బుధవారం, ఫిబ్రవరి 05, 2014

వయ్యారి గోదారమ్మ

వంశీ ఇళయరాజా ల మరో మాయాజాలం ప్రేమించు పెళ్ళాడు చిత్రంలోని ఈ "వయ్యారి గోదారమ్మ" పాట, నాకు చాలా ఇష్టమైన పాట.. ఈ పాట ప్రారంభంలో బాలుగారి నవ్వు చాలా బాగుంటుంది. వీడియో కాస్త బెటర్ క్వాలిటీ ఇక్కడ చూడవచ్చు. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : ప్రేమించు పెళ్లాడు (1985)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

వయ్యారి గోదారమ్మ
ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం
కడలి ఒడిలో కలసిపోతే కల వరం
ఇన్ని కలలిక ఎందుకో కన్నె కలయిక కోరుకో
కలవరింతే కౌగిలింతై 
వయ్యారి గోదారమ్మ
ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం

నిజము నా స్వప్నం అహా కలనో ఓహో లేనో ఓహో హో
నీవు నా సత్యం అహా అవునో ఓహో కానో ఓహో హో
ఊహ నీవే ఆహాహాహా.. ఉసురుకారాదా.. ఆహా
మోహమల్లె ఆహాహాహా ముసురుకోరాదా.. ఆహా
నవ్వేటి నక్షత్రాలు మువ్వల్ని ముద్దాడంగ
మువ్వగోపాలుని రాధికా
ఆకాశవీణ గీతాలలోన ఆలాపనై నే కరిగిపోనా 

వయ్యారి గోదారమ్మ
ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం

తాకితే తాపం ఓహో కమలం ఓహో భ్రమరం ఓహో హో
సోకితే మైకం ఓహో అధరం ఓహో మధురం ఓహో హో
ఆటవెలది ఆహాహాహా ఆడుతూరావే హా..ఆఅ
తేటగీతి ఆహాహా...హా.. తేలిపోనీవే హా..ఆ
పున్నాగ కోవెల్లోన పూజారి దోసిళ్ళన్ని యవ్వనాలకు కానుక
చుంబించుకున్న బింభాధరాల
సూర్యోదయాలే పండేటి వేళ

వయ్యారి గోదారమ్మ
ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం

కడలి ఒడిలో కలసిపోతే కల వరం
ఇన్ని కలలిక ఎందుకో కన్నె కలయిక కోరుకో
కలవరింతే కౌగిలింతై 
వయ్యారి గోదారమ్మ
ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం

4 comments:

యెప్పుడూ పాటలూ.. మీ ఫొటోస్ పోటీ పడుతున్నట్టు వుంటాయి వేణూజీ..అలాంటిది ఇంత అందమైన పాటకి..అందులోనూ మా గోదావరి పాటకి ఇలాంటి ఫొటో..

మీ కామెంట్ చూశాక ఫోటో అప్డేట్ చేశాను శాంతి గారు ఇపుడు చెప్పండి ఎలా ఉందో :-) థాంక్స్ ఫర్ యువర్ కాండిడ్ ఫీడ్ బాక్ :-))

చాలా, చాలా..బావుంది..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.