శుక్రవారం, అక్టోబర్ 31, 2014

నీ పలుకే త్యాగరాయ కీర్తన...

కళ్యాణి చిత్రం కోసం రమేష్ నాయుడు గారి స్వరసారధ్యంలో వచ్చిన వేటూరి వారి రచన ఈరోజు మీకోసం. ఎంత చక్కని పాటో.. ఇదీ రేడియో పరిచయం చేసిన పాటే.. కాకపోతే చిన్నతనంలో స్టేషన్ తిప్పేసేవాడ్ని కాస్త పెద్దయ్యాక కానీ ఈ సంగీతాన్ని ఆస్వాదించడం తెలియలేదు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : కళ్యాణి (1979)
సంగీతం : రమేశ్ నాయుడు 
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల

నీ ప మ పా..ఆ..ఆ..ఆ..ఆ
నీ ప మ ప గపాగగ రీసనీరిసా
నీని రిరి మారిస..పదనీరినీపనీ
పమప గపాగరీసనీరిసా

నీ పలుకే..ఏ..ఏ..ఏ..ఏ..
నీ పలుకే.. త్యాగరాయ కీర్తన..ఆ..ఆ..ఆ
నీ నడకే..క్షేత్రయ పద నర్తనా..ఆ.
నీ పలుకే.. త్యాగరాయ కీర్తనా..ఆ

సరిమా..రిమగా..ఆ.ఆ..సానిదపమ 
నీ పమపా..మపదా..సని గమ నిసనీ..ఈ..ఈ
నిసరిమప మాపదాస రిస నిదపా మరిసా
నిస రిమ పద

నీ పిలుపే..ఏ..ఏ...ఏ..ఏ..
నీ పిలుపే..జయదేవుని దీపికా..ఆ..ఆ
నీ వలపే..కాళిదాసు కవితా..ఆ..ఆ..లహరికా..ఆ
నీ పిలుపే..ఏ..ఏ..ఏ..ఏ..ఏ..ఏ..

నీ పలుకే ..ఏ..ఏ..త్యాగరాయ కీర్తన..

నీవు నన్ను కలుసుకున్న క్షణంలో..
తుంగభద్ర కృష్ణతో కలిసిందీ
నీవు నన్ను కలుసుకున్న క్షణంలో..ఓ..ఓ..ఓ
తుంగభద్ర కృష్ణతో కలిసిందీ
 
నేనూ..ఊ..ఊ..
నీ కౌగిలిలో కరిగిన సుముహుర్తములో
నేనూ..ఊ..ఊ..నేనూ..
నీ కౌగిలిలో కరిగిన సుముహుర్తములో..ఓ..ఓ..ఓ
ఆ కృష్ణవేణి.. సాగారన వెలిసిందీ
ఆ కృష్ణవేణి.. సాగారన వెలిసిందీ

అలనాటి నీ ఒంపుసొంపులన్నీ..
హంపిలో శిల్పాలై..అజంతా చిత్రాలై..
భారతభారతికే..ఏ..ఏ..హారతి పడుతున్నవీ
సుమ హారతి పడుతున్నవీ..

సరిమా..ఆ..రిమదా..ఆ.. 
సరిమా..ఆ..రిమదా..ఆ..సానిదపమ
నీ పిలుపే..ఏ..ఏ..ఏ..ఏ.. 
నీ పలుకే త్యాగరాయ కీర్తనా

నీతోనే నడిచిన ఏడడుగులే..ఏ...ఏ..ఏ
సంగీతంలో పలికే సప్తస్వరాలు..ఊ..ఊ..ఊ

స రి గ మ ప ద నీ...
నీలో..ఓ..ఓ..తొలి కలియకలో..ఓ..ఓ..
విరిసిన రస భావాలే..
నీలో..తొలి కలయికలో..ఓ..ఓ..
విరిసిన రసభావాలే..ఏ..ఏ..ఏ..ఏ
సాహిత్యంలో సాటిలేని కావ్యాలు..ఊ..
సాహిత్యంలో..ఓ. సా..టిలేని కావ్యాలు..ఊ..

ఈనాటి నీ వన్నెచిన్నెలన్నీ..
మరులలో మల్లియలై.. మరునికే..పల్లియలై..
జీవన బృందావనిలో..ఆమనులవుతున్నవి
సౌదామనులవుతున్నవి..ఈ..ఈ

సరిమా..ఆ..రిమదా..ఆ.. 
సరిమా..ఆ..రిమదా..ఆ..సానిదపమ
నీ పిలుపే..ఏ..ఏ..ఏ..ఏ.. 
నీ పలుకే త్యాగరాయ కీర్తనా

స ద పా.. 
ద ప గా..
స ద పా.. 
ద ప గా..
దపగరిసరిగపదా  
ఆ..ఆ..ఆ..ఆఅ..ఆఅ...ఆఅ..

2 comments:

ఇదే సినిమాలో 'ఆకాశంలో హాయిగా" అనే పాట కూడా పేథస్ సాంగ్ అయినా చాలా బావుంటుందండీ..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు... అవునండీ మరో మంచి పాట గుర్తు చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.