Painting by Rajdev |
పెళ్ళిపుస్తకం సినిమా ఇప్పటికి ఎన్ని సార్లు చూసి ఉంటానో ఇంకా ముందు ముందు ఎన్నిసార్లు చూడబోతానో లెక్కేలేదు. నా టీనేజ్ చివరిదశలో చూశానేమో మనసులో అలా ముద్రించుకు పోయింది. బుడుగు తప్ప ముళ్ళపూడి వారి సాహిత్యం గురించి పెద్దగా పరిచయంలేని సమయంలో బాపురమణలిద్దరినీ దేవుళ్ళుగా ఆరాధించవచ్చు అని అనిపించిన సినిమా. ఇందులో ఇల్లు, పెరడు, ఆ మొక్కల మధ్య అరుగు నాకు ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను.
కొత్త దంపతులకి ఇవ్వగలిగిన అపురూపమైన బహుమతులలో ఒకటిగా శాశ్వతమైన స్థానాన్ని సంపాదించిన సినిమా. ఈ సినిమా విడుదలయ్యాక ఇందులోని "శ్రీరస్తూ శుభమస్తూ" అన్న పాట నేపధ్యంగా వాడని పెళ్ళి వీడియో ఆంధ్రాలో లేదనడం అతిశయోక్తి కాదు. ఇందులోని "సరికొత్త చీర" పాట దానికి ముందు సన్నివేశంలో హీరో పెళ్ళి గురించి చెప్పే మాటలు నాకు చాలా ఇష్టం. మీరూ ఆస్వాదించండి. పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
"అమ్ముకుట్టీ.. నీకు కోపం వచ్చింది కన్నీళ్ళు కదిలాయ్.. నాకు గర్వంగా ఉంది, ఇంత గట్టి పెళ్ళాం దొరికినందుకు. ఇంత మంచి ఫ్రెండ్ ని కాదని నేను మరో పిల్లకేసి చూసినా... ఒకవేళ చూస్తే నవ్వితే షేక్ హ్యాండిస్తే.. అది నా ఉద్యోగ ధర్మం అని నీకు తెలియదా.. గుండెల్లో గూడు కట్టుకున్న ప్రేమనీ చీటికీ మాటికి పైకి చెప్పుకుంటామా..
అమ్ముకుట్టీ.. పెళ్ళంటే పాలల్లో పాలలా కలిసిపోవడం పంచదారలా కరిగిపోవడం పెళ్ళంటే నమ్మకం, ఆ నమ్మకం తిరుగులేనిది.. అదీ దీపం లాంటిది దానిమీద అనుమానపు నీడలు పడవు... అనుమానం ఉన్నచోట నారాయణ అన్నా బూతులా వినిపిస్తుంది నమ్మకం ఉన్న చోట బూతుకూడా నారాయణ అన్నట్లే వినిపిస్తుంది..."
--ముళ్ళపూడి వెంకట రమణ.
చిత్రం : పెళ్ళిపుస్తకం (1991)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : బాలు
సరికొత్త చీర ఊహించినాను
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : బాలు
సరికొత్త చీర ఊహించినాను
సరదాల సరిగంచు నేయించినాను
మనసూ మమత పడుగూ పేక
మనసూ మమత పడుగూ పేక
చీరలో చిత్రించినాను
ఇది ఎన్నో కలల కలనేత
ఇది ఎన్నో కలల కలనేత
నా వన్నెలరాశికి సిరిజోత...
నా వన్నెలరాశికి సిరిజోత...
ముచ్చటగొలిపే మొగలిపొత్తుకు
నా వన్నెలరాశికి సిరిజోత...
ముచ్చటగొలిపే మొగలిపొత్తుకు
ముల్లూ వాసన ఒక అందం
అభిమానం గల ఆడపిల్లకు
అభిమానం గల ఆడపిల్లకు
అలకా కులుకూ ఒక అందం
ఈ అందాలన్నీ కలబోశా...
ఈ అందాలన్నీ కలబోశా...
నీ కొంగుకు చెంగున ముడివేస్తా
ఈ అందాలన్నీ కలబోశా...
ఈ అందాలన్నీ కలబోశా...
నీ కొంగుకు చెంగున ముడివేస్తా
ఇది ఎన్నో కలల కలనేత
ఇది ఎన్నో కలల కలనేత
నా వన్నెలరాశికి సిరిజోత...
నా వన్నెలరాశికి సిరిజోత
చురచుర చూపులూ ఒకమారు
నా వన్నెలరాశికి సిరిజోత
చురచుర చూపులూ ఒకమారు
నీ చిరుచిరు నవ్వులూ ఒకమారు
మూతివిరుపులూ ఒకమారు
మూతివిరుపులూ ఒకమారు
నువు ముద్దుకు సిద్ధం ఒకమారు
నువు ఏ కళనున్నా మాబాగే
నువు ఏ కళనున్నా మాబాగే
ఈ చీర విశేషం అల్లాగే
నువు ఏ కళనున్నా మాబాగే
నువు ఏ కళనున్నా మాబాగే
ఈ చీర విశేషం అల్లాగే
సరికొత్త చీర ఊహించినాను
సరదాల సరిగంచు నేయించినాను
మనసూ మమత పడుగూ పేక
మనసూ మమత పడుగూ పేక
చీరలో చిత్రించినాను
ఇది ఎన్నో కలల కలనేత
ఇది ఎన్నో కలల కలనేత
నా వన్నెలరాశికి సిరిజోత...
హ...నా.. వన్నెలరాశికీ.. సిరిజో..త...
హ...నా.. వన్నెలరాశికీ.. సిరిజో..త...
5 comments:
మంచి మంచి పాటలు గుర్తుచేస్తున్నారు.
చక్కటి పాటతో పాటుగా ముళ్ళపూడి వెంకట రమణ గారి చక్కటి మాటలు బోనస్ గా ఉంది వేణు గారు.
థాంక్స్ ఎ లాట్ జ్యోతిర్మయి గారు, జయగారు :-)
పెళ్ళైన పదేళ్ళ తరువాత కూడా భార్యని ఇలానే ప్రేమించగలిగితే, ఆమె అందాన్ని ఆస్వాదించ గలిగితే, యెంతో బావుంటుంది..
వెల్ సెడ్ శాంతి గారు, థాంక్స్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.