బుధవారం, ఫిబ్రవరి 12, 2014

నిన్న ఈ కలవరింత / ఊసులాడే ఒక జాబిలట

నిన్న ఒకప్పటి ప్రేమగీతాలెలా ఉండేవో విన్నారు కదా.. కొన్నేళ్ళు ముందుకు వస్తే డెబ్బై ఎనభైలలో వచ్చిన పాటలు ఈ నెలరోజుల్లోనూ చాలా వినేశాం కనుక తొంభైలలో ప్రేమగీతాలు ఎలా ఉండేవో ఈ రోజు చూద్దాం. ఈ అమ్మాయికి కొత్త కలవరింత ఏదో కలిగిందట దానినే ప్రేమ అని ఎలా గుర్తించిందో మీరే చూడండి. రహమాన్ కెరీర్ మొదట్లో స్వరపరచిన ఈ పద్మవ్యూహం సినిమాలోని అన్ని పాటలు బాగుంటాయి. ప్రేమ గురించి చెప్పే ఈ పాట మరి కొంచెం ఎక్కువ బాగుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : పద్మవ్యూహం (1993)
సంగీతం : ఏ.ఆర్. రెహమాన్
సాహిత్యం : వేటూరి
గానం : హారిక

నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఏదో అంది లే
ఇదియే ప్రేమ అందురా వయసే పులకరించెనా
హృదయం కరిగిపోయెనా ఓ మనసా...
నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఎదో అంది లే
ఇదియే ప్రేమ అందున వయసే పులకరించెనా
హృదయం కరిగిపోయెనా ఓ మనసా...

దైవం ఉందంటినీ అమ్మనెరిగాకనే.. 
కలలు నిజమంటినీ ఆశ కలిగాకనే
ప్రేమనే ఒప్పుకున్నా నిన్ను చూశాకనే
పూచినా పువ్వులా నవ్వులే ఓ దినం.. 
వన్నెలా మెరుపులా ఆయువే ఓ క్షణం
సృష్టి ఉన్నంత దాకా ప్రేమలే శాశ్వతం

నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఏదో అంది లే
ఇదియే ప్రేమ అందురా వయసే పులకరించెనా
హృదయం కరిగిపోయెనా ఓ మనసా
నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఏదో అంది లే

నింగి లేకున్ననూ భూమి ఉంటుందిలే 
మాట లేకున్నను భాష ఉంటుందిలే
ప్రేమయే లేకపోతే జీవితం లేదులే
వాసనే లేకనే పూలు పూయొచ్చులే 
ఆకులే ఆడకా గాలి కదలొచ్చులే
బంధమే లేకపోతే ప్రేమ జన్మించునే

నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఎదో అంది లే
ఇదియే ప్రేమ అందున వయసే పులకరించెనా
హృదయం కరిగిపోయెనా ఓ మనసా 

నిన్న ఈ కలవరింత లేదు లే నేడు చిరుగాలి ఎదో అంది లే
ఇదియే ప్రేమ అందున వయసే పులకరించెనా
హృదయం కరిగిపోయెనా ఓ మనసా... 

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఇక ఈ అబ్బాయి విషయానికి వస్తే బొత్తిగా నెమ్మదస్తుడు, మౌనంగా ప్రేయసిని ఆరాధించడమే తప్ప ఎన్నడూ ఆమెకు కూడా తనమనసులో మాట చెప్పి ఎరుగడు. అలాటిది స్టేజ్ పై పాట పాడవలసిన అవసరం వచ్చింది, అంతలో ఎదురుగా ప్రేయసి సాక్షత్కరించింది ఇకనేం గుండెలో గూడుకట్టుకున్న ప్రేమనంతా పాటగా మార్చి ప్రేయసి మనసునే కాదు స్టూడెంట్స్ అందరి మనసులను గెలుచుకున్నాడు. ఇళయరాజా గారి స్వరకల్పనలో రాజశ్రీ గారు రాసిన ఈ పాట అప్పట్లో కుర్రకారు గుండెల్లో గుబులు రేకెత్తించిన పాట, మీరూ ఆస్వాదించండి. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. చిత్రం: హృదయం (1992)  
 సంగీతం : ఇళయరాజా
 సాహిత్యం :రాజశ్రీ
గానం : బాలు

ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట 

 ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట
చూపులతో బాణమేసెనట
చెలి నా ఎదలో సెగ రేపెనట
మాటే వేదం తానే నాలోకం ప్రేమే యోగం!

ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట
చూపులతో బాణమేసెనట
చెలి నా ఎదలో సెగ రేపెనట


అందాలే చిందే చెలి రూపం నా కోసం
ఆనందం నిలిపేటి ధ్యానం చెలి ధ్యానం
అదే పేరు నేనూ జపించేను రోజూ
ననే చూసే వేళ అలై పొంగుతాను
మౌనం సగమై మోహం సగమై
నేనే నాలో రగిలేను

ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట
చూపులతో బాణమేసెనట
చెలి నా ఎదలో సెగ రేపెనట
మాటే వేదం తానే నాలోకం ప్రేమే యోగం!
 

ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట

చూపులతో బాణమేసెనట
చెలి నా ఎదలో సెగ రేపెనట

 
నాలో నువు రేగే నీ పాట చెలి పాట
నీడల్లే సాగే నీ వెంట తన వెంట
స్వరాలై పొంగేనా వరాలే కోరేనా
ఇలా ఊహల్లోనా సదా ఉండిపోనా
ఒకటై ఆడు ఒకటై పాడు పండగ నాకు ఏనాడో..


ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట
చూపులతో బాణమేసెనట
చెలి నా ఎదలో సెగ రేపెనట
మాటే వేదం తానే నా లోకం ప్రేమే యోగం!


ఊసులాడే ఒక జాబిలట
సిరిమువ్వలుగా నను తాకెనట
చూపులతో బాణమేసెనట
చెలి నా ఎదలో సెగ రేపెనట

అందాలే చిందే చెలి రూపం నా కోసం

4 comments:

Nenu chaduvukune rojullo vacchina movie.class lu eggotti mari vellaam ..i :-)ka e song gurinchaite cheppakkarledu.Radhika(nani .)

అటు అమ్మాయీ,, ఇటు అబ్బాయి ఇద్దరి ఊహలు, ఊసులూ చాలా బావున్నాయి వేణూజీ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.