కాస్త విషాద ఛాయలు కనిపించినా కూడా ఇళయరాజాగారు కంపోజ్ చేసిన ఈ అందమైన మెలోడీ నాకు చాలా ఇష్టమైన ప్రేమ గీతాలలో ఒకటి. మీరూ ఆస్వాదించండి ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి.
చిత్రం : ఆరాధన (1987)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు, జానకి
తీగనై మల్లెలు పూచినా వేళ
ఆగనా అల్లనా పూజకో మాల
మనసు తెర తీసినా మోమాటమేనా
మమత కలబోసినా మాట కరువేనా
తీగనై మల్లెలు పూచినా వేళ
ఆగనా అల్లనా పూజకో మాల
తెలిసీ తెలియందా ఇది తెలియక జరిగిందా
ఎపుడో జరిగిందా అది ఇపుడే తెలిసిందా
ఆశపడ్డా అందుతుందా అర్హతైనా ఉందా
అందుకున్నా పొందికుందా పొత్తు కుదిరేదా
ప్రేమకన్నా పాశముందా పెంచుకుంటే దోషముందా
తెంచుకుంటే తీరుతుందా పంచుకుంటే మరిచేదా
కలలో మెదిలిందా ఇది కథలో చదివిందా
మెరుపై మెరిసిందా అది వలపై కురిసిందా
రాసి ఉంటే తప్పుతుందా తప్పు నీదవునా
మారమంటే మారుతుందా మాసిపోతుందా
చేసుకున్నా పుణ్యముందా చేరుకునే దారి ఉందా
చేదుకునే చేయి ఉందా చేయి చేయి కలిసేనా
తీగనై మల్లెలు పూచినా వేళ
ఆగనా అల్లనా పూజకో మాల
మనసు తెర తీసినా మోమాటమేనా
మమత కలబోసినా మాట కరువేనా
తీగనై మల్లెలు పూచినా వేళ
ఆగనా అల్లనా పూజకో మాల
7 comments:
ఈ మూవీలో "అరె ఏమైందీ.." కన్నా ఈ పాట నాకు చాలా ఇష్టమండీ..
అచ్చుతప్పులు లేకుండా ఎంత చక్కగా రాస్తున్నారు వేణూ...
Chala ishtamaina pata Chala rojula taruvata chusanu ..thanks venu garu :-)Radhika (nani)
హార్ట్ టచింగ్ సాంగ్..ఈ పాటకి మీరు వేసిన పిక్ చాలా యాప్ట్ గా వుంది వేణూజీ..చాలా, చాలా బాగుంది..
థాంక్స్ తృష్ణ గారు, నాక్కూడా ఫస్ట్ ఛాయిస్ ఇదేనండి :-)
థాంక్స్ జ్యోతిర్మయి గారు, సాధ్యమైనంత వరకూ తప్పులు లేకుండా చూడ్డానికి ప్రయత్నిస్తున్నానండీ.. అప్పటికీ అపుడపుడు వస్తూనే ఉన్నాయి :-)
థాంక్స్ రాధిక గారు :-)
థాంక్స్ శాంతి గారు పిక్ నచ్చినందుకు సంతోషం :-)
ఈ సినిమాలో వేటూరి గారు రాయలేదండీ.... ఆత్రేయ, సిరివెన్నెల రాశారు. ఈ పాట ఆత్రేయ గారిది
థ్యాంక్స్ విద్యాసాగర్ గారూ సరిచేశానండీ.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.