే
నువ్వు లేవు లేవు అనకుంటే నా హృదయం తట్టుకోలేదే.. ఏఏ..

నాలోనే పొంగెను నర్మదా..
నీళ్ళల్లో మురిసిన తామరా..
అంతట్లో మారెను ఋతువులా పిల్లా నీవల్లా
  
నీతో పొంగే వెల్లువా నీళ్ళల్లో ఈదిన తారకా
బంగారు పూవుల కానుకా… పేరేలే కాంచనా
  

ఓ శాంతీ శాంతి ఓ శాంతి
నా ప్రాణం సర్వం నీవేలే
నా శ్వాసే నీవే దోచావే
చెలి నేనే నీవు అయ్యావే..
 
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.