ఒకరి అభిరుచి ఒకరికి బాగా తెలిసినవారవడం వల్లో లేక ఇద్దరివీ ఒకే ఆలోచనలవడం వల్లో ఏమో తెలీదు కానీ రాజమౌళి సినిమా అనగానే కీరవాణి గారి హార్మోనియం మాంచి క్యాచీ ట్యూన్స్ ని పలికిస్తుంటుంది. రాజమౌళి తీసిన 'సై' సినిమా కోసం కీరవాణి స్వరపరచిన ఒక చక్కనిపాట ఈరోజు మీకోసం.. ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.
చిత్రం : సై (2004)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : శివశక్తి దత్త
గానం : కీరవాణి, చిత్ర
నల్లానల్లాని కళ్ళ పిల్లా
నీ మొగుడయ్యేవాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా
తెల్లారేసరికల్లా నే జిల్లాలన్నీ వెతికి
వాడ్నెల్లాగోలాగ తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా
నల్లానల్లాని కళ్ళ పిల్లా
నీ మొగుడయ్యేవాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా
తెల్లారేసరికల్లా నే జిల్లాలన్నీ వెతికి
వాడ్నెల్లాగోలాగ తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా
ఎర్రంగా బొద్దుగా ఉంటే చాలా
ఒళ్ళోపెట్టుకు లాలి పాడి జోకొట్టాలా
అడుగులకే మడుగులు వత్తే వాడే మేలా
మీసం మీద నిమ్మకాయలు నిలబెట్టాలా
ఒప్పులకుప్ప వయ్యారిభామ
ముద్దులగుమ్మ చెప్పవే బొమ్మ
ఒప్పులకుప్పకి వయ్యారిభామకి
నచ్చిన మొగుడివి నువ్వేనమ్మా
ఆ.. నేనా.. నీతో సరిపోతానా..
నల్లానల్లాని కళ్ళ పిల్లాడా
నువ్ పెళ్ళాడేదెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా
తెల్లారేసరికల్లా నే జిల్లాలన్నీ వెతికి
దాన్నెల్లాగోలాగ తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా
నల్లానల్లాని కళ్ళ పిల్లాడా
నువ్ పెళ్ళాడేదెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా
మెత్తంగా పువ్వులా ఉంటే చాలా
మొత్తంగా తానే చేసుకుపోతుండాలా
కులుకుల్లో స్వర్గం చేతికి అందించాలా
సయ్యంటే సయ్యని బరిలో దూకెయ్యాలా
కాళ్ళగజ్జా కంకాళమ్మా
ఎవరోయమ్మా ఖజురహోబొమ్మ
ఇంకెందుకులే దాపరికం
ఆ నచ్చిన పిల్లవు నువ్వేనమ్మా
ఛీ.. నేనా.. నీతో సరిపోతానా..
సిగ్గుల మొగ్గల బూరెలబుగ్గల
నల్లానల్లాని కళ్ళ పిల్లా
నిను పెళ్ళాడేవాడ్నిల్లా ఊరించి ఉడికించొద్దమ్మా
తెల్లారేసరికల్లా మనమెల్లాగోలాగ
మొగుడుపెళ్ళాలై పోయే దారి కాస్త చూపించేయమ్మా
4 comments:
ఈ పాట దాదాపు ఇరవయ్యేళ్ళక్రితం నామొగుడు నా ఇష్టం అనే సినిమా కోసం కీరవాణిగారే స్వరపరిచారు.
మేం టేప్ రికార్డర్ కొన్న కొత్తలో ఆ కేసెట్ మా ఇంట్లో ఉండేది. ఆ పాటలో చరణాలు వేరే రకంగా ఉంటాయి. బాలుగారి గళంలో ఆ పాట చాలా అద్భుతంగా ఉంటుంది.
“నలపకులే నలుసేమోలే నేనూది పెడతాలే కన్నసలే సుకు మారంలే" అన్న లైను మరీమరీ వినాలనిపిస్తుంది.
........డా. జగదీష్, విజయనగరం.
ఓహ్ ఆ సినిమా గురించి పాట గురించి నాకు తెలీదండీ.. మంచి విషయం చెప్పారు. కీరవాణి గారికి ఇలా తన ట్రాక్స్ తనే రీయూజ్ చేసుకుని హిట్ చేయడం బాగా అలవాటు కదా. ఇది వరకూ కూడా సింహాద్రి లోనూ ఒక పాట ఇలానే రీయూజ్ చేశారు. థాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ జగదీష్ గారు.
ఇష్టమైన పాట..జెనీలియా చాలా అందంగా వుంటుందీ పాటలో..
థాంక్స్ శాంతి గారు...
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.