మంగళవారం, అక్టోబర్ 07, 2014

కవ్వించే కళ్ళల్లో ఏవో ఏవో...

ఈ సినిమా పేరు మాత్రమే చెబితే మీలో చాలా మంది గుర్తించలేరేమో కానీ ఈపాట విన్నపుడు మాత్రం "అరే చాన్నాళ్ల తర్వాత విన్నామే... ఇంత మంచి పాటను ఎలా మర్చిపోయాం" అని ఖచ్చితంగా అనిపించి తీరుతుంది. నాకైతే ఎప్పుడో ఎనభైల్లో రేడియోలో మాత్రమే విన్న గుర్తు మళ్ళీ మొన్న ఏదో పాట గురించి వెతుకుతుంటే ఇది కనిపించి ఆశ్చర్యపరచింది. ఇళయరాజా గారు క్లాసికల్ స్టైల్లో కంపోజ్ చేసిన ఈ చక్కని పాటను మీరూ విని ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : పంచభూతాలు (1979)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల

ఆ..ఆఅ..ఆ..ఆ.ఆఆ...ఆ..
ఆ.ఆ..ఆ..

కవ్వించే కళ్ళల్లో కలలేవో
ఏవో ఏవో కదలాడే ఈవేళా
కవ్వించే కళ్ళల్లో కలలేవో
ఏవో ఏవో కదలాడే ఈవేళా
 

ఆ కలల కదలికల ఊగెనులే
తొలకరి వలపుల రసడోలా..ఆ..ఆ

కవ్వించే కళ్ళల్లో కలలేవో
ఏవో ఏవో కదలాడే ఈవేళా

 ఆ కలల కదలికల ఊగెనులే
తొలకరి వలపుల రసడోలా..ఆ..ఆ

అనురాగ వీణపై.. మనసేమో నాదమై..
తీయ తీయగా మ్రోయగా పదములాడగా

 సుదతి తనువే.. మదన ధనువై
అదను గని పదును పదును
మరుల విరులు కురియగ

కవ్వించే కళ్ళల్లో కలలేవో
ఏవో ఏవో కదలాడే ఈవేళా
ఆ కలల కదలికల ఊగెనులే
తొలకరి వలపుల రసడోలా..ఆ..ఆ

ఆ..ఆ.ఆఆఅ...ఆఆ...ఆ..ఆ

 లలిత పవన కర చలిత జలద గతిలో..ఓఓ.
నవ వికచ కుసుమ ముఖ
ముఖర భ్రమర రుతిలో..ఓఓ..
వనమే వధువై మనువే వరమై
పులకించే ఈ వేళా

 ఆషాఢ మేఘమే.. ఆనంద రాగమై..
చల చల్లగా జల్లుగా కవితలల్లగా
ప్రియుని తలపే.. పెళ్ళి పిలుపై..
చెలియకై ముత్యాల పందిట
రత్నాల పల్లకి నిలుపగా

 

కవ్వించే కళ్ళల్లో కలలేవో
ఏవో ఏవో కదలాడే ఈవేళా
ఆ కలల కదలికల ఊగెనులే
తొలకరి వలపుల రసడోలా..ఆ..ఆ

కవ్వించే కళ్ళల్లో కలలేవో
ఏవో ఏవో కదలాడే ఈవేళా



6 comments:

నాకైతే ఎప్పుడో ఎనభైల్లో రేడియోలో మాత్రమే విన్న గుర్తు
>>
i feel the same about this song,very nice song!

చాలా టిపికల్ కంపోజిషనండీ..ఫాస్ట్ గా అనిపించే అందమైన స్లో మెలొడి..

అవునండీ కరెక్ట్ గా చెప్పారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు...

ఇళయరాజా గారు తనపాట ట్యూన్ ని తానే కాపీ కొట్టుకోవటం కొన్ని సార్లు జరుగుతుంది. అభినందన, అన్వేషణ సినిమాల్లో "ఎదుటా నీవే" "ఇలలో" అనే పాటలు రెంటికీ ఒకటే ట్యూన్. అలానే ఈ పాట చరణాలు కూడా తర్వాత కాలంలో "సీతాకోకచిలుక లేత రామచిలుక" అన్న "స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్" అనే సినిమా పాటకి దాదాపు తర్జుమా చేశారు. ఒక్కసారి వింటే రెంటికీ ఉన్న సారూప్యం అవగతమవుతుంది.

అవును భవానీ ప్రసాద్ గారు కొన్ని పాటలు దర్శకులే అడిగి రిపీట్ చేయించుకుంటారని విన్నాను. అభినందన అన్వేషణ తెలిసినదే కానీ ఈ పాట చరణాలకు పోలిక భలే పట్టుకున్నారండీ విన్నాక అర్ధమైంది. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.