బుధవారం, అక్టోబర్ 08, 2014

రామా హై రామా...

వీడెవడండీ బాబు సినిమాలో ఒక సరదా అయిన పాట ఈరోజు మీకోసం. పాట మెలోడియస్ గా స్వరాలతో చక్కగా ఉంటే చిత్రీకరణ మాత్రం చాలా చిత్రంగా ఉంటుంది. మీరు చూసీ వినీ ఎంజాయ్ చేయండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : వీడెవడండీ బాబు (1997)
సంగీతం : సిర్పి 
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : మనో, గీత 

రామ హై రామా నిన్నే వేడుతున్నా 
భామా ఓ భామా అంటూ పాడుతున్నా 
బదులు రాని ప్రేమ కీర్తన
రామ హై రామా నిన్నే వేడుతున్నా 
ఆ రామదాసు గానం వినలేదా 
ఈ ప్రేమదాసు రాగం ఏం చేదా హో.. 
ఆమెదాకా చేర్చు రామా హా..

రామ హై రామా నిన్నే వేడుతున్నా 

ఏ కన్నులలో నా కల ఉందో 
తెలిసే దాకా కునుకే రాదే 
నీరెప్పలనూ బంధించావని 
ఒక చిరుగాలి కబురిచ్చింది 
పైటను మీటుతున్న నా పాటను పోల్చుకో 
తలుపులు తీసి నన్ను నీ గుండెలో చేర్చుకో
విరహమింక ఎన్ని నాళ్ళనీ..

రామ హై రామా నిన్నే వేడుతున్నా 

చెంపకు చారెడు కన్నులు ఉన్నా
వాటికి నేనూ కనపడలేదా
ఆరడుగులతో ఎదురుగ ఉన్నా 
ఆమెకి నేను సరిపడలేదా 
మరీ పేద వాడ్ని కానులే ప్రేమకు నేను 
వరించాను అంటే చాలులే తరించనా నేను 
ఎలా నీకు విన్నవించనూ.. 

రామ హై రామా నిన్నే వేడుతున్నా 

2 comments:

నుస్రత్ ఫతే ఆలీఖాన్ స్టైల్లో వుంటుందీ ఫాట....హాంటింగ్ ట్యూన్..ముఖ్యంగా బ్రహ్మానందం రియాక్షన్స్ హైలైట్..

హహహ బ్రహ్మానందం స్క్రీన్ మీద కనిపిస్తే చాలు హైలైటే కదండీ శాంతి గారు :-) థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.