సోమవారం, అక్టోబర్ 06, 2014

తొలిసారి తలుపులు తీసి...

రహమాన్ తన ప్రైమ్ టైమ్ లో ట్యూన్ చేసిన ఒక చక్కని మెలోడీ ఇది. తన సంగీతం, సిరివెన్నెల గారి సాహిత్యం, చిత్రీకరణ అన్నీ ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్లుగా ఉంటాయి. కొన్ని పాటలు ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టవు కానీ కొంతకాలానికి మరుగున పడిపోతాయి. మళ్ళీ కొన్నాళ్ళకు ఉన్నట్లుండి ఏ ప్రశాంతపు సాయంత్రమో హఠాత్తుగా గుర్తొచ్చి కొన్నాళ్ళు అలా స్మృతిపథంలో తరచుగా మెదులుతూ ఉంటాయి. ఒక రెండు వారాలుగా నాకీపాట అలా పదే పదే గుర్తొస్తుంది. మీరూ ఈ అందమైన పాట చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ప్రేమంటే ప్రాణమిస్తా (1999)
సంగీతం : ఏ.ఆర్.రెహ్మాన్ 
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : ఉన్నికృష్ణన్, చిత్ర 

ఆ...తొలిసారి తలుపులు తీసి 
పిలిచిందీ మననే పచ్చని సీమా
మనదే ఈ ప్రాంతం మొత్తం .. 
తొలిజంటై పరిపాలిద్దాం రామ్మా ..
మంచిమూర్తం మించకముందే..
వలసపోయే పిట్టల మవుతూ..
ఈ వనం లో మజిలీ చేద్దాం చల్ !
గోరువంకల గానం విందాం .. 
వాగువంకల వేగం చూద్దాం ..
కొండకోనల నేస్తం చేద్దాం చల్ !

నువ్వు నేనే లోకం .. నవ్వులోనే స్వర్గం ..
ఆరారు ౠతువుల రాగం ఆనందమే
సంకురాత్రే నిత్యం .. సంబరాలే సాక్ష్యం ..
ఏడేడు జన్మలు ఉన్నవి మనకోసమే

తొలిసారి తలుపులు తీసి 
పిలిచింది మననే పచ్చని సీమా..
మనదే ఈ ప్రాంతం మొత్తం .. 
తొలిజంటై పరిపాలిద్దాం రామ్మా ..

ఏనాడు మన ఏకాంతం జంటను వీడదూ..
మనతోట విరులకు బరువై ఎన్నడు వాడదూ..
ఇటు రారే ఎవ్వరూ..ఇటుగా చూసేదెవ్వరూ..
ఈ భావనలో శ్రుతి మించిన స్వరఝరి 
చల్ చల్ చల్ అంటే..
అయ్యయ్యో వెల్లువ ఈ వన్నెల జిలుగులలో..
నవ యవ్వన లీలలో.. మనసెటు పయనించునో..

కడలి చేరే ఏరే చెలి చిందులూ..
మొలక నవ్వే ఎదకీ గిలిగింతలూ..
దాహం తో దాడి చేసి..మేఘాన్ని వేడి చేసి..
దివి గంగై ప్రణయం రాదా రాదా 
రాదా రాదా..రాగం తీసీ..

తొలిసారి తలుపులు తీసి 
పిలిచింది మననే పచ్చని సీమా..
మనదే ఈ ప్రాంతం మొత్తం .. 
తొలిజంటై పరిపాలిద్దాం రామ్మా ..
మంచిమూర్తం మించకముందే..
వలసపోయే పిట్టల మవుతూ..
ఈ వనం లో మజిలీ వేద్దాం చల్ !
గోరువంకల గానం విందాం .. 
వాగువంకల వేగం చూద్దాం ..
కొండకోనల నేస్తం చేద్దాం చల్ !

నువ్వు నేనే లోకం .. నవ్వులోనే స్వర్గం ..
ఆరారు ౠతువుల రాగం ఆనందమే
సంకురాత్రే నిత్యం .. సంబరాలే సాక్ష్యం ..
ఏడేడు జన్మలు ఉన్నవి మనకోసమే !

కనికట్టే కట్టీ కట్టీ ముడి వేసే చూపూ..
పసిపెట్టే రహస్యమేదో నాక్కూడా చెప్పూ..
ఆ చూపుల్లో మెరుపూ..కాలానికి మైమరపూ..
తన కళ్ళెదుటే జత వేడుక సాగుతూ..
నిలూ నిలూ నిలూ అంటే..
ఆహాహ అంటూ కాలం శిలగా మారినదా..
మన కథగా ఆగినదా..
వింతగ అనిపించదా..

ప్రణయగీతం అంటే జలపాతమే..
శిలను సైతం మీటే అనురాగమే..
అడుగడుగూ పూల పొందు..
హృదయం లో వలపు వాగు..
ప్రతి సంధ్యా మన్నూ మిన్నుల వలపే పాడూ..

తొలిసారి తలుపులు తీసి 
పిలిచింది మననే పచ్చని సీమా..
మనదే ఈ ప్రాంతం మొత్తం .. 
తొలిజంటై పరిపాలిద్దాం !

మంచిమూర్తం మించకముందే..
వలసపోయే పిట్టల మవుతూ..
ఈ వనం లో మజిలీ వేద్దాం చల్ !
గోరువంకల గానం విందాం .. 
వాగువంకల వేగం చూద్దాం ..
కొండకోనల నేస్తం చేద్దాం చల్

తొలిసారి తలుపులు తీసి 
పిలిచింది పచ్చని సీమా..
మనదే ఈ ప్రాంతం మొత్తం .. 
తొలిజంటై పరిపాలిద్దాం !

తొలిసారి తలుపులు తీసి 
పిలిచింది పచ్చని సీమా..
మనదే ఈ ప్రాంతం మొత్తం .. 
తొలిజంటై పరిపాలిద్దాం !

2 comments:

యిదే మొదటిసారండీ ఈ పాట వినడం..బావుంది..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.