వర్షం సినిమాలోని ఈ అందమైన వాన పాట ఈరోజు మీకోసం... దేవీశ్రీ ప్రసాద్ సంగీతం చాలా బాగుంటుంది, ఇక సిరివెన్నెల గారి కలం వానకీ అమ్మాయికీ మధ్య స్నేహాన్ని గురించి ఎంత అందంగా వర్ణించిందో చెప్పడానికి మాటలు చాలవు. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : వర్షం(2003)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : చిత్ర, రకీబ్ ఆలం
చినుకు రవ్వలో చినుకు రవ్వలో
చిన్నదాని సంబరాన చిలిపి నవ్వులో
చినుకు రవ్వలో చినుకు రవ్వలో
చిన్నదాని సంబరాన చిలిపి నవ్వులో
పంచవన్నె చిలకలల్లె వజ్రాల తునకలల్లె
వయసు మీద వాలుతున్న వాన గువ్వలో
చినుకు రవ్వలో చినుకు రవ్వలో
చిన్నదాని సంబరాన చిలిపి నవ్వులో
ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన
ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన
చుట్టంలా వస్తావే చూసెళ్ళి పోతావే
అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే
చెయ్యార చేరదీసుకోనా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన
ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన
ముద్దులొలికే ముక్కుపుడకై
ఉండిపోవే ముత్యపు చినుకా
చెవులకు చక్కా జూకాల్లాగా
చేరుకోవే జిలుగుల చుక్కా
చేతికి రవ్వల గాజుల్లాగా
కాలికి మువ్వల పట్టీలాగా
మెళ్లో పచ్చల పతకంలాగా
వగలకు నిగ నిగ నగలను తొడిగేలా
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం : చిత్ర, రకీబ్ ఆలం
చినుకు రవ్వలో చినుకు రవ్వలో
చిన్నదాని సంబరాన చిలిపి నవ్వులో
చినుకు రవ్వలో చినుకు రవ్వలో
చిన్నదాని సంబరాన చిలిపి నవ్వులో
పంచవన్నె చిలకలల్లె వజ్రాల తునకలల్లె
వయసు మీద వాలుతున్న వాన గువ్వలో
చినుకు రవ్వలో చినుకు రవ్వలో
చిన్నదాని సంబరాన చిలిపి నవ్వులో
ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన
ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన
చుట్టంలా వస్తావే చూసెళ్ళి పోతావే
అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే
చెయ్యార చేరదీసుకోనా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన
ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన
ముద్దులొలికే ముక్కుపుడకై
ఉండిపోవే ముత్యపు చినుకా
చెవులకు చక్కా జూకాల్లాగా
చేరుకోవే జిలుగుల చుక్కా
చేతికి రవ్వల గాజుల్లాగా
కాలికి మువ్వల పట్టీలాగా
మెళ్లో పచ్చల పతకంలాగా
వగలకు నిగ నిగ నగలను తొడిగేలా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
ఆహా.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా
ఆహా.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా
ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన
ఎన్నాళ్ళని దాక్కుంటావే పైనా..
చిన్న నాటి తాయిలంలా
నిన్ను నాలో దాచుకోనా
కన్నె ఏటి సోయగంలా
నన్ను నీలో పోల్చుకోనా
పెదవులు పాడే కిలకిల లోనా
పదములు ఆడే కథకళి లోనా
కనులను తడిపే కలతల లోనా
నా అణువణువున నువు కనిపించేలా
ఎన్నాళ్ళని దాక్కుంటావే పైనా..
చిన్న నాటి తాయిలంలా
నిన్ను నాలో దాచుకోనా
కన్నె ఏటి సోయగంలా
నన్ను నీలో పోల్చుకోనా
పెదవులు పాడే కిలకిల లోనా
పదములు ఆడే కథకళి లోనా
కనులను తడిపే కలతల లోనా
నా అణువణువున నువు కనిపించేలా
నువ్వొస్తానంటే ఆ.. నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన
ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన
చుట్టంలా వస్తావే చూసెళ్ళి పోతావే
అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే
చెయ్యార చేరదీసుకోనా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
2 comments:
ఈ ఫాట మంచి పాటే కానీ..లాస్ట్ యియర్ మా ఇంటిపక్కనున్న గణేష్ పందిరిలో ప్రతీ సాయంకాలం ఈ పాటే వేసి విరక్తి కలిగించారండీ..
సూపర్ హిట్ పాటలన్నిటితోనూ ఇదే ప్రాబ్లమేమోనండీ.. చాలా సార్లు వినేశాక కొంచెంబోర్ కొట్టేస్తాయి కొన్నాళ్ళకి. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.