మిత్రులందరకూ విజయదశమి శుభాకాంక్షలు. ఈ రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవి రూపంలో దర్శనమిస్తారు నైవేద్యంగా పులిహోర కానీ లేదా లడ్డూలు కానీ సమర్పించుకోవాలిట. ఈ సందర్బంగా స్వాతికిరణం సినిమాలో శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ముందు పాడే "శివానీ భవానీ" అనే పాటను తలచుకుందామా. నాకు చాలా ఇష్టమైనదీ పాట బాలు గారు పాడే విధానం దానికి మమ్ముట్టీ అభినయం రెండూ బాగుంటాయి. ఎంబెడ్ చేసిన ఫైల్ లో రెండునిముషాల వద్ద బాలుగారి వర్షన్ మొదలవుతుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : స్వాతికిరణం (1992)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు
శివానీ... భవానీ... శర్వాణీ...
గిరినందిని శివరంజని భవ భంజని జననీ
గిరినందిని శివరంజని భవ భంజని జననీ
శతవిధాల శ్రుతి విధాన స్తుతులు సలుపలేని
నీ సుతుడనే శివానీ
గిరినందిని శివరంజని భవ భంజని జననీ
గిరినందిని శివరంజని భవ భంజని జననీ
శతవిధాల శ్రుతి విధాన స్తుతులు సలుపలేని
నీ సుతుడనే శివానీ
శివానీ... భవానీ... శర్వాణీ...
శృంగారం తరంగించు సౌందర్య లహరివని... ఆ....
శృంగారం తరంగించు సౌందర్య లహరివనీ...
శాంతం మూర్తీభవించు శివానంద లహరివని... ఆ...
శాంతం మూర్తీభవించు శివానంద లహరివని...
కరుణ చిలుకు సిరినగవుల కనకధారవీవనీ
నీ దరహాసమే దాసుల దరిజేర్చే దారియనీ
శతవిధాల శ్రుతి విధాన స్తుతులు సలుపలేని
నీ సుతుడనే శివానీ
శివానీ... భవానీ... శర్వాణీ...
రౌద్రవీర రసోద్రిక్త భద్రకాళివీవనీ
భీతావహ భక్తాళికి అభయపాణివీవనీ
రౌద్రవీర రసోద్రిక్త భద్రకాళివీవనీ
భీతావహ భక్తాళికి అభయపాణివీవనీ
బీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివనీ
బీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివనీ...
భీషణాస్త్ర కేళివనీ...
అద్భుతమౌ అతులితమౌ లీల జూపినావనీ
గిరినందిని శివరంజని భవ భంజని జననీ
శతవిధాల శ్రుతి విధాన స్తుతులు సలుపలేని
నీ సుతుడనే శివానీ
శివానీ... భవానీ... శర్వాణీ...
శతవిధాల శ్రుతి విధాన స్తుతులు సలుపలేని
నీ సుతుడనే శివానీ
శివానీ... భవానీ... శర్వాణీ...
2 comments:
ముగింపు పాట అప్పాజీ కనిపించేది వేశారు..చాలా సంతోషమండీ..మీకు, మీ కుటుంబానికీ అమ్మవారి ఆశీస్సులు సంపూర్ణంగా వుంటాయి..
థాంక్స్ శాంతి గారు...
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.