శనివారం, అక్టోబర్ 18, 2014

నన్నేదొ సెయ్యమాకు...

సునీత, కీరవాణి, చంద్రబోస్ ఎవరికి వారే పోటీపడి పని చేసిన పాట.. సింహాద్రి సినిమాలోని ఈ "నన్నేదో సెయ్యమాకు" అనేపాట. ఈ పాట సునీత గారికి కొత్త అభిమానులను సంపాదించి ఉంటుందని నా అనుకోలు :-) కీరవాణి గారి కొన్ని ఫోక్ ట్యూన్స్ అమితంగా ఆకట్టుకుంటాయి. అపుడపుడు  సరదాగా వినడానికి నేను చాలా ఇష్టపడే ఈపాట మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.


చిత్రం : సింహాద్రి (2003) 
సంగీతం : కీరవాణి 
సాహిత్యం : చంద్రబోస్
గానం : కీరవాణి, సునీత

నన్నేదొ సెయ్యమాకు నడుము కాడ..హేయ్.హాఆ..
ఏదేదొ సెయ్యమాకు ఏటి కాడ..హేయ్..హాఆ..
ముద్దులెట్టి ముగ్గుల్లో దించమాకు
ముగ్గులోకి దించి నన్ను ముంచమాకు
నేనింక చిన్నదాన్నిరో..
 

సాకేదొ సెప్పమాకు సందకాడ..ఏ
సోకంతా దాచుకోకు ఆడ ఈడ..మ్మ్..ఏ
అడ్డమైన సిగ్గు నువ్వు చూపమాకు
అడ్డు గోడ పెట్టి నన్ను ఆపమాకు
అలవాటు చేసుకోవమ్మో
నన్నేదొ సెయ్యమాకు నడుము కాడ..మ్మ్..హా.ఆ..

కంది చేనుకు షికారుకెళితె
కందిరీగే నను కుడితే
కంది చేనుకు షికారుకెళితె
కందిరీగే నిన్ను కుడితే
మంట నాలో మొదలవుతుంటే 
మందు నేనె ఇస్తుంటే
పెదవి ఎంగిలి పైపైన పూస్తె
బాధ తగ్గి బాగుంది అంటు
హాయిగ కనులే మూస్తే

ఏదేదొ సెయ్యమాకు ఆడ ఈడ..హే...హాఆ..
నన్నేదో సెయ్యమాకు అందగాడా .. హేయ్.. హాఅ.. 
అంతకంటె హాయిగుంది వదులుకోకు
ముందుకొచ్చి ముట్టుకుంటే ముడుచుకోకు
అలవాటు చేసుకోవమ్మో

చింతపల్లి సంతకు వెళితె
ఓ.. చింతపూల చీర కొంటే 
మ్..చింతపల్లి సంతకు వెళితె
చింతపూల చీర కొంటే
కట్టు నీకు కుదరకపోతే
నువ్వు సాయం చేస్తుంటే 
చెంగు బొడ్లో దోపుతువుంటె
చెంగు మని నువు వులిక్కి పడగా
నాలో వుడుకే పుడితే

సాకేదొ సెప్పమాకు సందెకాడ..హా..ఏ
సోకంతా దాచుకోకు కోక నీడ..హే...ఏ
పెళ్ళి చీర కట్టే దాక రెచ్చిపోకు
పెద్ద పెద్ద ఆటలేవి ఆడమాకు
అలవాటు చేసుకోవయ్యో..ఓఓఓ..
నన్నేదొ సెయ్యమాకు నడుము కాడ.. 
హేయ్..హా...ఆ.. హేయ్... హ్మ్...


2 comments:

భలే ఉంటుందీ ట్యూన్..భూమికని కూడా మొదటి సారి చూశాము ఈ కైండ్ ఆఫ్ సాంగ్ గ్లామర్ బేస్డ్ సాంగ్ లో..

అవునండీ భూమిక ఇలాంటి పాటలలో చాలా తక్కువగా కనిపించారు. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు :-)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.