సోమవారం, అక్టోబర్ 13, 2014

మాఘమాస వేళలో...

కొన్నిపాటలు ఎన్నిసార్లు విన్నా అసలు బోర్ కొట్టడమనే మాటే ఉండదు అలాంటివాటిలో ఇదీ ఒకటి. జాతర సినిమా కోసం జి.కె.వెంకటేష్ గారి స్వర సారధ్యంలో మైలవరపు గోపీ గారి రచన. అప్పటివరకూ చిన్న పిల్లలకి మాత్రమే పాడుతున్న శైలజ గారు కథానాయిక కోసం పాడిన మొదటి పాటట ఇది. నాకు ఎంతో ఇష్టమైన పాటను మీరూ వినండి. ఈ పాట వీడియో ఎక్కడా దొరకనందువలన స్వరాభిషేకంలో శైలజ గారు పాడిన వీడియోను ఇక్కడ ఎంబెడ్ చేసి ఇస్తున్నాను. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : జాతర (1980)
సంగీతం : జి.కె.వెంకటేష్
సాహిత్యం : మైలవరపు గోపి
గానం : శైలజ

మాఘమాస వేళలో ఒకనాటి సంజెలో..
గొరవంకపై ఓ చిలుకకు గుబులాయెనెందుకో..
మాఘమాస వేళలో ఒకనాటి సంజెలో..
గొరవంక పై ఓ చిలుకకు గుబులాయెనెందుకో..

పెళ్ళిపీట పైన ఏ రాజు దాపున
చూపు చూపు లోన నూరేళ్ళ దీవెన
ఆ సమయమందు నేను..
ఆ సమయమందు నేను.. ఈ బిడియమోపలేను

గొరవంకపై ఓ చిలుకకు గుబులాయెనెందుకో..
మాఘమాస వేళలో ఒకనాటి సంజెలో..

వెన్నెల్లనడుగు మరుమల్లెనడుగు 
ఇల్లాలి మనసే కడు చల్లన
వెన్నెల్లనడుగు మరుమల్లెనడుగు 
ఇల్లాలి మనసే కడు చల్లన
ఈగుండెనడుగు నిట్టూర్పునడుగు
ఈగుండెనడుగు నిట్టూర్పునడుగు 
తొలిరేయి తలపే నులివెచ్చన
తొలిరేయి తలపే నులివెచ్చనా..

గొరవంక పై ఓ చిలుకకు గుబులాయెనెందుకో..
మాఘమాస వేళలో ఒకనాటి సంజెలో..

మా ఊరు తలుచుకుంటూ నీతోటి సాగనీ..
నిన్ను తలుచుకుంటూ మా ఊరు చేరనీ..
ఈ రాకపోకలందే...
ఈ రాకపోకలందే నను రేవు చేరుకోనీ..

గొరవంక పై ఓ చిలుకకు గుబులాయెనెందుకో..
మాఘమాస వేళలో ఒకనాటి సంజెలో..
గొరవంక పై ఓ చిలుకకు గుబులాయెనెందుకో.. 


2 comments:

మండుటెండలోనూ మంచిగంధంలా అనిపించే పాట..

అవునండీ చాలా కమ్మనైన పాట.. థాంక్స్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.