సోమవారం, డిసెంబర్ 26, 2011

నారాయణ మంత్రం...

సుశీలమ్మగారు అద్భుతంగా గానం చేసిన ఈ పాట నాకు చాలా ఇష్టమైన భక్తి గీతాలలో ఒకటి ఎన్ని వేల సార్లు విన్నా స్కిప్ చేయాలని అనిపించదు. నారాయణ మంత్రంలోని శక్తే అదేమో తెలీదు కానీ “ఓం నమో నారాయణాయ” అని మొదలెట్టగానే ఒళ్ళు ఒకసారిగా జలదరిస్తుంది ఆపై మనకి తెలియకుండానే పాటలో లీనమైపోతాం. “మనసున తలచిన చాలుగా” అన్నచోట సుశీల గారు పలికే విధానం నాకు చాలా నచ్చుతుంది. చివరికి వచ్చేసరికి కోరస్ తో పాటూ మనమూ నాథహరే అని పాడుకుంటూ లయబద్దంగా ఊగుతూ మనసులోనే జగన్నాథుడిని దర్శించుకుంటాం. ఈ పాట రాగాలో ఇక్కడ వినండి.
చిత్రం : భక్తప్రహ్లాద
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : సముద్రాల
గానం : సుశీల

ఓం నమో నారాయణాయ (6)
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
భవబంధాలు పారద్రోలి పరమునొసంగే సాధనం

నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం

గాలిని బంధించి హసించి గాసిల పనిలేదు
గాలిని బంధించి హసించి గాసిల పనిలేదు
జీవుల హింసించే క్రతువుల చేయగ పనిలేదు
జీవుల హింసించే క్రతువుల చేయగ పనిలేదు
మాధవ మధుసూధన అని మనసున తలచిన చాలుగా
మాధవ మధుసూధన అని మనసున తలచిన చాలుగా

నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం

తల్లియు తండ్రియు నారాయణుడె
గురువు చదువు నారాయణుడె
యోగము యాగము నారాయణుడె
ముక్తియు దాతయు నారాయణుడె
భవబంధాలు పారద్రోలి పరమునొసంగే సాధనం

నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం
నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం

నాథహరే శ్రీ నాథహరే
నాథహరే జగన్నాథహరే

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.