శుక్రవారం, అక్టోబర్ 10, 2014

వందనాలు వందనాలు...

జేగంటలు సినిమాకోసం వేటూరి గారు రాయగా కె.వి.మహదేవన్ గారు స్వారపరచిన ఒక చక్కని పాట ఈరోజు మీకోసం. యూట్యూబ్ పని చేయని వారు ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : జేగంటలు (1981)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : వేటూరి
గానం: బాలు, సుశీల

ఊ..హ..ఓ..హా...
వందనాలు..వందనాలు..
వలపుల హరిచందనాలు
వెన్నెలలో వేచి వేచి వెచ్చనైన..
నా స్వామికీ వందనాలు

 

ఊ..వందనాలు ..వందనాలు..
వలపుల హరిచందనాలు
కన్నులలో నీరు నిల్చి చల్లనైన...
నా దేవికీ వందనాలు...

ఊ..వందనాలు..వందనాలు..
వలపుల హరిచందనాలు

 
ఈ కన్నే కోపాలు.. వెన్నెల్లో దీపాలు..
ఆ ముద్దు మురిపాలు.. ఏ పొద్దు సగపాలు..
ఈ కంటి నీలాలు... ఆ కంట పోంగితే
సురగంగ నీరాల.. సరిగంగ తానాలు
 

ఈ చుక్క రాకతో నవరాత్రి నవ్వనీ...
ఈ ఒక్కరాతిరి తొలి రాతిరవ్వనీ...

 కలలన్నీ కలయికలే ...
కలుసుకొనే కౌగిలిలో...
 

వందనాలు.. 
ఊ.. వందనాలు వందానాలు
వలపుల హరిచందనాలు...
వెన్నెలలో వేచి వేచి
వెచ్చనైన నా స్వామికి..
వందనాలు వందనాలు..
వలపుల హరిచందనాలు

 
సంపెంగ పూలలో ..నా బెంగ దాచాను
సన్నజాజి నీడలో ..ఈ నోము నోచాను
 

ఏకాంత సేవకే.. ఇన్నాళ్ళు వేచాను
ఏకాంత వేళలో.. నీ చెంత చేరాను
నీ ప్రేమ కౌగిలే రామయ్య కోవెలా

 ఈ లేత వెన్నెలే జాబిల్లి దీవేనా
మనసులనే మనువాడే.. 

 వలపులనే వయసులలో
 
వందనాలు ..
ఊ..వందనాలు వందనాలు
వలపుల హరిచందనాలు

 కన్నులలో నీరు నిల్చి
చల్లనైన నా దేవికి 
వందనాలు... వందనాలు 
వలపుల హరిచందనాలు..
ఊ..ఊమ్మ్..ఊం..ఊమ్మ్

2 comments:

'వెన్నెలలో వేచి వేచి వెచ్చనైన నా స్వామికి" అని రాసిన అభినవ జయదేవుడు మన వేటూరి గారికి వందనాలు..

వేటూరి గారిని జయదేవుడితో చాలా బాగా పోల్చారండీ... థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.