ప్రేమలో పడిన కుర్రాడి అవస్థని ఇంతకన్నా బాగా చెప్పగల పాటెక్కడ ఉంది చెప్పండి... పవన్ కళ్యాణ్ కి అప్పటి యూత్ ఫ్యామిలీ ఆడియెన్స్ మొత్తం కనెక్ట్ అయి వీరాభిమానులైపోయేలా చేసిన సినిమా "తొలిప్రేమ" లోని ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఒకటి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ అన్ లైన్ లో లేదా ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని వినవచ్చు.
చిత్రం : తొలిప్రేమ (1998)
సంగీతం : దేవా
సాహిత్యం : భువనచంద్ర
గానం : కృష్ణరాజ్
ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా
ఒళ్ళు తోమలా పౌడర్ పుయ్యలా
అరె ఇంతలోనే ఎంత డేంజరైపోయరా
ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా
కళ్ళు తెరుచుకుంటే కలలాయె అవి మూసుకుంటే ఎద వినదాయె
సరికొత్త ఊపు వచ్చి మనసు నిలవదాయే
తారురోడ్డే స్టారు హోటలాయె మంచినీళ్ళే ఓల్డ్ మాంకు రమ్మాయే
కారు హెడ్ లైట్సే కన్నె కొంటె చూపులాయే
పువ్వే నవ్వై హొయలొలికించేస్తుంటే గుండే గువ్వై అరె దూసుకుపోతుంటే
లైఫ్ అంతా కైపేలే సోదరా
క్లాసు బుక్స్ యమ బోరాయె న్యూ తాట్సు డే అండ్ నైటు విడవాయే
నిముషాలె యుగములై నిద్దర కరువాయే
క్లోజు ఫ్రెండ్సు కనపడరాయె పేరెంట్సు మాట వినపడదాయె
పచ్చనోట్సు కూడ పేపర్ బోట్సైపోయాయే
ఏమవుతుందో కనుగొంటే ఒక వింత.. కాలం చాచే కౌగిట్లో గిలిగింత
డూ యు నో వాట్ ఈజ్ దిస్ నేస్తమా
ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా
ఒళ్ళు తోమలా పౌడరు పుయ్యలా
అరె ఇంతలోనే ఎంత డేంజరైపోయరా
2 comments:
సునొ లక్కీ ఆలి..ప్యార్ కా ముసాఫిర్' ట్యూన్ ఇది..బట్ యాక్ట్ చేసినది పవన్ కల్యాణ్ కావడం వల్లేమో, సాంగ్ కి కొత్త అందం వఛ్ఛింది..
థాంక్స్ శాంతి గారు.. ప్యార్ కా ముసాఫిర్ పల్లవి మాత్రమే తీసుకున్నట్లు అనిపిస్తుందండీ.. మరి రాగతాళాలేమైనా సేమ్ అయితే కనుక దేవ గారు చాలా బాగా మార్చేశారు అనుకోవాలి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.