చిరంజీవి పాటల్లోని అరుదైన మెలోడీల్లో ఒక మరిచిపోలేని మాంచి మెలోడీ ఈ పాట. అయితే సినిమా అంతగా ఆడలేదు కనుక పాట కూడా తొందరగా కనుమరుగైంది అనుకుంటాను. నా ప్లేలిస్ట్ లో మాత్రం ఉంటుంది నెలకోసారైనా రిపీట్ అవుతూనే ఉంటుంది. బాలుగారు చాలా బాగా పాడారు. సాహిత్యం కూడా బాగుంటుంది కానీ ఎవరు రాశారో తెలియదు. ఈ పాట వీడియో కొంతే ఉంది పూర్తిపాట ఆడియోలో ఇక్కడ(ఐదవపాట) వినండి.
చిత్రం : చక్రవర్తి (1987)
సంగీతం : చక్రవర్తి
గానం : బాలు
సాహిత్యం : ??
ఏరు జోల పాడేనయ్యా సామి
ఊరు ఊయలయ్యేనయ్యా సామి
ఎండి మబ్బు పక్కల్లో సామి
నిండు సందమామల్లే సామి
నేను లాలి పాడాల నువ్వు నిద్దరోవాల
ఎన్నెలంటి మనసున్న సామి
ఏరు జోల పాడేనయ్యా సామి
ఊరు ఊయలయ్యేనయ్యా సామి
మనిసి రెచ్చిపోతా ఉంటే సామి
మంచి సచ్చిపోతున్నాది సామి
దిక్కులేని పిల్లా పాపా సామి
చరపలేని సేవ్రాలయ్యా సామి
జ్యోతుల్లాంటి నీ కళ్ళే..ఓ...
సీకటైన మా గుండెల్లో ఎన్నెల్లు
రాములోరి పాదాలే...ఓ...
రాతికైన జీవాలిచ్చే భాగ్యాలు
పట్టనీ నీ పాదాలు...
ఆంజనేయుడల్లే శాన్నాళ్ళు
ఏరు జోల పాడేనయ్యా సామి
ఊరు ఊయలయ్యేనయ్యా సామి
చెడ్డ పెరిగి పోతా ఉంది సామి
గడ్డు రోజులొచ్చేనయ్యా సామి
సుద్దులెన్నో సెప్పాలయ్యా సామి
బుద్ది మాకు గరపాలయ్యా సామి
నావకున్న రేవల్లే...ఏ...
మమ్ము దాచుకోవాలయ్యా నీ ఒళ్ళో
పూవు కోరు పూజల్లే...ఏ...
నేను రాలిపోవాలయ్యా నీ గుళ్ళో
కడగనీ నీ పాదాలు...
అంజిగాడి తీపి కన్నీళ్ళు
ఏరు జోల పాడేనయ్యా సామి
ఊరు ఊయలయ్యేనయ్యా సామి