శివశక్తిదత్త లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శివశక్తిదత్త లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శుక్రవారం, ఏప్రిల్ 28, 2017

భళి భళి భళిరా బళి...

ఈ రోజు విడుదలవుతున్న బాహుబలి 2 చిత్రంలోని టైటిల్ సాంగ్ తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ప్రోమో వీడియో ఇక్కడ చూడవచ్చు పూర్తిపాట లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బాహుబలి 2 (2017)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : కె.శివశక్తిదత్తా, కె.రామకృష్ణ
గానం : దలెర్ మెహందీ, కీరవాణి, మౌనిమ

భళి భళి భళిరా బళి సాహోరే బాహుబలి
భళి భళి భళిరా బళి సాహోరే బాహుబలి
జయహారతి నీకే పట్టాలి పట్టాలి
భువనాలన్నీ జై కొట్టాలి గగనాలే ఛత్రం పట్టాలి

హేస్స రుద్రస్స హేసరభద్ర సముద్రస్స
హేస్స రుద్రస్స హేసరభద్ర సముద్రస్స
హేస్స రుద్రస్స హేసరభద్ర సముద్రస్స
హేస్స రుద్రస్స హేసరభద్ర సముద్రస్స

ఆ జనని దీక్ష అచలం ఈ కొడుకే కవచం
ఇప్పుడా అమ్మకి అమ్మవైనందుకా
పులకరించిందిగా ఈ క్షణం
అడవులు గుట్టలు మిట్ట గమించు
పిడికిటి పిడుగుల్ పట్టి మించు
అరికుల వర్గాల్ దుర్గాల్ జయించు
అవనికి స్వర్గాలే దించు
అంత మహా బలుడైనా అమ్మ ఒడి పసివాడే
శివుడైనా భవుడైన అమ్మకి సాటి కాదంటాడే

హేస్స రుద్రస్స హేసరభద్ర సముద్రస్స
హేస్స రుద్రస్స హేసరభద్ర సముద్రస్స

హేస్స రుద్రస్స హేస్స రుద్రస్స
హేసరభద్ర సముద్రస్స హేసరభద్ర సముద్రస్స

హేస్స రుద్రస్స హేసరభద్ర సముద్రస్స
హేస్స రుద్రస్స హేసరభద్ర సముద్రస్స
హేస్స రుద్రస్స హేసరభద్ర సముద్రస్స
హేస్స రుద్రస్స హేసరభద్ర సముద్రస్స
హేస్స రుద్రస్స హేసరభద్ర సముద్రస్స

భళి భళి భళిరా బళి సాహోరే బాహుబలి
జయహారతి నీకే పట్టాలి పట్టాలి
భళి భళి భళిరా బళి సాహోరే బాహుబలి
జయహారతి నీకే పట్టాలి పట్టాలి
భువనాలన్నీ జై కొట్టాలి గగనాలే ఛత్రం పట్టాలి


ఆదివారం, అక్టోబర్ 26, 2014

నల్లా నల్లాని కళ్ళ పిల్లా...

ఒకరి అభిరుచి ఒకరికి బాగా తెలిసినవారవడం వల్లో లేక ఇద్దరివీ ఒకే ఆలోచనలవడం వల్లో ఏమో తెలీదు కానీ రాజమౌళి సినిమా అనగానే కీరవాణి గారి హార్మోనియం మాంచి క్యాచీ ట్యూన్స్ ని పలికిస్తుంటుంది. రాజమౌళి తీసిన 'సై' సినిమా కోసం కీరవాణి స్వరపరచిన ఒక చక్కనిపాట ఈరోజు మీకోసం.. ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.


చిత్రం : సై (2004)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : శివశక్తి దత్త
గానం : కీరవాణి, చిత్ర
 
నల్లానల్లాని కళ్ళ పిల్లా
నీ మొగుడయ్యేవాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా
తెల్లారేసరికల్లా నే జిల్లాలన్నీ వెతికి
వాడ్నెల్లాగోలాగ తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా

నల్లానల్లాని కళ్ళ పిల్లా
నీ మొగుడయ్యేవాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా
తెల్లారేసరికల్లా నే జిల్లాలన్నీ వెతికి
వాడ్నెల్లాగోలాగ తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా

ఎర్రంగా బొద్దుగా ఉంటే  చాలా
ఒళ్ళోపెట్టుకు లాలి పాడి జోకొట్టాలా
అడుగులకే మడుగులు వత్తే వాడే మేలా
మీసం మీద నిమ్మకాయలు నిలబెట్టాలా
ఒప్పులకుప్ప వయ్యారిభామ
ముద్దులగుమ్మ చెప్పవే బొమ్మ
ఒప్పులకుప్పకి వయ్యారిభామకి
నచ్చిన మొగుడివి నువ్వేనమ్మా
ఆ.. నేనా.. నీతో సరిపోతానా.. 

నల్లానల్లాని కళ్ళ పిల్లాడా
నువ్ పెళ్ళాడేదెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా
తెల్లారేసరికల్లా నే జిల్లాలన్నీ వెతికి
దాన్నెల్లాగోలాగ  తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా
నల్లానల్లాని కళ్ళ పిల్లాడా
నువ్ పెళ్ళాడేదెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా

మెత్తంగా పువ్వులా ఉంటే చాలా
మొత్తంగా తానే చేసుకుపోతుండాలా
కులుకుల్లో స్వర్గం చేతికి అందించాలా
సయ్యంటే సయ్యని బరిలో దూకెయ్యాలా
కాళ్ళగజ్జా కంకాళమ్మా
ఎవరోయమ్మా ఖజురహోబొమ్మ
ఇంకెందుకులే దాపరికం 
ఆ నచ్చిన పిల్లవు నువ్వేనమ్మా
ఛీ.. నేనా.. నీతో సరిపోతానా.. 
సిగ్గుల మొగ్గల బూరెలబుగ్గల 

నల్లానల్లాని కళ్ళ పిల్లా
నిను పెళ్ళాడేవాడ్నిల్లా ఊరించి ఉడికించొద్దమ్మా
తెల్లారేసరికల్లా మనమెల్లాగోలాగ
మొగుడుపెళ్ళాలై పోయే దారి కాస్త చూపించేయమ్మా


నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.