చక్రవర్తి గారి సంగీత సారధ్యంలో ఒక పిల్లతెమ్మెర లాంటి హాయైన పాట ఈ రోజు మీకోసం. సినిమా విజయంతో పని లేకుండా కొన్ని పాటలు అలా గుర్తుండి పోతాయి కారణమేదైనా కావచ్చు ఒకసారి కనెక్ట్ అయితే ఆ పాటలను మరువలేం.. ఇదీ అలాంటి పాటే. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : యుద్దభూమి (1988)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి
జాలి జాలి సందెగాలి లాలిపాడినా
తేలి తేలి మల్లెపూల తెమ్మెరాడినా
ఎందుకో నిదరపోదు నా వయసు బహుశా..
బహుశా.. ప్రేమించిందో ఏమో నా మనసు
సోలి సోలి లేత ఈడు సొమ్మసిల్లినా
చూసి చూసి రెండు కళ్ళు చెమ్మగిల్లినా
ఎందుకో నిలువనీదు నా మనసు బహుశా..
బహుశా.. విరహంలో వుందేమో ఆ సొగసు
పడమటింట పొద్దు వాలి గడియ పెట్టినా
తారకల్లు ఆకసాన దీపమెట్టినా
వాగులమ్మ అలల నీటి వీణ మీటినా
వెన్నెలమ్మ కనుల మీద వేణువూదినా
ఆగదు అందదు మనసు ఎందుకో
ఒడినే అడిగే ఒంటి మీద వలపు సోకి
కంటి మీద కునుకురాని కొంటె కోరిక
తెలుసుకో ఇక....!
జాలి జాలి సందెగాలి లాలిపాడినా
చూసి చూసి రెండు కళ్ళు చెమ్మగిల్లినా
కోకిలమ్మ కొత్త పాట కోసుకొచ్చినా
పూవులమ్మ కొత్త హాయి పూసి వెళ్ళినా
వానమబ్బు మెరుపులెన్ని మోసుకొచ్చినా
మాఘవేళ మత్తు జల్లి మంత్రమేసినా
తీరని తీయని మనసు ఏమిటో
అడుగు చెబుతా ఒంటిగుంటె ఓపలేక
జంట కట్టుకున్న వేళ చిలిపి కోరిక
తెలుపుకో ఇక...
సోలి సోలి లేత ఈడు సొమ్మసిల్లినా
చూసి చూసి రెండు కళ్ళు చెమ్మగిల్లినా
ఎందుకో నిలువనీదు నా మనసు బహుశా..
బహుశా.. విరహంలో వుందేమో ఆ సొగసు
జాలి జాలి సందెగాలి లాలిపాడినా
తేలి తేలి మల్లెపూల తెమ్మెరాడినా
ఎందుకో నిదరపోదు నా వయసు బహుశా..
బహుశా.. ప్రేమించిందో ఏమో నా మనసు
2 comments:
అప్పట్లో చిరంజీవికి వీరాభిమానినైన నేను ఈ సినిమా క్లైమాక్స్ లో చిరు నాగలితో హెలికాప్టర్ ని పేల్చేసినా..సాధ్యమే అని ఫ్రెండ్స్ తో వాదించాను..ఇప్పుడున్న పరిస్థితుల్లో మినిస్టర్స్ ఫండ్ నించి వైజాగ్ కి సాయమందిస్తే పక్కా అవకాశవాదమనిపించింది..బై ద వే వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ వేణూజీ..
హహహ ఒకప్పుడు నేనూ చిరు అభిమానినే కానీ ఇందులో కొన్ని పాటలు ఇష్టం తప్ప ఈ సినిమా భరించడం కష్టమేనండీ నాకు :-) ఇక రాజకీయాల్లో చిరు గురించి తలచుకోడం కూడా ఇష్టం లేదండీ. థాంక్స్ ఫర్ ద కామెంట్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.