సినిమా క్రైస్తవ చిత్రం కాకపోయినా క్రైస్తవ సినిమాపాటలు అనగానే మొదట గుర్తొచ్చేది మిస్సమ్మలోని "కరుణించు మేరి మాతా" అన్నపాట. లీలగారు పాడిన ఈ పాట సావిత్రి గారిపై చిత్రీకరించడం మరింత వన్నె తెచ్చింది. చిన్నపుడు రేడియోలో తరచుగా వినడమే కాదు కొందరు క్రైస్తవ మిత్రుల ఇంటికి వెళ్ళినపుడు సైతం ఈ పాట వారి కలెక్షన్ లో ఖచ్చితంగా ఉండేది. ఆడియో ఇక్కడ వినవచ్చు.
చిత్రం : మిస్సమ్మ (1955)
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
సాహిత్యం : పింగళి
గానం : లీల
కరుణించు మేరిమాతా శరణింక మేరిమాతా
నీవే శరణింక మేరిమాతా
పరిశుద్దాత్మ మహిమ వరపుతృగంటి వమ్మ..
పరిశుద్దాత్మ మహిమ వరపుతృగంటి వమ్మ..
ప్రభు ఏసునాధు కృపచే మా భువికి కలిగే రక్ష..
కరుణించు మేరిమాతా శరణింక మేరిమాతా
నీవే శరణింక మేరిమాతా
భువి లేని దారిజేరీ పరిహాసమాయే బ్రతుకు
భువి లేని దారిజేరీ పరిహాసమాయే బ్రతుకు
క్షణమైన శాంతిలేదే దినదినము శోధనాయే
కరుణించు మేరిమాతా శరణింక మేరిమాతా
నీవే శరణింక మేరిమాతా
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
ఇక ఈ పాట సినిమా పాటకాకపోయిన తెలుగు క్రైస్తవ గీతాలలో అత్యంత ప్రాచుర్యాన్ని పొందిన పాట. మాసిలామణి గారు రాసిన ఈపాట చరణాలన్నీ ఒకే విధమైన పదాల అల్లికతో సంగీతంతో ఎన్ని చరణాలున్నా పాడడం సులువుగా ఉంటుంది. ఈ పాట పూర్తి లిరిక్ కోసం ఇక్కడ చూడండి. ఇక్కడ నాకు నచ్చిన మొదటి మూడు చరణాలను మాత్రం పొందుపరుస్తున్నాను. వీడియోలు అన్నీ రిమిక్స్ వర్షన్స్ దొరికాయి కానీ చిన్నప్పుడు నేను విన్న పాటలో అయితే సింపుల్ అర్కెస్ట్రేషన్ తో వినడానికి మరింత హాయినిచ్చేది.
నడిపించు నా నావ, నడి సంద్రమున దేవ
నవ జీవన మార్గమున, నా జన్మ తరియింప
నా జీవిత తీరమున, నా అపజయ భారమున
నలిగిన నా హృదయమును, నడిపించుము లోతునకు
నాయాత్మ విరబూయ, నా దీక్ష ఫలియింప
నా నావలో కాలిడుము, నా సేవ జేకొనుము
నడిపించు నా నావ, నడి సంద్రమున దేవ
నవ జీవన మార్గమున, నా జన్మ తరియింప
రాత్రంతయు శ్రమపడినా, రాలేదు ప్రభు జయము
రహదారులు వెదకినను, రాదాయెను ప్రతిఫలము
రక్షించు నీ సిలువ, రమణీయ లోతులలో
రాతనాలను వెదకుటలో, రాజిల్లు నా పడవ
నడిపించు నా నావ, నడి సంద్రమున దేవ
నవ జీవన మార్గమున, నా జన్మ తరియింప
ఆత్మార్పణ చేయకయే, ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే, అరసితి ప్రభు నీ కలిమి
ఆశ నిరాశాయే, ఆవేదనేదురాయే
ఆధ్యాత్మిక లేమిగని, అల్లాడే నా వలలు
నడిపించు నా నావ, నడి సంద్రమున దేవ
నవ జీవన మార్గమున, నా జన్మ తరియింప
4 comments:
బజ్జ్ లో లాగ ఇక్కడ కూడా లైక్ కొట్టే ఫెసిలిటీ ఉంటే బావుండును...:))
one like..:))
హహహ తృష్ణ గారు :-) పోస్ట్ రేటింగ్ ఆప్షన్ ఎనేబుల్ చేశాను కానీ ఆ బటన్స్ డిస్ప్లే అవడంలేదండీ టెంప్లేట్ ప్రాబ్లం అనుకుంటా.. చూడాలి..
ఆ ఇప్పుడు అలకపోయింది...నాకిష్టమైన పాట పెట్టేసారు కదా! :)
super collection వేణు. సాగరతీర సమీపాన కూడా పెట్టండి త్వరగా...నేనెప్పుడూ వినలేదు. అందరూ చెబుతూ ఉంటే వినాలని కుతూహలంగా ఉంది.
హహహ సౌమ్య :-) నెనర్లు... మీరడిగిన పాట రేపుదయమే రాబోతుంది :-))
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.