మంగళవారం, ఫిబ్రవరి 18, 2014

నీతో ఏదో అందామనిపిస్తుంది

కృష్ణవంశీ సిరివెన్నెల కాంబినేషన్ లో సాయికార్తీక్ సంగీత దర్శకత్వంలో ఇటీవలే వచ్చిన మరో మంచి మెలోడి ఇది, సిరివెన్నెల తనమాజిక్ చూపించేస్తే కృష్ణవంశీ తన ఓల్డ్ స్టైల్లో చిత్రించిన చిత్రీకరణ సైతం ఆకట్టుకుంటుంది. ఎంబెడ్ చేసిన యూట్యూబ్ వీడియో ఒక నిముషం ప్రోమోషనల్ వీడియో మాత్రమే. యూట్యూబ్ లో ఫోటోలు ప్లస్ పూర్తిపాట ఆడియోతో చేసిన ప్రజంటేషన్ ఇక్కడ చూడవచ్చు లేదా ఆడియో మాత్రమే రాగాలో ఇక్కడ వినవచ్చు.



చిత్రం : పైసా (2013)
సంగీతం : సాయి కార్తీక్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : శ్వేత మోహన్, సాయి కార్తీక్
 
హీరోసే..మయ్యా సయ్యారే
హరె మోరేసా
హీరోసే మయ్యా సయ్యారే... 


హో... హో.... ఓ... ఓ...
నీతో ఏదో అందామనిపిస్తోంది...
ఎపుడూ నీతో ఉండాలనిపిస్తోంది...
నా పుట్టుక నీతో మొదలైంది...
నీతోనే పూర్తయిపోతోంది...
ఇంకెలా చెప్పనూ మాటల్లో వివరించి
నీకెలా చూపనూ నా మనసింతకు మించి
 
నీతో ఏదో అందామనిపిస్తోంది...
ఎపుడూ నీతో ఉండాలనిపిస్తోంది...

హీరోసే మయ్యా సయ్యారే
హరె మోరేసా
హీరోసే మయ్యా సయ్యారే...
సరిగమపనిసా..
నిసా నిసా నిసా నిసా నిసగారిసా నిసా నిసనిపమగరి
సరిగమపనిసా..
నిసా నిసా నిసా నిసా నిసగారిసా నిసా నిసనిపమగరి 

 
కంటికి నువు కనిపిస్తే ఉదయం అయ్యిందంట
ఇంటికిపో అంటే సాయంత్రం అనుకుంటా..
నువు నను పిలిచేటపుడే నా పేరుని గుర్తిస్తా
నీవైపుకి కదిలే అడుగుల్నే నడకంటా
ఏమౌతావు నువ్వు అంటే ఏమో తెలియదు గాని
ఏమి కావు అంటే లోలో ఏదో నొప్పిగ ఉంటుందే
 

హీరోసే మయ్యా సయ్యారే
హరె మోరేసా
హీరోసే మయ్యా సయ్యారే... 

తెలియని దిగులౌతుంటే నిను తలచే గుండెల్లో
తియ తియ్యగ అనిపిస్తోందే ఆ గుబులూ
ముచ్చెమటలు పోస్తుంటే వెచ్చని నీ ఊహల్లో
మల్లెలు పూస్తునట్టొళ్ళంతా ఘుమఘుమలూ
బతకడమంటే ఏమిటంటే సరిగా తెలియదు గాని
నువ్విలాగ నవ్వుతుంటే చూస్తూ ఉండడమనుకోని
 
హీరోసే మయ్యా సయ్యారే
హరె మోరేసా
హీరోసే మయ్యా సయ్యారే...

నీతో ఏదో అందామనిపిస్తోంది...
ఎపుడూ నీతో ఉండాలనిపిస్తోంది.

2 comments:


లిరిక్స్ చాలా బావున్నా, బికాజ్ ఆఫ్ మ్యూజిక్ దీన్ని కృష్ణ వంశీ మార్క్ సాంగ్ అనలేము..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.